News


ర్యాలీస్‌.. క్యూ3 జోష్‌- యస్‌ బ్యాంక్‌.. ఏజీఆర్‌ షాక్‌

Friday 17th January 2020
Markets_main1579240656.png-30988

టాటా గ్రూప్‌ ఆగ్రో కెమికల్స్‌ కంపెనీ ర్యాలీస్‌ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. దీంతో భారీ లాభాలతో కళకళలాడుతోంది. అయితే మరోపక్క ఇటీవల నేలచూపులతో కదులుతున్న ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఏజీఆర్‌ బకాయిలపై టెలికం కంపెనీలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో టెలికం రుణాలు మొండిబకాయిలుగా మారే వీలున్నదన్న అంచనాలు యస్‌ బ్యాంకు కౌంటర్లో అమ్మకాలు కారణమవుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వివరాలు చూద్దాం...

ర్యాలీస్‌ ఇండియా లిమిటెడ్‌ 
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌- డిసెంబర్‌)లో ర్యాలీస్‌ ఇండియా నికర లాభం 177 శాతం జంప్‌చేసి రూ. 38 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 28 శాతం పుంజుకుని రూ. 417 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం సైతం రెట్టింపై రూ. 48 కోట్లుగా నమోదైంది. ఇబిటా మార్జిన్లు 3.8 శాతం ఎగసి 10.4 శాతాన్ని తాకాయి. క్యూ3 ఆదాయంలో దేశీ బిజినెస్‌ 35 శాతం పుంజుకోగా.. అంతర్జాతీయంగా అమ్మకాలు 24 శాతం పెరిగాయి. ఈ కాలంలో ర్యాలీస్‌ ఇండియా.. కొత్తగా సార్థక్‌, ఇంపీడర్‌ పేర్లతో రెండు కొత్త ఫార్ములేషన్లను విడుదల చేసింది. కాగా.. మెట్రిబుజిన్‌ తయారీ రెండో దశ విస్తరణ పూర్తయిందని, ఫిబ్రవరి 1నుంచి వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి ప్రారంభంకానున్నట్లు ర్యాలీస్‌ ఇండియా ఈ సందర్భంగా తెలియజేసింది. 500 ఎంటీపీఏ సామర్థ్యం అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది.

యస్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌
టెలికం కంపెనీల ఏజీఆర్‌ బకాయిలు రూ. 3.13 లక్షల కోట్లుకాగా.. వీటిలో బ్యాంకింగ్‌ రుణాలు రూ. 1.3 లక్షల కోట్లమేర ఉన్నట్లు క్రెడిట్‌ స్వీస్‌ పేర్కొంది. కాగా.. వొడాఫోన్‌ ఐడియా రుణాలలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ వాటా 8-12 శాతం వరకూ ఉన్నట్లు తెలియజేసింది. మరోవైపు యస్‌ బ్యాంక్‌ దీర్ఘకాలిక విదేశీ మారక రేటింగ్‌ B2ను సమీక్షిస్తున్నట్లు మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీస్‌ పేర్కొంది. దీంతో యస్‌ బ్యాంక్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. తొలుత ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 7 శాతం పతనమైంది. కనిష్టంగా రూ. 37ను తాకింది. ప్రస్తుతం 3 శాతం నష్టంతో రూ. 39 దిగువన ట్రేడవుతోంది.You may be interested

మూడోరోజూ పెరిగిన పసిడి

Friday 17th January 2020

కలిసొచ్చిన రూపాయి బలహీనత  దేశీయ బులియన్‌ మార్కెట్లో బంగారం ధర వరుసగా మూడోరోజూ లాభపడింది. ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.39790 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేడు ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 7పైసలు నష్టంతో బంగారానికి కలిసొచ్చింది. మిశ్రమ ఫండమెంటల్స్‌ కారణంగా స్వల్పకాలానికి బంగారం అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చని రూ.39600స్థాయి వద్ద కీలక మద్దతు ధరను, రూ.39,800 నిరోధస్థాయిని ఏర్పాటు చేసుకున్నట్లు

రెండో రోజూ అల్ఫాజియో దూకుడు

Friday 17th January 2020

లాభాల్లో మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌ వరుసగా రెండో రోజు ఒడిదొడుకుల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్నాయి. ఏజీఆర్‌ బకాయిలపై టెలికం కంపెనీలు పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో బ్యాం‍కింగ్‌ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకోగా.. వొడాఫోన్‌ ఐడియా 30 శాతం కుప్పకూలింది. అయితే ఎయిర్‌టెల్‌తోపాటు.. జియో సేవల మాతృ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్లు బలపడ్డాయి. ఉదయం 10.30 ప్రాంతంలో సెన్సెక్స్‌ 108 పాయింట్లు

Most from this category