News


11000పైన స్థిరంగా ఉంటేనే ర్యాలీ!

Monday 9th September 2019
Markets_main1568026300.png-28272

నిఫ్టీపై నిపుణుల అంచనా
నిఫ్టీ గతవారం నెగిటివ్‌ ట్రెండ్‌ నుంచి క్రమంగా బయటపడుతోంది. ఈవారాన్ని నిఫ్టీ పాజిటివ్‌గా ఆరంభించింది. వీక్లీచార్టుల్లో నిఫ్టీ లాంగ్‌లోయర్‌ షాడో ఉన్న బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది. ఇది దిగువ స్థాయిల్లో కొనుగోళ్లను సూచిస్తోంది. ఈ నేపథ్యంలో నిఫ్టీ 11వేల పాయింట్ల పైన బలంగా క్లోజయితే అప్‌మూవ్‌ ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే నిఫ్టీ క్రమంగా 11200 పాయింట్ల వరకు వెళ్లవచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ నిఫ్టీ 10900 పాయింట్లను బ్రేక్‌డౌన్‌ చేస్తే మాత్రం అమ్మకాలు వెల్లువెత్తుతాయని, అప్పుడు 10750 వరకు పతనం ఉండొచ్చని చెప్పారు. ప్రస్తుతం నిఫ్టీ తన కీలక డీఎంఏలకు దిగువన ట్రేడవుతోంది. అందువల్ల ఇప్పటికీ షార్ట్‌టర్మ్‌ నెగిటివ్‌ ధృక్పథంతోనే ఉంది. ఇప్పటికీ ర్యాలీలో అమ్ము సూత్రమే వర్తిస్తుందని నిపుణుల భావన. ఈ వారానికి నిఫ్టీ 11750- 11200 పాయింట్ల రేంజ్‌లోనే కదలాడే అంచనా వేస్తున్నారు. 
బ్యాంక్‌నిఫ్టీ 
బ్యాంకు నిఫ్టీ కూడా ఈ వారాన్ని పాజిటివ్‌గా ఆరంభించింది. సోమవారం 27500 పాయింట్ల పైన క్లోజయింది. గతవారం చార్టుల్లో బ్యాంకు నిఫ్టీ సైతం లాంగ్‌లోయర్‌ షాడో ఉన్న బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది. ఇది దిగువ స్థాయిల్లో కొనుగోళ్లను సూచిస్తోంది. సూచీ లోయర్‌టాప్‌, లోయర్‌ బాటమ్‌ ధోరణిలోనే కొనసాగుతోంది. బ్యాంకు నిఫ్టీ 27400 పాయింట్ల పైన బలంగా క్లోజయితే 27800 పాయింట్ల వరకు ఎగబాకే ఛాన్సుందని నిపుణుల అంచనా. ఒకవేళ 27వేల పాయింట్ల దిగువకు వస్తే 26500 పాయింట్ల వరకు పతనం కొనసాగవచ్చు. ఈ వారానికి బ్యాంకు నిఫ్టీ 26500- 28000 పాయింట్ల రేంజ్‌లోనే కదలాడవచ్చు. 



You may be interested

11000 పైన నిఫ్టీ ముగింపు

Monday 9th September 2019

బ్యాంకింగ్‌, ఆర్థిక, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్ల ర్యాలీతో మార్కెట్‌ రెండోరోజూ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్‌ 164 పాయింట్లు పెరిగి 37000 స్థాయిపైన 37,145.45 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి  వారం రోజుల తరువాత నిఫ్టీ ఇండెక్స్‌ తొలిసారి 11000పైన 11,003 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇండెక్స్‌ 11000 పైన ముగిసిన నేపథ్యంలో షార్ట్‌టర్మ్‌ అప్‌ట్రెండ్‌ కొనసాగుతుందనీ, 11180 స్థాయిని పరీక్షిస్తుందని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. మందగించిన ఆర్థిక

100 రోజుల పాలనలో రూ.14లక్షల కోట్ల సంపద ఆవిరి..!

Monday 9th September 2019

ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ 100రోజుల్లో ఆయా రంగాల పనితీరు ఎలా ఉన్నప్పటికీ.., దలాల్‌ స్ట్రీట్‌ మాత్రం విలవిలాడింది. ఎన్‌డీఏ సంపూర్ణ మెజారిటీతో అధికారం చేపట్టిన నాటి ఇన్వెస్టర్లు భారీ ఎత్తున అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా ఈ 100 రోజుల్లో 14 లక్షల కోట్ల సంపదను తుడిచిపెట్టుకుపోయింది. మార్కెట్‌లో జరుగుతున్న

Most from this category