News


మార్కెట్‌కు ఆర్‌బీఐ ఝలక్‌..!

Thursday 5th December 2019
Markets_main1575542026.png-30077

 వడ్డీరేట్లు తగ్గించకపోవడంతో నిరాశ
సెన్సెక్స్‌ 71పాయింట్ల నష్టం
25 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
నష్టాల బాట పట్టిన బ్యాంకింగ్‌, అటో రంగ షేర్లు
మార్కెట్‌ వర్గాల అంచనాలకు భిన్నంగా ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను యథాతధంగా ఉంచుతున్నట్లు ప్రకటించడంతో మార్కెట్‌ గురువారం నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్‌ 71పాయింట్లు నష్టపోయి 40,779.59 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 25 పాయింట్ల పతనమై 12,018 వద్ద ముగిసింది. మూడు రోజుల పాటు సాగిన పాలసీ సమావేశాల అనంతరం నేడు వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా యథాతధంగా కొనసాగినట్లు ఆర్‌బీఐ అనూహ్య నిర్ణయం ప్రకటించింది. ఫలితంగా వడ్డీరేట్లకు అనుసంధానమై ట్రేడయ్యే అటో, బ్యాంకింగ్‌ రంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 266 పాయింట్లు నష్టపోయి 31,712.95 వద్ద ముగిసింది. ఇండెక్స్‌లో అన్ని షేర్లు నష్టాలతో ముగిశాయి. వాటితో పాటు ఫార్మా, మెటల్‌ షేర్లలో నెలకొన్న విక్రయాలు కూడా నష్టాలకు కారణమయ్యాయి. మరోవైపు ఇన్ఫోసిన్‌, టీసీఎస్‌ షేర్ల ర్యాలీ సూచీల నష్టాలను పరిమితం చేసిందని చెప్పవచ్చు. అలాగే ఐటీసీ, ఎల్‌అండ్‌ షేర్ల పెరుగుదల సూచీల పతనాన్ని అడ్డుకుంది. . ఇక సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టం 41,002 నుంచి 223 పాయింట్లను, నిఫ్టీ డే హై 12,081.20 నుంచి 63 పాయింట్లను కోల్పోయింది. బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ సైతం ఇంట్రాడే గరిష్టం నుంచి 414 పాయింట్లు నష్టపోయింది. మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 17000 పాయింట్ల  దిగువను ముగిసింది. 

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటాస్టీల్‌, భారతీఎయిర్‌టెల్‌, కోల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌ షేర్లు 2.50శాతం నుంచి 3.50శాతం  మేర నష్టపోయాయి. బ్రిటానియా, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ, టీసీసీఎల్‌, జీలిమిటెడ్‌ షేర్లు 1శాతం నుంచి 6శాతం వరకూ లాభపడ్డాయి. 

 



You may be interested

ఆర్‌ఐఎల్‌పై సీఎల్‌ఎస్‌ఏ బుల్లిష్‌

Thursday 5th December 2019

అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ ఆర్‌ఐఎల్‌ పట్ల బుల్లిష్‌గా ఉంది. అలాగే లెమన్‌ట్రీ హోటల్స్‌ స్టాక్‌ విషయంలో సానుకూలంగా ఉంది. ఈ రెండు స్టాక్స్‌ వచ్చే ఏడాది కాలంలో ప్రస్తుత స్థాయి నుంచి కనీసం 25 శాతానికిపైనే రాబడులను ఇస్తాయని అంచనా వేస్తోంది.   జియో టారిఫ్‌ పెంపు నేపథ్యంలో ఆర్‌ఐఎల్‌ టార్గెట్‌ ధరను గతంలో ఇచ్చిన రూ.1,710 నుంచి రూ.2,010కు సీఎల్‌ఎస్‌ఏ పెంచింది. ప్రస్తుత స్థాయి నుంచి 30.6 శాతం వృద్ధికి

నాలుగేళ్లలో ఆర్‌ఐఎల్‌ డబుల్‌!

Thursday 5th December 2019

టీసీజీ ఏఎంసీ ఎండీ చక్రి లోక్‌ప్రియ అంచనా దేశీయ చమురు దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు వచ్చే నాలుగేళ్లలో రెట్టింపు కావచ్చని టీసీజీ ఏఎంసీ ఎండీ చక్రి లోక్‌ప్రియ్‌ అంచనా వేశారు. ప్రస్తుతం కంపెనీ అన్ని విభాగాలు జోరుమీదున్నాయన్నారు. జియో లాభాలు పెరుగుతాయని, రిటైల్‌ వ్యాపారం మరింత విస్తరిస్తుందని అందువల్ల రాబోయే మూడేళ్లలో షేరు 20-25 శాతం చక్రీయ వార్షిక వృద్ధి నమోదు చేయగలదని అభిప్రాయపడ్డారు. ఇంకా వివిధ అంశాలపై ఆయన

Most from this category