News


తాజా ర్యాలీతో మళ్లీ పెరిగిన వాల్యూషన్లు

Saturday 9th November 2019
Markets_main1573278463.png-29474

జియోజిత్‌ ఫిన్‌సర్వ్‌ రిసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌
రెండు నెలలుగా మార్కెట్లో కొనసాగుతున్న ర్యాలీ విస్తృతమైనదని, దీని కారణంగా తిరిగి మార్కెట్లలో వాల్యూషన్లు పెరిగిపోయాయని జియోజిత్‌ రిసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అభిప్రాయపడ్డారు. తాజా ర్యాలీ దాదాపు అన్ని రకాల షేర్ల(లార్జ్‌, మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌)లో కనిపించిందన్నారు. నిఫ్టీ తదితర సూచీలు దాదాపు 11- 12 శాతం మేర రాణించాయని దీంతో వాల్యూషన్లు ప్రీమియం స్థాయిలకు చేరుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా బ్లూచిప్స్‌, లార్జ్‌ క్యాప్స్‌లో వాల్యూషన్ల పెరుగుదల ఎక్కువగా ఉందన్నారు. దీంతో స్వల్పకాలానికి మార్కెట్లలో కన్సాలిడేషన్‌ కనిపించవచ్చని తెలిపారు. కానీ దీర్ఘకాలానికి దేశీయ మార్కెట్లు పాజిటివ్‌గా ఉంటాయన్నారు. ప్రధాన సూచీల్లో ర్యాలీ కనిపించాలంటే మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు మరింత పుంజుకోవాల్సిఉంటుందన్నారు.
లాంగ్‌టర్మ్‌ బెటర్‌...
క్యు2 ఫలితాలు క్రమంగా ఎర్నింగ్స్‌ మెరుగుదలను సూచిస్తున్నాయన్నారు. ముఖ్యంగా క్యు2లో బ్యాంకింగ్‌ రంగం మంచి పనితీరు కనబరిచిందన్నారు. సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలతో 2019-20 రెండో భాగం బాగుంటుందన్న అంచనాలు పెరిగాయని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన, ప్రకటించబోయే సంస్కరణలతో వృద్ధి వేగం పెరుగుతుందన్నారు. కానీ ఇప్పటివరకు ఉన్న డిమాండ్‌ మందకొడితనం కారణంగా నిలిచిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమయ్యేందుకు, ఇన్వెంటరీలు కరిగిపోయేందుకు కొంత సమయం పడుతుందన్నారు. ఈ సమస్యలు తీర్చేందుకు నిశితమైన ధక్పధంతో కూడిన విధానాలు అమలు చేయాలన్నారు. ఆటో రంగంలో డిమాండ్‌ క్రమంగా బాగుపడుతుందని గణాంకాలు చూపుతున్నాయని, బీఎస్‌6కు మారడం, కీలక రంగాల్లో వృద్ధి చిగురులు కనిపించడం... ఆటో రంగంలో రికవరీని తీసుకువస్తాయన్నారు. ఈ దఫా వర్షపాతం బాగుండడం కూడా పాజిటివ్‌ విషయమన్నారు. మరోవైపు అంతర్జాతీయంగా ట్రేడ్‌వార్‌ సమసిపోయే ఛాన్సులు పెరగడంతో ప్రపంచ మార్కెట్లలో రిస్కులు తగ్గాయన్నారు. ఎఫ్‌ఐఐలు కూడా క్రమంగా ఇండియా వైపు మరలుతున్నారన్నారు. అయితే రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకునే విత్త నిర్ణయాలను ఎఫ్‌ఐఐలు శ్రద్ధగా గమనిస్తున్నారన్నారు.You may be interested

3నెలల కనిష్టం వద్ద ముగిసిన పసిడి

Saturday 9th November 2019

దేశీయంగా రూ.38వేల కిందకు ...  అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్‌ ధర శుక్రవారం మూడునెలల కనిష్టం వద్ద స్థిరపడింది. అమెరికాలో గత రాత్రి డిసెంబర్‌ కాంటాక్టు ఔన్స్‌ పసిడి 3.50డాలర్లు నష్టపోయి 1,462.90డాలర్ల వద్ద ముగిసింది. అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చల్లో భాగంగా ‘‘మొదటి దశ ఒప్పందం’’ సఫలం దిశగా సాగుతుందనే ఆశావహన అంచనాలు పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను తగ్గించాయి. నిన్నటి ట్రేడింగ్‌లో పసిడి ధర 1457డాలర్ల వద్ద ఇంట్రాడే కనిష్టస్థాయిని

ఫ్లాట్‌గా ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 9th November 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం ప్లాట్‌గా ముగిసింది. నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11945.35 తో పోలిస్తే 5పాయింట్ల లాభంతో 11,950.50 వద్ద స్థిరపడింది. భారత క్రెడిట్‌ రేటింగ్‌ అవుట్‌లుక్‌ను మూడీస్‌ తగ్గించడంతో పాటు సూచీల లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో  రెండు రోజుల రికార్డ్‌ ముంగింపు లాభాలకు బ్రేక్‌ పడింది. సెన్సెక్స్‌ 330 పాయింట్ల నష్టంతో 40,324 వద్ద, నిఫ్టీ 104 పాయింట్లు పతనమై

Most from this category