News


ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు

Thursday 26th September 2019
Markets_main1569482698.png-28565

లాభాల మార్కెట్లో ఆటో రంగ షేర్ల లాభాల బాట పట్టాయి. వరుసగా రెండురోజుల పాటు నష్టాల్లో ట్రేడైన అటో షేర్లకు నేటి ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో అటో షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 2.50శాతం నష్టపోయింది. ఇండెక్స్‌లో అత్యధికంగా టీవీఎస్‌ మోటర్స్‌ షేర్లు 4శాతం లాభపడ్డాయి. ఎంఅండ్‌ఎం, అశోక్‌ లేలాండ్‌, భారత్‌ పోర్జ్స్‌ షేర్లు 3.50శాతం పెరిగాయి. మారుతి 2.50శాతం, ఎక్సైడ్‌, ఐషర్‌మోటర్స్‌, హీరోమోటోకార్ప్‌, టాటామోటర్స్‌, బజాజ్‌ అటో షేర్లు 2శాతం ర్యాలీ చేశాయి. ఎంఆర్‌ఎఫ్‌, మదర్‌సుమీ, భాష్‌ లిమిటెడ్‌, అమరరాజా బ్యాటరీస్‌ షేర్లు 1శాతం, అపోలో టైర్స్‌ షేర్లు అరశాతం పెరిగాయి. మధ్యాహ్నం గం.12:30లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(7,470.45)తో పోలిస్తే 2.15శాతం లాభంతో 7,630.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

20 మిడ్‌క్యాప్స్‌పై బ్రోకరేజ్‌ల సిఫార్సులు

Thursday 26th September 2019

కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 20 వ తేదిన కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 34.9 శాతం నుంచి 25.2 శాతానికి తగ్గించి మార్కెట్‌ వర్గాలను ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వరుస రెండు (సెప్టెంబర్‌ 20,22) సెషన్‌లలో ఈక్విటీ మార్కెట్‌లు భారీ స్థాయిలో ర్యాలీ చేశాయి. ఈ రెండు సెషన్‌లలోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 10 లక్షల కోట్లు పెరిగింది. నిఫ్టీ 50, సెన్సెక్స్‌ 8 శాతం చొప్పున లాభపడగా, బీఎస్‌ఈ

ఐసీఐసీఐ బ్యాంక్‌ కొత్త రికార్డు

Thursday 26th September 2019

ప్రైవేట్ రంగ బ్యాంక్‌ షేర్లకు లభిస్తున్న కొనుగోళ్ల మద్దతులో భాగంగా ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు గురువారం ఉదయం ట్రేడింగ్‌లో కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో నేడు ఈ బ్యాంక్‌ షేర్లు రూ.439.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో షేరు ఒక దశలో 5.50శాతం లాభపడి రూ.458.65 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఈ ధర షేర్లకు జీవితకాల

Most from this category