News


బేర్స్‌ను భయపెట్టలేకపోయిన రేట్‌కట్‌!

Saturday 5th October 2019
Markets_main1570259320.png-28735

ఆర్‌బీఐ తాజాగా ప్రకటించిన రేట్ల తగ్గింపు మార్కెట్లో ఇన్వెస్టర్లకు పెద్దగా సరిపోయినట్లు కనిపించలేదు. మార్కెట్‌ అంచనాలకు తగ్గట్లు ఆర్‌బీఐ రేట్లు తగ్గించకపోవడంతో మరోమారు బేర్స్‌ చెలరేగారు. ముఖ్యంగా విదేశీ ఫండ్స్‌ అమ్మకాల వెల్లువతో గత నెల చివర్లో వచ్చిన జోష్‌ మొత్తం ఆవిరయ్యేలా కనిపిస్తోందని నిపుణులు భయపడుతున్నారు. దేశ ఎకానమీ ఆరోగ్యంపై ఆందోళనలకు మార్కెట్‌ అమ్మకాలు తోడవడం మరింత భయాలను రేకెత్తిస్తోందంటున్నారు. వారం మొత్తానికి సూచీలు దాదాపు 3 శాతం నష్టపోయాయి. ఆర్‌బీఐ తాజా సమావేశంలో 35 బేసిస్‌ పాయింట్ల మేర రేట్లు తగ్గించవచ్చని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఆర్థిక మందగమన నేపథ్యంలో ఈసారి కూడా ఆర్‌బీఐ 35బీపీఎస్‌ మేర రేట్లను తగ్గిస్తుందని మార్కెట్‌ ఆశించిందని మోతీలాల్‌ ఓస్వాల్‌ వ్యాఖ్యానించింది. బ్యాంకుల ఆస్తుల నాణ్యతపై సందేహాలు, ఎఫ్‌ఐఐల అమ్మకాలు కలిసి మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయని తెలిపింది. ఇటీవల కాలంలో కొన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించిన ఆస్తుల నాణ్యతపై ఆందోళనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. 
గతనెల 20న ప్రభుత్వం కార్పొరేట్‌ టాక్స్‌ను తగ్గించడంతో మార్కెట్లలో ఒక్కమారుగా ర్యాలీ వచ్చింది. అయితే మరోవైపు కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపు విత్తలోటుపై నెగిటివ్‌ ప్రభావం చూపే అవకాశాలున్నాయని కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్‌ఐఐల అమ్మకాల జోరులో మార్కెట్‌ మరింత దిగజారకుండా డీఐఐల కొనుగోళ్లు కొంతమేర ఆదుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మందగమన నిరోధానికి తీసుకుంటున్న చర్యలకు తోడుగా ఆర్‌బీఐ తన మానిటరీ విధానాన్ని మరింత సరళతరం చేయాలని ఎక్కువమంది మార్కెట్‌ ఇన్వెస్టర్లు కోరుకుంటున్నారు. శుక్రవారం ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం నిరాశపరిచినా, మరింత రేట్ల తగ్గింపునకు ఆర్‌బీఐ సుముఖంగానే ఉండడం పాజిటివ్‌ అంశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డిసెంబర్‌ మీటింగ్‌లో మరో పావు శాతం మేర రేట్‌కట్‌ ఉండొచ్చని ఎక్కువమంది ఎకనమిస్టుల అంచనా. 



You may be interested

4రోజుల పసిడి లాభాలకు బ్రేక్‌..!

Saturday 5th October 2019

ఆర్థిక మాంద్య భయాలతో వరుసగా నాలుగు రోజుల ర్యాలీ చేస్తున్న పసిడి ధరకు శుక్రవారం బ్రేక్‌ పడింది. అమెరికాలో నిన్నరాత్రి ఔన్స్‌ పసిడి ధర అంతకు ముందు ముగింపు(1,514డాలర్లు)తో పోలిస్తే 1డాలరు స్వల్ప నష్టంతో 1513డాలర్ల వద్ద స్థిరపడింది. అమెరికాలో సెప్టెంబర్‌ కార్మిక ఉపాధి కల్పన గణాంకాలు మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా నమోదయ్యాయి. ఈ సెప్టెంబర్‌లో  1.35లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. గణాంకాలు అక్టోబర్‌లో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల

అమెరికా మార్కెట్లకు జాబ్స్‌ డేటా జోష్‌..!

Saturday 5th October 2019

ఆశాజనకంగా వెలువడిన సెప్టెంబర్‌ కార్మిక శాఖ​ గణాంకాలు ఆర్థిక మాంద్య భయాలను కొంత తగ్గించిన నేపథ్యంలో శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లు లాభంతో ముగిశాయి. డో జోన్స్‌ ఇండస్ట్రీయల్‌ ఏవరేజ్‌ ఇండెక్స్‌ 1.50శాతం(372.68 పాయింట్లు) పెరిగి 26,573.72 వద్ద, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్ 1.42శాతం(42 పాయింట్లు) లాభపడి 2,952.01 వద్ద, నాస్‌డాక్‌ కాంపోజిట్‌ 1.4శాతం(110 పాయింట్లు) పెరిగి 7,982.47 వద్ద స్థిరపడ్డాయి. ఈ వారం మొత్తంలో ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ 0.3శాతం, డోజోన్స్‌ 0.10శాతం

Most from this category