News


డీమెర్జర్‌ ప్రకటన.. రేమండ్‌ 20 శాతం అప్‌

Friday 8th November 2019
Markets_main1573196206.png-29447

దేశీయ టెక్స్‌టైల్‌ దిగ్గజం రేమండ్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో 20 శాతం మేర దూసుకుపోయింది. కంపెనీకి చెందిన లైఫ్‌స్టైల్‌ వ్యాపారాన్ని విడదీసి ప్రత్యేక సంస్థగా లిస్టింగ్‌కు తీసుకువస్తామని రేమండ్‌ ప్రకటించింది. దీంతో ఇకపై రేమండ్‌ రెండు కంపెనీలుగా మారనుంది. కొత్తగా ఏర్పడే కంపెనీ సంస్థకు కీలకమైన బ్రాండెడ్‌ టెక్స్‌టైల్స్‌, అపెరల్‌ వ్యాపారాన్ని చూసుకుంటుంది. పాత కంపెనీ కొత్తగా ఆరంభిస్తున్న రియల్టీ ప్రాజెక్టులు, ల్యాండ్‌ బ్యాంక్‌, ఇంజనీరింగ్‌, ఎఫ్‌ఎంసీజీ వ్యాపారాలను చూసుకుంటుంది. డీమెర్జర్‌ అనంతరం లిస్టింగ్‌ మిర్రర్‌ షేర్‌హోల్డింగ్‌ ప్రకారం జరుగుతుందని కంపెనీ తెలిపింది. ఇందులో రేమండ్‌ ఇన్వెస్టర్లకు ఒక్కొక్క షేరుకు కొత్తగా ఏర్పడే కంపెనీకి చెందిన ఒక షేరును కేటాయిస్తారు.(1:1). మరోవైపు తన అనుబంధ కంపెనీ జేకేఐటీకి సీసీపీఎస్‌, ఈక్విటీ షేర్ల కేటాయింపుపై రేమండ్‌ ఇంకొక ప్రకటన చేసింది. ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ. 225 కోట్లు, సీసీపీఎస్‌ జారీతో రూ. 125 కోట్లు సమకూర్చుకుంటామని తెలిపింది. ఈక్విటీ, సీసీపీఎస్‌లను ఒక్కొకటి రూ. 674 చొప్పున కేటాయిస్తామని వెల్లడించింది. వచ్చే మొత్తంలో రూ. 350 కోట్లను కంపెనీ నెత్తిన ఉన్న రుణాలు తీర్చేందుకు వాడతామని వివరించింది. ఈ వార్తలతో కంపెనీ షేరు 20 శాతం లాభపడి రూ. 808 ఇంట్రాడే హైని తాకింది. షేరు తన ఏడాది గరిష్ఠానికి దాదాపు 9 శాతం దిగువన ఉంది. మధ్యాహ్నం 12.23 కు షేరు రూ.798 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

9.50శాతం లాభపడ్డ యస్‌బ్యాంక్‌

Friday 8th November 2019

ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేరు శుక్రవారం మిడ్‌సెషన్‌ కల్లా 9.50శాతం ర్యాలీ చేసింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు​రూ.66.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రైవేట్‌ రంగ షేర్ల ర్యాలీలో భాగంగా ఈ కంపెనీ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒకదశలో 9.54శాతం పెరిగి రూ.72.30 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12:30లకు షేరు క్రితం ముగింపు(రూ.66.50)తో పోలిస్తే 7.50శాతం లాభంతో రూ.71.35

మూడీస్‌ డౌన్‌గ్రేడ్‌ ప్రభావం వుండదు..ఆర్థిక శాఖ

Friday 8th November 2019

దేశ ఆర్థిక వృద్ధి గతంలో కంటే బలహీనంగా ఉందని ఇండియా క్రెడిట్‌ రేటింగ్‌ అవుట్‌టుక్‌ను, అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ ‘స్థిరం’ నుంచి ‘ప్రతికూలం’ కు తగ్గించింది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రతిస్పందించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రాధమిక అంశాలు బలంగా ఉన్నాయని, ప్రభుత్వం తాజాగా తీసుకున్న వరుస ఆర్థిక సంస్కరణలు పెట్టుబడులను పెంచుతాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ

Most from this category