News


ఐఆర్‌సీటీసీని ఇంత తక్కువకు విలువ కడతారా?!

Thursday 17th October 2019
Markets_main1571308866.png-28957

రైల్వే శాఖ నిరసన
ఐఆర్‌సీటీసీ ఐపీఓ ధరపై భారతీయ రైల్వే శాఖ నిరసన వ్యక్తంచేసింది. తాజాగా లిస్టయిన ఐఆర్‌సీటీసీ తొలిరోజు దుమ్ముదులిపిన సంగతి తెలిసిందే. షేరు ఆరంభంలో దాదాపు 100 శాతానికి పైచిలుకు లాభపడింది. ఈ నేపథ్యంలో షేరు ఆఫర్‌ ధరను అంత తక్కువగా నిర్ణయించడంపై రైల్వే శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం సరైన విచారణ జరపాలని, అప్పుడే భవిష్యత్‌లో పీఎస్‌యూ కంపెనీల పబ్లిక్‌ ఆఫర్లకు మంచి ధర రాబట్టగలమని పేర్కొంది. ఐఆర్‌సీటీసీ షేరు ప్రస్తుతం దాదాపు రూ. 724 వద్ద ఉంది. ఈ ధర ప్రకారం కంపెనీ విలువ దాదాపు 11,700 కోట్లుంటుంది. అయితే ఐపీఓలో కంపెనీ వాల్యూషన్‌ను రూ. 5000 కోట్లుగా లెక్కించారు. ఈ లెక్కన ఐపీఓలో ప్రభుత్వం తన వాటా కిందున్న 12.6 శాతం వాటాను విక్రయించి రూ. 645 కోట్లు సమీకరించింది. ఇది పబ్లిక్‌ ఆఫర్‌లో కంపెనీ విలువ లెక్కించిన బ్యాంకర్ల పాత్రపై అనుమానాలు రేకెత్తిస్తోంది. ఐడీబీఐ క్యాపిటల్‌, ఎస్‌బీఐ క్యాపిటల్‌, యస్‌ సెక్యూరిటీస్‌లు ఈ ఇష్యూకు మేనేజర్లుగా వ్యవహరించాయి. రెండేళ్ల క్రితం ఐఆర్‌సీటీసీని ఐపీఓకి తెచ్చే యత్నాలు జరిగాయి. అప్పుడు కంపెనీ వాల్యూషన్‌ను రూ. 2500 కోట్లుగా లెక్కించారు. దీంతో అప్పటి రైల్వే మంత్రి ఇష్యూ ప్రతిపాదనను విరమించుకున్నారు. తాజాగా వాల్యూషన్‌ రూ. 5వేల కోట్లుగా లెక్కించినా ఆఫర్‌ లిస్టింగ్‌ సమయాన అసలు విలువ అంతకుమించి ఉందని తేలింది. దీనిపై ఐఆర్‌సీటీసీ నిర్వహణ చూసే రైల్వే శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. 



You may be interested

బ్యాంకింగ్‌..బ్రెగ్జిట్‌...సూచీలకు భారీ లాభాలు.!

Thursday 17th October 2019

ఫైనాన్షియల్‌ షేర్లలో జోరుగా కొనుగోళ్లు సాగడంంతో దేశీయ మార్కెట్‌ గురువారం భారీ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 453 పాయింట్లు లాభపడి 39000ల పైన 39,052.06 వద్ద ముగిసింది. నిఫ్టీ 122 పాయింట్ల పెరిగి 11,586.35 వద్ద ముగిసింది. సెప్టెంబర్‌ 24 తరువాత సూచీలు ఈ స్థాయి వద్ద ముగియడం ఇదే తొలిసారి. మార్కెట్‌ మరో అరగంటలో ముగిస్తుందనే తరుణంలో బ్రెగ్జిట్‌ డీల్‌ కుదిరినట్లు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సస్‌ ప్రకటించడంతో మార్కెట్లో

బ్రెగ్జిట్‌ డీల్‌ ఎఫెక్ట్‌: టాటామోటర్స్‌ 13%, టాటా స్టీల్‌ 3% అప్‌

Thursday 17th October 2019

  బ్రిటన్‌, ఈయూ(యురోపియన్‌ యూనియన్‌) మధ్య బ్రెగ్జిట్‌ ఒప్పందం కుదరడంతో టాటా మోటర్స్‌, టాటా స్టీల్‌ షేర్లు అనుహ్యాంగా పెరిగాయి. టాటా స్టీల్‌, టాటా మోటర్స్‌ కంపెనీలు బ్రిటన్‌లో ఉండడంతో బ్రెగ్జిట్‌ ఒప్పందం ఈ కంపెనీలకు మేలు చేస్తుందన్న అంచనాలతో మార్కెట్‌ ముగింపులో ఈ కౌంటర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. ఈ ఒప్పందం కుదిరినట్లు గురువారం మధ్యాహ్నం 3.00 గంటలకు వార్తలు వెలువడంతో టాటా మోటార్స్‌ షేరు ఇంట్రాడేలో 15 శాతం​లాభపడి రూ. 144 గరిష్టస్థాయిని

Most from this category