News


కొత్త ఏడాదిలో పండుగ చేసుకోవచ్చా.?

Tuesday 31st December 2019
Markets_main1577813867.png-30569

మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఎప్పుడు ర్యాలీ చేస్తాయి..? అని ఆశగా ఎదురు చూస్తున్న ఇన్వెస్టర్లు గుడ్‌ న్యూస్‌. 2020లో నాణ్యమైన మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ మంచి ర్యాలీ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు భావిస్తు‍న్నారు. 2019 పూర్తిగా ఇండెక్స్‌లోని నాణ్యమైన స్టాక్స్‌దే హవా అని చెప్పుకోవాలి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌లో లాభాలు ఇచ్చినవీ ఉన్నాయి. కానీ వాటి సంఖ్య చాలా తక్కువ. దీంతో బ్రోడర్‌ మార్కెట్లు ర్యాలీలో పాల్గొనలేదు. ప్రభుత్వం ఆర్థిక వృద్ధి పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యలు, సంస్కరణల ఫలితాలు భవిష్యత్తులో కనిపిస్తాయని, 2020లో ఆర్థిక వ్యవస్థ రికవరీ తోడ్పాటుతో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ర్యాలీలో పాల్గొంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో నూతన సంవత్సరం సందర్భంగా పలు బ్రోకరేజీ సంస్థలు, విశ్లేషకులు ర్యాలీకి అవకాశం ఉన్న స్టాక్స్‌ వివరాలను ప్రకటించాయి. అయితే, ఆర్థిక వృద్ధి రికవరీతోపాటు విదేశీ పోర్ట్‌ఫోలియో, ఇనిస్టిట్యూషన్ల పెట్టుబడులపై ర్యాలీ ఆధారపడి ఉంటుందని గమనించాలి. అలాగే, అన్ని స్టాక్స్‌ కాకుండా నాణ్యమైనవి ముందు ర్యాలీ చేయడానికి అవకాశాలు ఉంటాయన్నది నిపుణుల అభిప్రాయం. 

 

రెలిగేర్‌ సంస్థ సిఫారసులు
బజాజ్‌ ఆటో(టార్గెట్‌ రూ.3,723), బ్రిటానియా ఇండస్ట్రీస్‌(రూ.3,632), కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌(రూ.624), క్రాంప్టన్‌గ్రీవ్స్‌ కన్జ్యూమర్‌ ఎలక్ట్రికల్స్‌(రూ.299), గుజరాత్‌ గ్యాస్‌(రూ.273), ఐనాక్స్‌ లీజర్‌(రూ.464), ఎల్‌అండ్‌టీ(రూ.1,618), ఆర్‌నిప్పన్‌(రూ.419), టెక్‌ మహీంద్రా(రూ.939), రామ్కో సిమెంట్‌(రూ.902). 

 

బీపీ ఈక్విటీస్‌
భారతీ ఎయిర్‌టెల్‌(రూ.535), ఇండస్‌ఇండ్‌ బ్యాంకు(రూ.1,780), రామ్కో సిమెంట్స్‌(రూ.223), రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (రూ.1,814), సన్‌ ఫార్మా (రూ.496).

 

జి.చొక్కలింగం: ఆంధ్రా షుగర్‌, సింజీన్‌ ఇంటర్నేషనల్‌, సుందరం ఫైనాన్స్‌
గౌతమ్‌ దుగ్గద్‌: పేజ్‌ ఇండస్ట్రీస్‌, క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జ్యూమర్‌, ట్రెంట్‌
మానవ్‌ చోప్రా: దీపక్‌ నైట్రేట్‌
రస్మిక్‌ఓజా: సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌
సునీల్‌ జైన్‌: ఏపీఎల్‌ అపోలోట్యూబ్స్‌, డీసీబీ బ్యాంకు, జుబిలంట్‌ లైఫ్‌ సైన్సెస్‌
వినయ్‌ పండిట్‌: అపోలో టైర్స్‌, వోల్టాస్‌, హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌, వీమార్ట్‌ రిటైల్‌, జేబీ కెమికల్స్‌, ఆస్ట్రా మైక్రోవేవ్‌
వినోద్‌నాయర్‌: ఆర్తి ఇండస్ట్రీస్‌
వీకేశర్మ: యాక్సిస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌
ఇతర స్టాక్స్‌: కేఈసీ ఇంటర్నేషనల్‌, గుజరాత్‌ గ్యాస్‌, హిందుస్తాన్‌ యునిలీవర్‌, గుజరాత్‌ స్టేట్‌ పెట్రోనెట్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌. 

 

ఐపీవోలకు రానున్న ప్రముఖ కంపెనీలు
ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు, యూటీఐ ఏఎంసీ, బర్గర్‌ కింగ్‌ ఇండియా, ఎస్‌బీఐ కార్డ్స్‌, హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, మజ్‌గాన్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌, ఎన్‌ఎస్‌ఈ, ఐఆర్‌ఈడీఏ, రైల్‌టెల్‌, ఈజ్‌ మై ట్రిప్‌ 2020లో ఐపీవోకు రావచ్చని అంచనాలు ఉన్నాయి.

 

నోట్‌: ఇవి నిపుణుల అభిప్రాయాలు, అంచనాలు మాత్రమే. ఇన్వెస్టర్లు వీటిలో పెట్టుబడులకు ముందు సొంతంగా అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం సముచితం. You may be interested

ఈ స్టాక్స్‌ ... టాప్‌ గన్స్‌

Wednesday 1st January 2020

అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు .. దేశీయంగా కంపెనీల ఆదాయాలు .. లిక్విడిటీ మెరుగుపడుతుండటం, డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు ప్రకటించే అవకాశాలతో .. కొత్త సంవత్సరంలో మార్కెట్లకు ఊతం లభించవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. 2020 మరిన్ని సంస్కరణల సంవత్సరంగా ఉండవచ్చని.. 2019 ర్యాలీలో పెద్దగా పాలుపంచుకోని మిడ్, స్మాల్‌ క్యాప్‌ షేర్లు పుంజుకోవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. పెద్ద ప్రైవేట్‌ బ్యాంకులు, కన్జూమర్‌/ఎఫ్‌ఎంజీసీ, సిమెంట్, క్యాపిటల్‌ గూడ్స్‌ సంస్థల

2020లో మార్కెట్లు ఎలా ఉండొచ్చు..?

Tuesday 31st December 2019

నూతన సంవత్సరంలో ఇన్వెస్టర్లు ఏ రంగాలను నమ్ముకోవచ్చు..? 2020లో ర్యాలీకి అవకాశం ఉన్న రంగాలేవి..? ఏ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా అధిక రాబడులు పొందొచ్చు? ఇలాంటి ఎన్నో సందేహాలను తొలగించే విధంగా 2020పై పీజీఐఎం ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ సీఐవో శ్రీనివాస్‌ రావూరి ఓ వార్తా పత్రికకు రాసిన కాలమ్‌లో స్పష్టతనిచ్చారు (ఆయన మాటల్లోనే).  డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమెరికా అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యాపారాన్ని పీజీఐఎం మ్యూచువల్‌ ఫండ్‌ గతంలో

Most from this category