News


రాణా కపూర్‌ ఎఫెక్ట్‌: రెండోరోజూ కుప్పకూలిన యస్‌బ్యాంక్‌

Tuesday 1st October 2019
Markets_main1569922828.png-28659

ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌ షేర్లు మంగళవారం మరోసారి భారీ నష్టాన్ని చవిచూశాయి. నేటి ఎన్‌ఎస్‌ఈలో ఈ బ్యాంక్‌ షేర్లు రూ.42.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ఆరంభంలో ప్రైవేట్‌రంగ షేర్లకు కొంత కొనుగోళ్ల మద్దతు లభించడంతో 7శాతం మేర లాభపడ్డాయి. బ్యాంక్‌ ప్రధాన ప్రమోటర్‌ రాణా కపూర్‌ కంపెనీ మోర్గాన్‌ క్రెడిట్స్‌ తన మొత్తం వాటాలో 2.16శాతం వాటాకు సమానమైన 5.2కోట్ల ఈక్విటీ షేర్లను 26-27 తేదీల్లో ఓపెన్ మార్కెట్లో విక్రయించందనే వార్తలు వెలుగులోకి రావడంతో బ్యాంక్‌ షేర్లలో అనూహ్యంగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒక దశలో 30శాతం మేర క్షీణించి రూ.29.00 ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. షేర్ల భారీ పతనంతో బ్యాంక్‌ రూ.8వేల కోట్లకు చేరుకుంది.  మధ్యహ్నాం గం.2:45ని.లకు షేరు​ క్రితం ముగింపు(రూ.41.40)తో పోలిస్తే 25శాతం నష్టంతో రూ.31.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.29.00, రూ.286.00గా నమోదయ్యాయి. ఈ రెండు రోజుల్లోనే షేరు 32శాతం పతనమగా, 6నెలల్లో షేరు 85శాతం నష్టపోయింది. ఇటీవల కంపెనీ ప్రధాన ప్రమోటింగ్‌ సంస్థల్లో ఒకటైన యస్‌ క్యాపిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ(వైసీపీఎల్‌) ప్రతి షేరు ధర రూ.51.94 చొప్పున మొత్తం 4.65 కోట్ల ఈక్విటీ షేర్లను(1.82శాతం వాటాకు సమానం) రూ.241.5 కోట్లకు విక్రయించింది. 



You may be interested

భారీ పతనానికి కారణాలు..!

Tuesday 1st October 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో వరుసగా మంగళవారం ట్రేడింగ్‌లో కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. బ్యాంకింగ్‌ షేర్లు భారీగా పడిపోవడంతో బెంచ్‌మార్క్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 114.55 పాయింట్లు కోల్పోయి 11,359.90 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 361.92 పాయింట్లు కోల్పోయి 38,305.41 పాయింట్లు వద్ద క్లోజయ్యాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 377.75 పాయింట్లు పతనమయ్యి 28,725.50 పాయింట్ల వద్ద స్థిరపడింది. భారీగా మార్కెట్లు పడిపోడానికి ప్రధాన కారణాలు.. బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాల

అక్టోబర్‌1 నుంచి ఈ మార్పులు గుర్తించండి!

Tuesday 1st October 2019

సాధారణ ప్రజల ఆర్థిక నిర్ణయాలను ప్రభావితం చేసే ఐదు మార్పులు ఈ నెల 1 నుంచి అమల్లోకి రానున్నాయి... 1. రుణాలపై వడ్డీరేట్లలో మార్పులు: ఆర్‌బీఐ ఆదేశించిన ప్రకారం ఒకటి నుంచి అన్ని ఫ్లోటింగ్‌ రేట్‌ సంబంధిత రుణాలపై రేటును బహిర్గత బెంచ్‌మార్క్‌ రేటుకు అనుసంధానించనున్నారు. దీనివల్ల వ్యక్తిగత, హౌసింగ్‌, ఆటో తదితర రుణాలపై రేట్లు తగ్గవచ్చు. ప్రతిమూడు నెలలకు ఒకసారి బ్యాంకులు ఈ బహిర్గత బెంచ్‌మార్క్‌ రేటుకు అనుగుణంగా తమ

Most from this category