STOCKS

News


ఈక్విటీ, బంగారంపై బుల్లిష్‌: ఝున్‌ఝున్‌వాలా

Thursday 3rd October 2019
Markets_main1570087975.png-28696

  ప్రస్తుతం ఇండియా ఈక్విటీ మార్కెట్లు చీకటి దశను ఎదుర్కొంటున్నాయని, కానీ మరి కొద్ది కాలంలో వెలుగొస్తుందని సీనియర్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా అన్నారు. ‘దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్నంతా అనిశ్చితిని ఇదివరకెప్పుడూ చూడలేదు. బహుశా ఇది మార్కెట్లకు ఉదయానికి ముందు వచ్చే చీకటి లాంటిది’ అని ఆయన అన్నారు. ‘మార్కెట్‌ పెరిగే ముందు, కోనుగోలు చేసుకోడానికి మనకొక అవకాశం ఇస్తుంది. ఇది వాతావరణం లాంటిది. మనకు నచ్చకపోయిన భరించక తప్పదు’ అని అభిప్రాయపడ్డారు.  అయినప్పటికి మార్కెట్‌పై బుల్లిష్‌గా ఉన్నానని తెలిపారు. దేశ జీడీపీ వృద్ధి రేటు 2022-23 నాటికి 9 శాతానికి చేరుకుంటుందని ఝున్‌ఝున్‌వాలా జోస్యం చెప్పారు. ‘2025 నాటికి దేశ జీడీపీ 5 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటే, ఇళ్లలో దాచుకున్న పొదుపు నగదు కూడా ఈక్విటీల్లోకి వస్తుంది’ అని ఆయన అన్నారు. దేశంలో పేదరికాన్ని చూసిన కొద్ది మంది ప్రధానుల్లో నరేంద్రమోదీ ఒకరని, తను సాహసోపేత నిర్ణయాలను తీసుకోడానికి వెనుకాడరని ప్రధాని నరేంద్రమోదీని పొగిడారు. అంతేకాకుండా దేశంలోని పన్ను వ్యవస్థ అంతర్జాతీయంగా పోటిపడే విధంగా మోదీ మారుస్తారని ఝున్‌ఝున్‌వాలా అభిప్రాయపడ్డారు.  
ఈ లక్షణాలవసరం..
 ఒక కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసేముందు..ఆ కంపెనీకి సంబంధించి ఓపిక, సాంకేతికత, పొదుపు, మేనేజ్‌మెంట్‌, పాలన వంటి ఐదు అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సలహాయిచ్చారు. ‘వ్యాపారాల్లో ఓపికలేకపోవడం చాలా పెద్ద తప్పు’ అని అన్నారు. గత పదేళ్లలో ఇండియాలో ఏర్పడిన కంపెనీలలో ఇండిగో, డీ మార్ట్‌ కంపెనీల గొప్పవని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ప్రభుత్వం ట్యాక్స్‌ తగ్గింపును చేయడంతో ప్రభుత్వ రంగ యూనిట్లు(పీఎస్‌యూ) బాగా లాభపడ్డాయని, ఈ స్టాకులలో అవకాశాలున్నాయని తెలిపారు. ‘అనుకున్న విధంగా ప్రభుత్వ డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రణాళిక పూర్తయితే పీఎస్‌యూలు మంచి స్థానాల్లో ఉంటాయి’ అని అభిప్రాయపడ్డారు. వచ్చే ఐదేళ్ల కాలానికి గాను ఈక్విటీలు, బంగారంపై పాజిటివ్‌గా ఉన్నానని, బంగారం 2,500-3,000 డాలర్ల స్థాయిని చేరుకుంటుందని అంచనావేస్తున్నానని తెలిపారు. కాగా బుధవారం ట్రేడింగ్‌లో బంగారం 1,500 డాలర్ల స్థాయిని చేరుకున్న విషయం తెలిసిందే. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు బారెల్‌ 55-65 డాలర్ల మధ్య కదలాడవచ్చని తెలిపారు. You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1.50శాతం డౌన్‌

Thursday 3rd October 2019

బ్యాంకు రంగ షేర్ల భారీ పతనంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం మిడ్‌సెషన్‌ కల్లా 1.50శాతం(430 పాయింట్లు) నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 28,606.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఇండెక్స్‌ 1.50శాతం నష్టపోయి 28,296.50 కనిష్టానికి పతమైంది. ఇండెక్స్‌లో అత్యదిక వెయిటేజీ కలిగిన ప్రైవేట్‌రంగ బ్యాంకు షేర్లైన కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌,

యస్‌బ్యాంక్‌ 30 శాతం జంప్‌

Thursday 3rd October 2019

వారం రోజుల్లోనే 47శాతం నష్టపోయిన చవిచూసిన యస్‌ బ్యాంక్‌ షేర్లు గురువారం భారీగా రికవరీ అయ్యాయి. బ్యాంక్‌ ఆర్థిక స్థితిగతులపై యాజమాన్యం స్టాక్‌ ఎక్చ్సేంజీలకు స్పష్టతనివ్వడంతో నేటి ఉదయం సెషన్‌లో షేర్లు 29శాతం వరకు లాభపడ్డాయి. ప్రమోటర్‌ రాణా కపూర్‌ తనఖా పెట్టిన 10 కోట్ల షేర్లను ఉద్దేశపూర్వకంగా విక్రయించడం వల్లే షేర్లు భారీ పతనాన్ని చవిచూసినట్లు యస్‌బ్యాంక్‌ తెలిపింది. ఇప్పటికి తమ బ్యాంకు ఫైనాన్షియల్‌ ఫండమెంటల్స్‌ బలంగానే ఉన్నాయని

Most from this category