News


ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల జోరు

Monday 23rd September 2019
Markets_main1569231442.png-28495

కేంద్రం కార్పొరేట్‌ పన్ను తగ్గింపు ప్రకటనతో ప్రభుత్వరంగ షేర్లు భారీగా లాభాల బాట పట్టాయి.  బీఎస్‌ఈలో ప్రభుత్వరంగ కంపెనీలకు ప్రాతినిథ్యం వహించే బీఎస్‌ఈ పీఎస్‌యూ ఇండెక్స్‌ దాదాపు 3శాతానికి పైగా లాభపడింది. ప్రభుత్వరంగ షేర్లైన ఓఎన్‌జీసీ,  కోల్‌ ఇండియా, ఐఓసీ షేర్లు దాదాపు 5శాతం వరకు ర్యాలీ చేశాయి. కేంద్రం కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో ఎక్కువగా ప్రభుత్వరంగ కంపెనీలకు లాభాన్ని చేకూర్చుస్తాయనే అంచనాలు ఈ రంగ షేర్లకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. పెట్రోరంగ షేర్ల ఎక్కువగా లాభపడుతున్నాయి. ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ, ఐఓసీ షేర్లు 4శాతం వరకు లాభపడ్డాయి. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు (6,698.72)తో పోలిస్తే 2.50శాతం లాభంతో 6860.43 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
 



You may be interested

మరో నాలుగు ఆర్థిక సంస్కరణలపై మోర్గాన్‌స్టాన్లీ దృష్టి

Monday 23rd September 2019

కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు చర్య వలన ఇండియాలోకి ప్రైవేట్‌ పెట్టుబడులు పెరుగుతాయని మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా మేనేజింగ్‌ డైరక్టర్‌ రిధమ్‌ దేశయ్‌ అన్నారు. ‘ప్రైవేట్‌ సైకిల్‌ పుంజుకోనప్పటికి పన్ను తగ్గింపు చర్య వలన దేశంలోకి ప్రైవేట్‌ పెట్టుబడులు ఊపందుకుంటాయి’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ట్యాక్స్‌ తగ్గింపు వలన ఆదాయాల వృద్ధి పెరిగే అవకాశం ఉందని, సెన్సెక్స్‌ ఆదాయాల వృద్ధి అంచనాలను 2020కి గాను 25 శాతానికి, 2021 కి గాను

ఫార్మా షేర్లకు యూఎస్‌ఎఫ్‌డీఏ సెగ

Monday 23rd September 2019

యూఎస్‌ఎఫ్‌డీఏ సంబంధిత సమస్యల కారణంగా ఫార్మా ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన డాక్టర్‌ రెడ్డీస్‌, లుపిన్‌, సిప్లా షేర్ల పతనంతో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ నష్టాల బాట పట్టింది. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 8,063.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ఆరంభంలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ 1.21శాతం ర్యాలీ చేసింది. అనంతరం ఇండెక్స్‌లో ప్రధాన షేర్ల పతనంతో తిరిగి నష్టాల్లోకి మళ్లింది. రూపాయి

Most from this category