News


లాభాల్లో టాటా మోటర్స్‌, మారుతి సుజుకీ

Thursday 19th September 2019
Markets_main1568882555.png-28435

మార్కెట్‌ భారీపతనంలోనూ టాటామోటర్స్‌, మారుతి సుజుకీ షేర్లు లాభాల బాట పట్టాయి. రేపు (సెప్టెంబర్‌ 20న) జరగనున్న జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో మందగించిన ఆటోరంగాన్ని ఉత్తేజపరిచేందుకు అటో రంగంపై జీఎస్‌టీ శ్లాబ్‌ను తగ్గింవచ్చనే అంచనాలతో ఈ షేర్లకు కొనుగోళ్ల లభిస్తుంది. 

టాటా మోటర్స్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.123.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 2.50శాతం లాభపడి రూ.124.90 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2:00లకు షేరు క్రితం ముగింపు ధర(రూ.121.75)తో పోలిస్తే 2.09శాతం లాభంతో రూ.124.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధర రూ.106.00, రూ.259.80లుగా నమోదయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 గెయినర్లలో మొదటిస్థానంలో ట్రేడ్‌ అవుతోంది. 

మారుతి సుజుకీ:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.6,139.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 1.50శాతం లాభపడి రూ.6175.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2:00 కల్లా లాభాలన్ని కోల్పోయి షేరు క్రితం ముగింపు ధర(రూ.6095.05)తో పోలిస్తే 1.13 నష్టంతో రూ.6012.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధర రూ.5,446.05, రూ.8,596.50 లుగా నమోదయ్యాయి. 



You may be interested

ఈ ఆరు రంగాల షేర్లూ పెట్టుబడికి అనుకూలం!

Thursday 19th September 2019

సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్‌ దాడి జరిగాక చమురు ధరలు భారీగా పెరిగాయి. ఫలితంగా దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు తమ కీలక మద్ధతు స్థాయిలను కొల్పోవలసి వచ్చింది. చాలా వరకు స్టాకులు భారీగా దిద్దుబాటుకు గురయ్యాయి. ఇవి ప్రస్తుతం మంచి వాల్యుషన్‌ల దగ్గర లభ్యమవుతున్నాయని, కానీ రాయితీతో ట్రేడయ్యే ప్రతీ స్టాకు మంచి రిటర్న్‌లను ఇవ్వదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. నిర్థిష్ట రంగాల వారిగా ప్రాథమిక అంశాలు బలంగా ఉండడంతో

సెయిల్‌, ఎన్‌ఎండీసీ, టాటా స్టీల్‌ 4% పతనం!

Thursday 19th September 2019

చమురు ధరలు భారీగా పెరగడంతో మొదలైన మార్కెట్‌ నష్టాలు గురువారం కూడా కొనసాగుతున్నాయి. ఎఫ్‌ఐఐ(విదేశి సంస్థాగత ఇన్వెస్టర్లు)లు బ్యాంకింగ్‌, మెటల్‌ షేర్ల నుంచి భారీగా నిధులను ఉపసంహరించుకుంటున్నారు. మధ్యాహ్నాం 12.46 సమయానికి నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.91 శాతం నష్టపోయి 2,356.80 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో సెయిల్‌ 4.34 శాతం, నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(ఎన్‌ఎమ్‌డీసీ) 4.03 శాతం,  టాటా స్టీల్‌ 3.94 శాతం నష్టపోయి ఇండెక్స్‌

Most from this category