News


రామ్‌కో, మాస్టెక్‌, జూబిలెంట్‌.. జూమ్‌

Wednesday 8th January 2020
Markets_main1578473503.png-30765

మార్కెట్లు డౌన్‌- ఈ షేర్లు అప్‌
రామ్‌కో సిస్టమ్స్‌ 
మాస్టెక్‌ లిమిటెడ్‌
జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌

పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు నీరసంగా కదులుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 93 పాయింట్లు తక్కువగా 40,776కు చేరగా.. నిఫ్టీ 39 పాయింట్లు క్షీణించి 12,014 వద్ద ట్రేడవుతోంది. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ మిసైల్‌ దాడులు చేపట్టినట్లు వెల్లడించడంతో తొలుత సెన్సెక్స్‌ దాదాపు 400 పాయింట్లు పతనంకాగా..నిఫ్టీ 12,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లోనూ విభిన్న వార్తల ఆధారంగా మూడు మిడ్‌ క్యాప్‌ కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి నష్టాల మార్కెట్లోనూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

రామ్‌కో సిస్టమ్స్‌
సుప్రసిద్ధ ఆస్ట్రేలియన్‌ యూనివర్శిటీ నుంచి మల్టీ మిలియన్‌ డాలర్‌ కాంట్రాక్టు లభించినట్లు రామ్‌కో సిస్టమ్స్‌ తాజాగా పేర్కొంది. ఆర్డర్‌లో భాగంగా గ్లోబల్‌ పేరోల్‌, వర్క్‌ఫోర్స్‌ మేనేజ్‌మెంట్‌(డబ్ల్యూఎఫ్‌ఎం) సేవలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ సేవలను అందించవలసి ఉన్నట్లు తెలియజేసింది. ఈ డీల్‌ ద్వారా అత్యున్నత విద్యా విభాగంలోని హెచ్‌ఆర్‌, పేరోల్‌ సొల్యూషన్స్‌లోకి ప్రవేశించనున్నట్లు కంపెనీ వివరించింది. ఆస్ట్రేలియన్‌ కంపెనీతో చేతులు కలపడం ద్వారా క్లౌడ్‌ ఆధారిత డబ్ల్యూఎఫ్‌ఎం సేవలు అందించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో రామ్‌కో సిస్టమ్స్‌ షేరు 4.5 శాతం జంప్‌చేసి రూ. 172 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 180 వరకూ ఎగసింది.

జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌
మార్పిడి రహిత డిబెంచర్ల(ఎన్‌సీడీలు) రీడీమ్‌ను పూర్తిచేసినట్లు ఫార్మా రంగ కంపెనీ జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ తాజాగా వెల్లడించింది. వడ్డీతోసహా రూ. 745 కోట్ల విలువైన ఎన్‌సీడీల చెల్లింపులను పూర్తిచేసినట్లు వివరించింది. కంపెనీలో ప్రమోటర్లకు 50.68% వాటా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో జూబిలెంట్‌ లైఫ్‌ షేరు 2.4 శాతం పెరిగి రూ. 545 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 572 వద్ద  ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.

మాస్టెక్‌ లిమిటెడ్‌
అనుబంధ సంస్థ మజెస్కో(యూఎస్‌ఏ)లో పాక్షిక వాటాను విక్రయించినట్లు వెల్లడించడంతో సాఫ్ట్‌వేర్‌ సేవల కంపెనీ మాస్టెక్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. నాస్‌డాక్‌ ఎక్స్ఛేంజీలో ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా 8,24,500 మజెస్కో షేర్లను విక్రయించినట్లు మాస్టెక్‌ పేర్కొంది. మాస్టెక్‌(యూకే) ద్వారా విక్రయించిన ఈ వాటా విలువ 6.49 మిలియన్‌ డాలర్లు(దాదాపు రూ. 46 కోట్లు)గా తెలియజేసింది. దీంతో మజెస్కోలో మాస్టెక్‌(యూకే) వాటా 22,20,375 షేర్లకు పరిమితమైనట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో మాస్టెక్‌ లిమిటెడ్‌ షేరు 2 శాతం పుంజుకుని రూ. 431 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 438 వద్ద  ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.You may be interested

కరెక‌్షన్‌లో కొనుగోళ్లకు అవకాశాలు!

Wednesday 8th January 2020

నిపుణుల సూచన యూఎస్‌- ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా యూఎస్‌కు చెందిన మిలటరీ బేస్‌పై ఇరాన్‌ క్షిపణి దాడి చేసింది. దీంతో యూఎస్‌ ఫ్యూచర్లు ఒక్కమారుగా భారీ నష్టాల్లోకి మరలాయి. కానీ వెనువెంటనే ఆల్‌ ఈజ్‌ వెల్‌ అంటూ ట్రంప్‌ చేసిన ట్వీట్‌తో ఉపశమనం పొందాయి. దేశీయ సూచీలు సైతం ఆరంభంలో భారీ నష్టం చూపి క్రమంగా కొంత కోలుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా నుంచి భారీ ప్రతిస్పందన

అమ్మకాల ఒత్తిడిలో మెటల్‌ షేర్లు

Wednesday 8th January 2020

మార్కెట్‌ మిడ్‌సెషన్‌ కల్లా మెటల్‌ షేర్లు నష్టాలను ఎదుర్కోంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.50శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.12:20నిల.కు ఇండెక్స్‌ క్రితం ముగింపుస్థాయి(2,785.90)తో పోలిస్తే 1.55శాతం నష్టంతో 2,742.80     వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌ జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేరు 3శాతం నష్టపోయింది. ఎన్‌ఎండీసీ, హిందూస్థాన్‌ కాపర్‌ షేర్లు 2.50శాతం, మెయిల్‌, ఏపిఎల్‌ అపోలో, హిందాల్కో షేర్లు 2శాతం నష్టపోయాయి.

Most from this category