News


టైటాన్‌ షేరుపై బ్రోకరేజ్‌ సంస్థలేమంటున్నాయ్‌..?

Wednesday 5th February 2020
Markets_main1580890752.png-31530

‍దలాల్‌ స్ట్రీట్‌లో ఏస్‌ ఇన్వెస్టర్‌గా పేరొందిన రాకేశ్‌ ఝున్‌ఝున్‌ వాలా పెట్‌ స్టాక్‌గా పిలువబడే టైటాన్‌ షేరు కంపెనీ ఫలితాలు మంగళవారం మార్కెట్‌ ముగింపు అనంతరం వెలువడ్డాయి. క్యూ3 ఫలితాలను ఒకసారి పరిశీలించినట్లైతే.... మెరుగైన నిర్వహణతో పాటుగా తక్కువ పన్ను ఖర్చు(లోయర్‌ టాక్స్‌ కాస్ట్‌)లు కలిసిరావడంతో ఈ క్యూ3లో కంపెనీ నికరలాభం 13 శాతం వృద్ధి చెంది రూ.470 కోట్లను ఆర్జించింది. వార్షిక ప్రాతిపదికన మొత్తం అమ్మకాలు 8.50శాతం పెరిగి రూ.6,105.96 కోట్లను సాధించింది. ఈ మొత్తం ఆదాయాల్లో సింహభాగమైన జూవెలరీ అమ్మకాలు రూ.5,409 కోట్లుగా ఉన్నాయి. ఫలితాలు అంచనాలకు మించి నమోదు చేయడంతో బుధవారం ట్రేడింగ్‌లో 2శాతం లాభపడింది. అలాగే బ్రోకేరేజ్‌ సంస్థలు ఈ షేరుపై భిన్నమైన రేటింగ్‌ను కేటాయించాయి.

మోర్గాన్‌ స్టాన్లీ:- గతంలో కేటాయించిన ఈక్విల్‌ వెయిట్‌ కాల్‌ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. టార్గెట్‌ ధరను రూ.1240లుగా నిర్ణయించింది. ప్రస్తుత వాతావరణంలో ఆభరణాల వ్యాపారంలో 15 శాతం రిటైల్ వృద్ధికి అవకాశం ఉందని తెలిపింది. క్యూ4, ఎఫ్‌వై 21కాలానికి మార్జిన్ ట్రెండ్స్‌, జువెలరీ వ్యాపార వృద్ది లక్ష్యాలు తదితర అంశాలు షేరు పనితీరును నిర్ణయిస్తామని బ్రోకరేజ్‌ సం‍స్థ తెలిపింది.

క్రిడెట్‌ శాష్యూ:- వాల్యూవేషన్లు విస్తరించిన కారణంగా గతంలో కేటాయించిన న్యూట్రల్‌ రేటింగ్‌ కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే టార్గెట్‌ ధరను మాత్రం రూ.1110 నుంచి రూ.1250కి పెచింది. గ్లోబల్ బ్రోకరేజ్ ఆభరణాల విభాగంలో తన దీర్ఘకాలిక మార్కెట్ వాటా లాభాలను కొనసాగించే అవకాశం ఉంది. ఆర్థిక సంవత్సరం 20-22 మధ్యకాలానికి ఆదాయ మార్జిన్లు 1-2శాతం కోత విధించింది. అయితే టార్గెట్‌ 46రెట్ల నుంచి 50 రెట్లకు పెంచింది. 

యూబీఎస్‌:- గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. టార్గెట్‌ ధరను రూ.1,525లుగా నిర్ణయించింది. పెళ్లిల సీజన్‌లో కంపెనీ మార్కెట్ వాటాను రానున్న మూడు ఆర్థిక సంవత్సరాల్లో 6.1శాతం నుంచి 12.1శాతానికి పెంచుకోగలదని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. బంగారం ధరలు 7-8శాతం పెరిగిన కారణంగా జనవరి త్రైమాసికాన్ని స్తబ్దుగా ప్రారంభించింది. క్యూ4లో 1-13శాతం ఆదాయ వృద్ది గైడెన్స్‌ను మేనేజ్‌మెంట్‌ పునరుద్ఘాటించింది.

మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌:- గతంలో షేరుకు కేటాయించిన న్యూట్రల్‌ రేటింగ్‌ కాల్‌ను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. టార్గెట్‌ ధరను రూ.1320గా నిర్ణయించింది. ధీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్‌ దృష్టా‍్య షేరు ఇప్పటికి బలంగానే ఉంది. మోడళ్ల మార్పు కారణంగా ఈపీఎస్‌ల్లో ఆర్థిక సంవత్సరం 20లో 6.5శాతం, ఆర్థిక సంవత్సరం 21లో 2శాతం వృద్ధి చెందే అవకాశం ఉంది. అసంఘటిత భారత జూవెలరీ మార్కెట్లో ప్రస్తుత స్థాయి నుంచి 9శాతం వరకు వృద్ధి చెంది అవకాశాలున్నందున ధీర్ఘకాల పెట్టుబడులకు టైటాన్‌ షేరు అనుకూలంగా ఉంది. 
 You may be interested

టాటామోటర్స్‌ షేరు 10శాతం జంప్‌..!

Wednesday 5th February 2020

ఉత్సాహానిచ్చిన బ్రిటన్‌ జేఎల్‌ఆర్‌ విక్రయ గణాంకాలు టాటా మోటర్స్‌ షేరు బుధవారం ట్రేడింగ్‌లో 10శాతం లాభపడింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.167.20 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. రానున్న రెండేళ్లలో కనీసం 4రకాల మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తామని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటనతో పాటు వార్షిక ప్రాతిపదికన బ్రిటన్‌లో జేఎల్‌ఆర్‌ అమ్మకాలు జవవరిలో 3శాతం వృద్ధిని సాధించడం,  జనవరి మాసపు విక్రయగణాంకాలు ఆశించిన స్థాయిలో నమోదుకావడంతో

52 వారాల గరిష్టానికి 50 షేర్లు

Wednesday 5th February 2020

బుధవారం 50 షేర్లు 52 వారాలా గరిష్టానికి చేరాయి. 52 వారాలా కనిష్టానికి చేరిన షేర్లలో ఏజీసీ నెట్‌వర్క్స్‌, అజంతా ఫార్మా, ఆలకైల్‌ అమెన్స్‌ కెమికల్స్‌, అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, అర్మాన్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, బేయర్‌ క్రాప్‌సైన్స్‌, బర్గర్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, క్లేరియంట్‌ కెమికల్స్‌, ఎవిన్యూ సూపర్‌మార్ట్స్‌, ఎడిల్వీజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ఎస్కార్ట్స్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, గ్రీన్‌ ప్యానల్‌ ఇండస్ట్రీస్‌లు ఉన్నాయి. 52

Most from this category