లాభాల్లో ప్రభుత్వరంగ షేర్లు
By Sakshi

ప్రభుత్వరంగ షేర్లు గురువారం మిడ్‌సెషన్‌లో లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బీఎస్ఈ పీఎస్‌యూ ఇండెక్స్ నేడు 2శాతం పెరిగింది. ప్రభుత్వ రంగానికి చెందిన పెట్రోమార్కెటింగ్ కంపెనీల్లోని ప్రధాన షేర్లైన బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీ షేర్లు 3శాతం నుంచి 4.50శాతం పెరిగాయి. బ్యాంకింగ్ రంగ సెక్టార్‌ల్లోని ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ తప్ప మిగిలిన అన్నిరంగాలకు చెందిన షేర్లు 1.10శాతం నుంచి 3శాతం పెరిగాయి. అత్యధికంగా బ్యాంక్ ఆఫ్ బరోడా 3శాతం లాభపడింది. భారత్ ఎలక్ట్రానిక్స్, భెల్, కోల్ ఇండియా, కంటైనర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, ఇంజనీరింగ్స్ ఇండియా, మెయిల్, ఎంఆర్‌పీఎల్, ఎంన్టీఎన్ఎల్, నాల్కో, ఎన్బీసీసీ, ఎన్‌హెచ్‌సీసీ, ఎన్ఎండీసీ, ఎన్టీపీసీ, ఓన్జీసీ, పవర్‌గ్రిడ్, ఆర్ఈసీ, సెయిల్, ఫిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రభుత్వరంగ షేర్లలో ప్రధానంగా భెల్, హెచ్పీసీఎల, కొచ్చిన్ షిప్‌యార్డ్, కంటైనర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇంజనీరింగ్స్ ఇండియా లిమిటెడ్ షేర్లు ఎన్ఎండీసీ, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఐఓసీ షేర్లు షేర్లు 4శాతం నుంచి 1శాతం వరకు పెరిగాయి.
You may be interested
తగ్గిన వాణిజ్య యుద్ధ ఉద్రికత్తలు: మెటల్ షేర్లకు డిమాండ్
Thursday 26th September 2019అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చలపై ట్రంప్ సానుకూల వ్యాఖ్యలు చేయడంతో గురువారం ప్రపంచ మార్కెట్లలో మెటల్ షేర్లు లాభాల బాటపట్టాయి. అక్కడి నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్నాయి. అలాగే నేడు ఇక్కడ మార్కెట్లో నెలకొన్న కొనుగోళ్ల మద్దతులో భాగంగా మెటల్‌కు డిమాండ్ పెరిగింది. ఫలితంగా ఎన్ఎస్ఈలో మెటల్ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 3.50శాతం లాభపడింది. ఇండెక్స్‌లో మెయిల్, ఎన్ఎండీసీ, వేదాంత, నాల్కో, సెయిల్ షేర్లు 6.50శాతం నుంచి
20 మిడ్‌క్యాప్స్‌పై బ్రోకరేజ్‌ల సిఫార్సులు
Thursday 26th September 2019కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 20 వ తేదిన కార్పోరేట్ ట్యాక్స్‌ను 34.9 శాతం నుంచి 25.2 శాతానికి తగ్గించి మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వరుస రెండు (సెప్టెంబర్ 20,22) సెషన్లలో ఈక్విటీ మార్కెట్లు భారీ స్థాయిలో ర్యాలీ చేశాయి. ఈ రెండు సెషన్లలోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 10 లక్షల కోట్లు పెరిగింది. నిఫ్టీ 50, సెన్సెక్స్ 8 శాతం చొప్పున లాభపడగా, బీఎస్ఈ