News


వచ్చే ఏడాది ర్యాలీలో అధికశాతం షేర్లకు చోటు

Wednesday 27th November 2019
Markets_main1574840358.png-29898

‘సిమెంట్‌, ఇండస్ట్రీయల్స్‌, పవర్‌, ఆటో, వినియోగం వంటి రంగాలు 10 శాతం నుంచి 30 శాతం మేర పడిపోయాయి. ఈ రంగాలలో బాటమ్‌ ఔట్‌ అయ్యి డిమాండ్‌ తిరిగి పుంజుకుంటే, మార్కెట్‌ మరింత పెరగుతుంది’ అని ఎండీ, సీఐఓ, టీసీజీ ఏఎంసీ, చక్రి లోకప్రియా ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లో..
మార్కెట్‌ మరింత పెరుగుతుంది..
ఆర్ధిక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పటికి అంతర్జాతీయ కారణాలు, సెంటిమెంట్‌ మెరుగుపడడం వంటి అంశాల వలన స్టాక్‌ మార్కెట్లు గరిష్ఠ సాయిల వైపు కదులుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌ కన్సాలిడేషన్‌ దశలో ఉన్నప్పటికి, వచ్చే ఏడాది కాలంలో మార్కెట్‌లో ఎక్కువశాతం షేర్లు ర్యాలీ చేయడ చూడవచ్చు. ఈ ఏడాది నిఫ్టీ 11 శాతం పెరిగింది. అదే సమయంలో మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 5.5 శాతం పడిపోయింది. నిఫ్టీలో కూడా పరిమితంగా ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, ఎఫ్‌ఎంసీజీ(ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యుమర్‌ గూడ్స్‌) స్టాకులు మార్కెట్‌ ర్యాలీని నడిపిస్తున్నాయి. సిమెంట్‌, ఇండస్ట్రీయల్స్‌, పవర్‌, ఆటో, వినియోగం వంటి రంగాలు 10 శాతం నుంచి 30 శాతం మేర పడిపోయాయి. ఈ రంగాలలో బాటమ్‌ ఔట్‌ అయ్యి, డిమాండ్‌ తిరిగి పుంజుకుంటే మార్కెట్‌ మరింత పెరుగుతుంది.
ఎల్‌ అండ్‌ టీ..ఓకే..
ఎల్‌ అండ్‌ టీ మూలధన వ్యయం తగ్గిందని కంపెనీ నివేదిక తెలుపుతోంది. కానీ ఈ విషయంపై మేమంతగా ఆందోళన చెందడం లేదు. ఎల్‌ అండ్‌ టీ ఇండస్ట్రీయల్‌ మూలధన వ్యయంలో ముందుంటుంది. ఈ కంపెనీ బుక్‌ ఆర్డర్‌ 2.5 రెట్లు కలిగివుంది. ఆర్థిక వ్యవస్థ మందగించడం వలన కంపెనీ బుక్‌ ఆర్డర్‌ బలహీనపడినప్పటికి, వచ్చే రెండేళ్లలో కంపెనీ లాభాలు ప్రభావితం కావు. మందగమనం వలన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మూలధన వ్యయం తగ్గిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎల్‌ అండ్‌ టీ 16 రెట్లు మల్టిపుల్స్‌ వద్ద ట్రేడవుతోంది. ఇది కంపెనీ అత్యంత కనిష్టమైన మల్టిపుల్స్‌ కావడం గమనార్హం. అందువలన ఈ స్టాకును ప్రస్తుత స్థాయి వద్ద కొనుగోలు చేయమని సలహాయిస్తున్నాం. 
మార్కెట్‌ ర్యాలీని రెండు రంగాలే నడిపిస్తున్నాయి..
ప్రస్తుత ర్యాలీని ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, ఎఫ్‌ఎంసీజీ రంగానికి చెందిన స్టాకులు నడిపిస్తున్నాయి. ఈ రెండు రంగాలు కూడా దేశీయంగా ఆధారపడే సెక్టార్‌లు. సిమెంట్‌, ఇండస్ట్రీయల్‌, వినియోగ రంగం, ఆటో, ఆటో అనుబంధ రంగాల కంపెనీలు ఎక్కువగా ఎగుమతులపై ఆధారపడి నడుస్తాయి. కాగా కేంద్రం కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో ఈ కంపెనీల లాభాలు వృద్ధి చెందాయి. ముఖ్యంగా ఎగుమతి మార్కెట్‌లో ఈ కంపెనీలు పోటీలో నిలవగలిగాయి. ఈ చర్య ఫలితం దీర్ఘకాలంలో కనిపిస్తుంది. తాజాగానే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడంతో ఈ చర్య ఫలితం వచ్చే ఏడాది కాలంలోగా వ్యవస్థలో కనిపిస్తుంది. అప్పుడు ఫైనాన్సియల్స్‌, ఎఫ్‌ఎంసీజీ సెక్టార్లో జరుగుతున్న ర్యాలీ ఈ రంగాలలోకి విస్తరిస్తుంది. 
సీఎస్‌బీ 2.2 రెట్లు..యస్‌ బ్యాంక్‌ 0.6 రెట్లు మాత్రమే..
సీఎస్‌బీ బ్యాంక్‌ను గమనిస్తే, ఈ బ్యాంక్‌ తన జీఎన్‌పీఏ(స్థూల నాన్‌ పెర్ఫార్మింగ్‌ అసెట్స్‌) 7 శాతాన్ని 4 శాతానికి తగ్గించుకోగలిగింది. బ్యాంక్‌ నికర ఎన్‌పీఏలు కూడా 2 శాతానికి దిగువన ఉన్నాయి. ఈ బ్యాంక్‌ దక్షిణ భారతదేశంలో తన కార్యకలాపాలను కొనసాగిస్తుండగా, ఎస్‌ఎంఈ(చిన్న మధ్యతరహ కంపెనీలు), రిటైల్‌ బ్యాంకింగ్‌లో మంచి స్థాయిలో ఉంది. ఇలాంటి తరహా బుక్‌నే యస్ బ్యాంక్‌ కూడా కలిగివుండేది. ప్రస్తుతం యస్‌ బ్యాంక్‌ తన బుక్‌ను క్లీన్‌ చేసుకుంటుండటంతో ఈ బ్యాంక్‌ షేరు ప్రస్తుతం బుక్‌ విలువకు 0.6 రెట్లు వద్ద ట్రేడవుతోంది. కాగా సీఎస్‌బీ ఐపీఓ బుక్‌ విలువకు 2.2 రెట్లు వద్ద  జరిగింది. ఈ దృక్పథం ప్రకారం చూస్తే, 1.2 బిలియన్‌ డాలర్ల నిధుల సమీకరణను యస్‌ బ్యాంక్‌ పూర్తి చేస్తే, ఈ బ్యాంక్‌ షేరులో మంచి రీరేటింగ్‌ జరుగుతుంది. ఈ బ్యాంక్‌లానే ఇబ్బందులు పడుతున్న ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేరు కూడా రీరేటింగ్‌ జరిగే అవకాశం ఉంది. 
ఆటో అమ్మకాలు పుంజుకున్నాయి..
ఆటో సెక్టార్‌కు సంబంధించి ఎం అండ్‌ ఎం లేదా హీరో మోటర్‌ కార్ప్‌ వంటి ముందవరుసలోని కంపెనీలను పరిశీలిస్తే, ఈ కంపెనీల షేర్లు ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 15-20 శాతం నష్టపోయాయి. నవంబర్‌లోని ఆటో అమ్మకాలు కొంత​ మేర పర్వాలేదనిపించాయి. దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న మందగమనంలో ఆటో అమ్మకాలు తిరిగి పుంజుకుంటాయనే అంచనాలు పెరిగాయి.
  టెలికాం సెక్టార్‌లో ఏజీఆర్‌ సమస్యతో పాటు, టారిఫ్‌లను పెంచడం వంటి వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే రెండేళ్లలో టెలికాం కంపెనీలు 70 శాతానికి పైగా టారిఫ్‌లను పెంచాలనుకుంటున్నాయి. కానీ వారు అనుకున్నట్టుగా ఎప్పుడుపడితే అప్పుడు టారిఫ్‌లను పెంచలేరు. ఇది డిమాండ్‌ తగ్గిపోడానికి కారణమవుతుంది. మరోవైపు ఏజీఆర్‌ను ప్రభుత్వం మరోసారి నిర్వచించవలసిన అవసరం ఉంది. ఈ సమస్యలన్ని పరిష్కారమవ్వడానికి ఇంకొంత సమయం పడుతుంది. ప్రస్తుతం వొడాఫోన్‌-ఐడియా షేరు డెట్‌-ఇబిటాకు 8-9 రెట్లు వద్ద ట్రేడవుతోంది. ఇది చాలా ఎక్కువ. You may be interested

2వారాల కనిష్టం వద్ద పసిడి

Wednesday 27th November 2019

అమెరికా చైనాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం దిశగా సాగుతున్నాయని ట్రంప్‌ ప్రకటనతో ప్రపంచ మార్కెట్లో పసిడి ధర బుధవారం రెండువారాల కనిష్టం వద్ద కదలాడుతోంది. నేడు ఆసియాలో ఉదయం సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 2డాలర్లు నష్టపోయి 1,458 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అలాగే ఆసియాలో ప్రధాన మార్కెట్లు పాజిటివ్‌ ట్రేడింగ్‌, నిన్నరాత్రి అమెరికా మార్కెట్ల రికార్డు ముగింపు, ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌

టాప్‌ 500 షేర్లలో మనవి పదమూడే!

Wednesday 27th November 2019

అంతర్జాతీయంగా మంచి ప్రదర్శన చూపిన టాప్‌ 500 షేర్ల జాబితాలో ఇండియాకు చెందిన 13 షేర్లకు మాత్రమే చోటు దక్కింది. దేశీయ సూచీల్లో బ్లూచిప్స్‌ ప్రదర్శన కారణంగా ఆల్‌టైమ్‌ హై సాధ్యమైనా, గ్లోబల్‌ షేర్లతో పోలిస్తే మనవాటి ప్రదర్శన అంతంతమాత్రమేనని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్త లిస్టెడ్‌ కంపెనీల్లో టాప్‌ 500 కంపెనీలను బ్లూమ్‌బర్గ్‌ సంస్థ ప్రకటించింది. ఈ లిస్టులోని 13 భారతీయ కంపెనీల షేర్లలో 8 షేర్లు కనీసం టాప్‌ 200లోకి

Most from this category