News


రికవరి బాటలో రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా షేర్లు ..!

Wednesday 4th March 2020
Markets_main1583306244.png-32269

మార్కెట్‌ వరుస ఏడురోజుల పతనంలో భాగంగా దాదాపు 13లక్షల కోట్ల ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు ఉద్దీపన చర్చల ప్రకటనలపై ఆశలతో పాటు ఆర్‌బీఐ సైతం ఈక్విటీ మార్కెట్లు సాఫీగా పనిచేసేందుకు చర్యలు తీసుకుంటామని అభయం ఇవ్వడంతో మంగళవారం మార్కెట్‌ లాభంతో ముగిసింది. మార్కెట్‌ రివకరీలో భాగంగా ఏస్‌ ఇన్వెస్టర్ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులు పెట్టిన కంపెనీల షేర్లు ఎక్కువగా రికవరి అయ్యాయి. 

ఫైనాన్స్‌ మార్కెట్ల క్రమబద్ధమైన పనితీరుకు తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆర్‌బీఐ మంగళవారం ప్రకటించింది. ప్రపంచ, దేశీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. మరోవైపు నిన్నరాత్రి అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌బ్యాంక్‌ అత్యవసరంగా కీలక వడ్డీరేట్లను 50బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అయితే వడ్డీరేట్ల తగ్గింపు ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించలేదని ఇన్వెస్టర్ల భావించడంతో అమెరికా స్టాక్‌ సూచీలు నష్టాలతో ముగిశాయి.


1. రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులు పెట్టిన లుపిన్‌ షేరు ఏడురోజుల వరుస నష్టాలకు స్వస్తి పలుకుతూ మంగళవారం 3.21శాతం లాభంతో ముగిసింది. గడచిన ఏడురోజుల్లో ఈ షేరు ఏకంగా 11శాతం నష్టాన్ని చవిచూసింది. ఝున్‌ఝున్‌వాలాకు డిసెంబర్‌ 31 నాటికి లుపిన్‌ కంపెనీలో 1.50శాతం వాటా ఉంది.

2. డెల్ట్‌ కార్ప్‌ షేరు సైతం 5శాతం లాభంతో రూ.131.90 వద్ద ముగిసింది. ఈ కంపెనీలో ఝున్‌ఝున్‌వాలాకు 7.3శాతం వాటా ఉంది. 7 రోజుల్లో ఈ షేరు 15శాతం క్షీణిచింది. 

3. ఐటీరంగానికి చెందిన ఫస్ట్‌సోర్స్‌ షేరు మంగళవారం 3.68శాతం పెరిగింది. ఈ షేరు ఏడురోజుల్లో 14శాతం నష్టాన్ని చవిచూడగా, ఈయన ఈ కంపెనీలో 3.68శాతం వాటా ఉంది. 

4. అటోలైన్‌ ఇండస్ట్రీస్‌ షేరు 1శాతం లాభపడి రూ.18.80 వద్ద ముగిసింది. మార్కెట్‌ పతనంలో భాగంగా ఈ షేరు 17శాతం శాతం నష్టపోయింది. సూచీల పతనంలో భాగంగా 11శాతం నష్టాన్ని చవిచూసిన రియల్‌ ఎస్టేట్‌ రంగానికి చెందిన మ్యాన్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ షేరు 2.76శాతం లాభపడింది. 

5. టీవీ-18 కంపనీ షేరు అరశాతం పెరిగింది. ఏడు రోజుల్లో ఈ షేరు 20.50శాతం నష్టాన్ని చవిచూసింది. ఈ కంపెనీలో ఝున్‌ఝున్‌వాలాకు 2.3శాతం వాటా ఉంది. 

6. ఏడురోజుల్లో 19.50శాతం క్షీణించి అప్‌టెక్‌ షేరు 1శాతం లాభంతో ముగిసింది. 

7. ఝున్‌ఝున్‌వాలా సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులు కలిగిన ఉన్న ఎన్‌సీసీ షేరు 5.50శాతం లాభంతో ముగిసింది. గడచిన 7రోజుల్లో ఈ షేరు 17.50శాతం నష్టపోయింది. 

మరోవైపు ఝున్‌ఝున్‌వాలా వాటాలు కలిగిఉన్న వీఐపీ ఇండస్ట్రీస్‌, కరూర్‌వైశ్యా బ్యాంక్‌ షేర్ల మాత్రం నష్టాల ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. నేటి ట్రేడింగ్‌ను పరిగణలోకి తీసుకొని  వీఐపీ ఇండస్ట్రీస్‌ షేరు 18.50శాతం, కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ 14.50శాతం​పతనమయ్యాయి. 



You may be interested

52 వారాల కనిష్టానికి పతనమైన 318 షేర్లు

Wednesday 4th March 2020

మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో 52 వారాల కనిష్టానికి 318 షేర్లు పడిపోయాయి. వీటిలో 3P ల్యాండ్‌ హోల్డింగ్స్‌, అబాన్‌ ఆఫ్‌షోర్‌, ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌, అగ్రీటెక్‌ ఇండియా, అశోక్‌ ఆఫ్టీఫైబర్‌, అలికాన్‌ కాస్టలాయ్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, ఆంధ్రా సుగర్స్‌, ఆంధ్రా పేపర్‌, ఆప్కోటెక్స్‌ ఇండస్ట్రీస్‌, ఆర్కోటెక్‌, అర్షియా, అట్లాంటా, ఆటోమోటివ్‌ యాక్సెల్స్‌, ఆటోలైన్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ హిందుస్తాన్‌ సుగర్‌, బాల్మర్‌ లారీ అండ్‌ కంపెనీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బాట్రానిక్స్‌ ఇండియా, బీఈఎంఎల్‌లు

ఆటో సెక్టార్‌పై జీఎస్టీ తగ్గనుందా..?

Wednesday 4th March 2020

ఆటో రంగంలో జీఎస్టీ భారం కొంత మేర తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రంగానికి మరింత ఊతం ఇచ్చేందుకు జీఎస్టీ రేట్లను తగ్గించాలని  పార్లమెంటరీ ప్యానెల్‌ సూచించింది. అంతేకాకుండా 2018 జులై నుంచి నెగిటివ్‌ వృద్ధి చూపుతున్న ఆటోమొబైల్‌ ఉత్పత్తిని మరింత పెంచేందుకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఏకీకృత విధానంలో రోడ్డు పన్ను విధించాలని పార్లమెంట్‌కు సమర్పించిన  హెవీ ఇండస్ట్రీ డిమాండ్స్‌ ఫర్‌ గ్రాంట్స్‌ 2020-21 నివేదికలో పేర్కొంది.

Most from this category