News


బడ్జెట్‌ ఎఫెక్ట్‌- రైల్వే షేర్లు స్పీడ్‌

Wednesday 29th January 2020
Markets_main1580289746.png-31306

ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌, ఐఆర్‌సీటీసీ హైజంప్‌
రైట్స్‌, హింద్‌ రెక్టిఫయర్స్‌, టెక్స్‌మాకో జూమ్‌

మూడు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రైల్వే రంగ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేసినప్పటికీ ఈసారి రైల్వేలకు కేటాయింపులు పెరగనున్న అంచనాలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, రవాణా తదితరాలకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు తాజాగా రైల్‌ సంబంధ కౌంటర్లలో కొనుగోళ్లకు దృష్టిసారించారు. వెరసి పలు కౌంటర్లు లాభాలతో కళకళలాడుతున్నాయి. వీటిలో ప్రభుత్వ రంగ కంపెనీలు ఐఆర్‌సీటీసీ లిమిటెడ్‌, ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ చరిత్రాత్మ గరిష్టాలను తాకగా.. రైట్స్‌ లిమిటెడ్‌ 52 వారాల గరిష్టానికి చేరింది. ఇతర వివరాలు చూద్దాం..

షేర్ల పరుగు
మధ్యాహ్నం 2.15 ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ షేరు 7 శాతం దూసుకెళ్లి రూ. 487 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 492ను అధిగమించడం ద్వారా లైఫ్‌టైమ్‌ హైను అందుకుంది. ఇక ఐఆర్‌సీటీసీ లిమిటెడ్‌ 4.25 శాతం జంప్‌చేసి రూ. 1093 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 1002.5ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. రైట్స్‌ లిమిటెడ్‌ 3 శాతం పెరిగి రూ. 326 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 329 సమీపంలో 52 వారాల గరిష్టాన్ని చేరింది. ఈ బాటలో హింద్‌ రెక్టిఫయర్స్‌ 3.55 శాతం ఎగసి రూ. 253 వద్ద కదులుతోంది. తొలుత రూ. 260 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. టెక్స్‌మాకో రైల్‌ 5.5 శాతం జంప్‌చేసి రూ. 40 వద్ద, టిటాగఢ్‌  వేగన్స్‌ 2.8 శాతం పుంజుకుని రూ. 58 వద్ద, రైల్‌ వికాస్‌ నిగమ్‌ 4 శాతం పురోగమించి రూ. 28 వద్ద ట్రేడవుతున్నాయి. ఇతర కౌంటర్లలో కంటెయినర్‌ కార్పొరేషన్‌ 1.65 శాతం బలపడి రూ. 580 వద్ద, సీమెన్స్‌ 2 శాతం లాభంతో రూ. 1535 వద్ద, బీఈఎంఎల్‌ 0.5 శాతం పుంజుకుని రూ. 994 వద్ద, కెర్నెక్స్‌ మైక్రో సిస్టమ్స్‌ 1 శాతం పెరిగి రూ. 19 వద్ద ట్రేడవుతున్నాయి. You may be interested

ఎఫ్‌పీఐలు వాటాలు పెంచుకున్న టాప్‌ 20 షేర్లు!

Wednesday 29th January 2020

డిసెంబర్‌ త్రైమాసికంలో ప్రైవేట్‌ బ్యాంకులు, బీమా కంపెనీలతో సహా పలు రంగాలకు చెందిన స్టాకుల్లో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు వాటాలు పెంచుకున్నారు. బడ్జెట్‌ నేపథ్యంలో ఆటోమొబైల్‌ తదితర బడ్జెట్‌ ప్రభావిత రంగాల షేర్లపై కూడా ఎఫ్‌ఐఐలు కన్నేశారు. బ్యాంకుల్లో ఆర్‌బీఎల్‌, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకుల్లో ఎఫ్‌పీఐల వాటా దాదాపు 300- 600 బీపీఎస్‌ మేర పెరిగింది. బడ్జెట్లో దివాలా చట్టానికి మరింత పదును పెరుగుతుందని, మొండిపద్దుల రికవరీ

ఎస్‌బీఐ ఓకే- బీమా షేర్లు వ్యయభరితం?!

Wednesday 29th January 2020

ప్రస్తుతానికి ఎయిర్‌లైన్స్‌ షేర్లను విస్మరించవచ్చు ఎయిర్‌ ఇండియా కొనుగోలుకి ప్రాధాన్యం ఎన్‌బీఎఫ్‌సీలలో మణప్పురం ఫలితాలు గుడ్‌ - దీపక్‌ షినాయ్‌, కేపిటల్‌ మైండ్‌ వ్యవస్థాపకులు ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ షేరుని తగ్గినప్పుడు కొనుగోలు చేయవచ్చునంటున్నారు కేపిటల్‌ మైండ్‌ వ్యవస్థాపకులు దీపక్‌ షినాయ్‌. బ్యాంకింగ్‌, ఐటీ రంగాల ఫలితాలు, ర్యాలీ చేస్తున్న బీమా రంగ కౌంటర్లు తదితర పలు అంశాలపై ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయాలను వెల్లడించారు. వివరాలు చూద్దాం..  దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌

Most from this category