News


యస్‌ బ్యాంకుకు ఫండ్స్‌ సైతం టాటా..!?

Friday 10th January 2020
Markets_main1578679554.png-30841

యస్‌ బ్యాంకుతో వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ తన సంబంధాలను పూర్తిగా తెంచేసుకున్నారు. ఆర్‌బీఐ ఆదేశాలతో బ్యాంకు ఎండీ, సీఈవోగా రాణా కపూర్‌ గతేడాదే తప్పుకున్నారు. ఆ తర్వాత తన పేరిట, తన పెట్టుబడి సంస్థలు యస్‌ క్యాపిటల్‌, మోర్గాన్‌ క్రెడిట్స్‌ పేరిట ఉన్న వాటాల్లో అధిక శాతాన్ని ఆయన సెప్టెంబర్‌ నాటికి విక్రయించేశారు. డిసెంబర్‌ త్రైమాసికం ముగిసే సరికి బ్యాంకులో కపూర్‌కు గానీ, ఆయన పెట్టుబడి సంస్థలకు గానీ ఒక్క షేరు కూడా మిగల్లేదు. పూర్తిగా విక్రయించేసి బ్యాంకుతో ఉన్న ఆ కొద్ది సంబంధాన్ని కూడా కోల్పోయారు. తన కుటుంబ వ్యాపారాల కోసం యస్‌ బ్యాంకు వాటాలను తాకట్టు పెట్టి రాణా కపూర్‌ నిధులు సమీకరించగా, వాటిని తీర్చివేయడం కోసమే వాటాలను విక్రయించినట్టు ఆయన లోగడ స్పష్టం చేసిన విషయం గమనార్హం. కారణమేదైనా, బ్యాంకు నుంచి తప్పుకోవాల్సి రావడం, తదనంతర పరిణామాలతో చాలా తక్కువ ధరల్లో ఆయన తన వాటాలను నిలువునా విక్రయించుకోవాల్సి వచ్చింది. 

 

అయితే, రాణా కపూర్‌ ఒక్కరే కాదు.. యస్‌ బ్యాంకు నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు, ఇనిస్టిట్యూషన్స్‌ కూడా ఒక్కొక్కటిగా వైదొలుగుతుండడం బ్యాంకు పట్ల వారిలో నమ్మకం సడులుతున్నట్టు తెలియజేస్తోంది. యస్‌ బ్యాంకులో సెప్టెంబర్‌ చివరికి కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ 1.14 శాతం, ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ 1.7 శాతం, టెంపుల్‌టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ 1.14 శాతం వాటాలు కలిగి ఉన్నాయి. డిసెంబర్‌ క్వార్టర్‌లో ఇవి తమ వాటాలను పూర్తిగా విక్రయించేశాయి. అలాగే, డబ్ల్యూఎఫ్‌ ఏషియన్‌ స్మాలర్‌ కంపెనీస్‌ ఫండ్‌ సైతం తనకున్న 1.63 శాతం వాటాను అమ్మేసుకుంది. డిసెంబర్‌ త్రైమాసికంలో కనీసం 265 విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు బ్యాంకు వాటాలను వదిలించుకున్నారు. బ్యాంకులో ఇక మిగిలింది 238 మంది విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లే. 

 

గవర్నమెంట్‌ పెన్షన్‌ఫండ్‌ గ్లోబల్‌ సంస్థ తన వాటాలను 1.75 శాతం నుంచి 1.3 శాతానికి తగ్గించుకుంది. అలాగే, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ తన వాటాలను 2.37 శాతం నుంచి 2.27 శాతానికి తగ్గించుకుంది. వాస్తవానికి అంతకుముందు సెప్టెంబర్‌ క్వార్టర్లో యస్‌ బ్యాంకులో అదనంగా వాటాలను హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ కొనుగోలు చేయడం గమనార్హం. అలాగే, డిసెంబర్‌ త్రైమాసికంలో యస్‌ బ్యాంకు నుంచి కనీసం మూడు బీమా కంపెనీలు, నాలుగు బ్యాంకులు కూడా యస్‌ బ్యాంకులో తమ వాటాలను అమ్మేసుకున్నాయి. ప్రస్తుతానికి యస్‌ బ్యాంకులో ప్రమోటర్లు మధు కపూర్‌కు 6.87 శాతం, మ్యాగ్స్‌ ఫిన్‌వెస్ట్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు 1.46 శాతం చొప్పున వాటాలున్నాయి. కపూర్‌ బ్యాంకు నుంచి తప్పుకోవడం తప్పనిసరమో కానీ, దేశీయ, విదేశీ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు తప్పుకోవడం ఇన్వెస్టర్ల నమ్మకాన్ని కచ్చితంగా దెబ్బతీసేదనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రభావం స్టాక్‌పై ఉంటుందంటున్నారు. సమీప కాలంలో బ్యాంకుకు నిధుల సమీకరణ కూడా కష్టమవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదే జరిగితే మరో బ్యాంకుతో యస్‌ బ్యాంకు విలీనంపై ఆర్‌బీఐ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. You may be interested

ఇన్ఫోసిస్‌.. బోణీ భేష్‌!

Saturday 11th January 2020

(అప్‌డేటెడ్‌...) క్యూ3లో నికర లాభం రూ.4,466 కోట్లు; 24 శాతం జంప్‌ 8 శాతం పెరిగి రూ.23,092 కోట్లకు ఆదాయం 2019-20 వృద్ధి అంచనాలు 10- 10.5 శాతానికి పెంపు బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ ఇన్ఫోసిస్‌... అంచనాలను మించిన బంపర్‌ ఫలితాలతో బోణీ కొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో (2019-20, క్యూ3) సంస్థ కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.4,466 కోట్లకు చేరింది. 2018-19 సంవత్సరం

వొడాఐడియా, ఎయిర్‌టెల్‌తో చైనా మొబైల్‌ సంప్రదింపులు

Friday 10th January 2020

చైనాకు చెందిన అతిపెద్ద మొబైల్‌ ఆపరేటర్‌ ‘చైనా మొబైల్‌’ భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలతో భారత్‌లో క్లౌడ్‌ నెట్‌ వర్క్‌ ఏర్పాటు విషయమై సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. ‘‘చైనా మొబైల్‌కు చెందిన టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లు భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా సీనియర్‌ మేనేజ్‌మెంట్‌తో డిసెంబర్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత మార్కెట్‌ పట్ల చైనా మొబైల్‌ ఆసక్తిగా ఉంది. ఈ రెండు సంస్థల్లో ఏదైనా ఒకదానిలో లేదా రెండింటిలోనూ హోల్డింగ్‌ కంపెనీగా

Most from this category