News


యస్‌ బ్యాంక్‌కు రాణాకపూర్‌ సంస్థలు గుడ్‌బై!

Tuesday 19th November 2019
Markets_main1574157988.png-29707

రాణా కపూర్‌ ప్రమోటర్‌గా ఉన్న యస్‌ క్యాపిటల్‌, మోర్గాన్‌ క్రెడిట్స్‌, యస్‌ బ్యాంక్‌లో తమకున్న మిగిలిన 0.8 శాతం వాటాను విక్రయించాయి. ఈ విషయాన్ని యస్‌ బ్యాంక్‌ మంగళవారం ఎక్సేంజ్‌కు తెలిపింది. ఎక్సేంజ్‌ ఫైలింగ్‌ ప్రకారం..ఈ ప్రమోటర్‌ కంపెనీలు ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా  నవంబర్‌ 13-14 తేదీలలో 2.04 కోట్ల షేర్లను విక్రయించాయి. ప్రస్తుతం ఈ కంపెనీలు కేవలం 900 యస్‌ బ్యాంక్‌ షేర్లను మాత్రమే కలిగివుండడం గమనార్హం. ప్రమోటర్లు తమ వాటాను విక్రయించడంతో యస్‌ బ్యాంక్‌ షేరు మంగళవారం సెషన్‌లో మధ్యాహ్నాం 3.23 సమయానికి 2.89 శాతం పడిపోయి రూ. 63.95 వద్ద ట్రేడవుతోంది. దీనికి ముందు యస్‌ క్యాపిటల్‌, మోర్గాన్‌ క్రెడిట్స్‌, రాణా కపూర్‌ కలిసి 552 లక్షల షేర్లు లేదా 2.16 శాతం వాటాను ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా సెప్టెంబర్‌ 26-27 తేదీలలో విక్రయించిన విషయం తెలిసిందే. ఈ కంపెనీలతో పాటు రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ ఎసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ కూడా యస్‌ బ్యాంక్‌లోని తమ 3.92 శాతం వాటాను సెప్టెంబర్‌ చివరి నాటికి విక్రయించాయి. సెప్టెంబర్‌ త్రైమాసికం పూర్తయ్యే సమయానికి యస్‌ బ్యాంక్‌లో రాణా కపూర్‌ 3.92 శాతం వాటాను కలిగివుండగా, యస్‌ క్యాపిటల్‌ 0.8 శాతం వాటాను కలిగివుంది. 



You may be interested

వారం గరిష్టం వద్ద నిఫ్టీ ముగింపు

Tuesday 19th November 2019

ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులతో ఊగిసలాడిన సూచీలు.. బ్యాంకింగ్‌,  టెలికాం షేర్ల ర్యాలీతో పాటు ఇండెక్స్‌ల్లో అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ర్యాలీతో చివరకు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 185.51 పాయింట్లు పెరిగి 40,469.70 వద్ద, నిఫ్టీ 55.60 పాయింట్ల లాభంతో 11,940.10 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ ఇండెక్స్‌ ఈ ముగింపు స్థాయి వారం రోజుల గరిష్ట స్థాయి కావడం విశేషం. మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రభుత్వరంగ

ఆప్షన్‌ ట్రేడింగ్‌లో మితేష్‌ సక్సెస్‌ మం‍త్రం!

Tuesday 19th November 2019

ఆరంభ నష్టాల నుంచి అద్భుత లాభాల దిశగా పయనం ఆప్షన్‌ సెల్లింగే కీలకమని సలహా   ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ సూత్రాన్ని కచ్ఛితంగా పాటించి ఆప్షన్‌ ట్రేడింగ్‌లో సక్సెసయిన వ్యక్తి మితేష్‌ పటేల్‌. తన వేతనంతో మార్కెట్లో అనేక ‍ప్రయోగాలు చేసి దశాబ్దకాలం తర్వాత చివరకు సక్సెస్‌ మంత్రాన్ని కనుగొన్నాడు. అసలెవరీ మితేష్‌? ఏం సాధించాడు?.. చూద్దాం.. గుజరాత్‌లోని చిన్న గ్రామంలో జన్మించిన మితేష్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌ చేశాడు. అనంతరం పలు కెమికల్‌ పరిశ్రమల్లో ఉద్యోగాలు

Most from this category