News


డీమార్ట్‌ అధినేత కొత్తగా కొన్న మూడు స్టాక్స్‌

Thursday 20th February 2020
Markets_main1582137438.png-31940

డీమార్ట్‌ పేరుతో అత్యంత విలువైన రిటైల్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి, దేశంలో ముకేశ్‌ అంబానీ తర్వాత రెండో అత్యంత సంపన్నుడిగా అవతరించిన రాధాకిషన్‌ శివకిషన్‌ ధమానీ, టాప్‌ ఇన్వెస్టర్‌గానూ పరిచయస్తుడే. ఒకవైపు అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యానికి ప్రమోటర్‌గా ఉన్న ఆయన, మరోవైపు తన తొలి వ్యాపారమైన స్టాక్‌ ఇన్వెస్టింగ్‌ను ఇప్పటికీ చురుగ్గానే కొనసాగిస్తున్నారు. డిసెంబర్‌ త్రైమాసికంలో రాధాకిషన్‌ ధమానీ కొత్తగా మూడు స్టాక్స్‌ను తన పోర్ట్‌ఫోలియోలోకి చేర్చుకున్నారు. అవి సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌, స్పెన్సర్స్‌రిటైల్‌. 

 

సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో 2.28 శాతానికి సమానమైన వాటాలను డిసెంబర్‌ త్రైమాసికంలో దమానీ కొనుగోలు చేశారు. అదే విధంగా ఆర్‌పీజీ గ్రూపునకు చెందిన స్పెన్సర్స్‌ రిటైల్‌లో 2.09 శాతం వాటా తీసుకున్నారు. ఒక రిటైల్‌ మార్ట్‌ చైన్‌ అధినేత అయి ఉండి, మరో రిటైల్‌ చైన్‌ స్టాక్‌లో వాటాలను కొనుగోలు చేశారంటే.. ఆ కంపెనీ భవిష్యత్తు విషయమై అయన విశ్లేషణను అర్థం చేసుకోవచ్చు. కనుక రిటైల్‌ ఇన్వెస్టర్లు ఈ అంశాన్ని విస్మరించకూడదు. ఇక  సిగరెట్ల తయారీ కంపెనీ వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌లోనూ దమానీ 3.26 శాతం వాటాలు కొనుగోలు చేశారు. ఇక ఇండియా సిమెంట్స్‌లో తన వాటాలను 4.73 శాతానికి ఆయన పెంచుకున్నారు. సెప్టెంబర్‌ చివరికి ఇండియా సిమెంట్స్‌లో 1.3 శాతం వరకే వాటా ఉండగా, గణనీయంగా పెంచుకోవడం గమనార్హం.

 

ఇక దేశీయంగా రెండో అతిపెద్ద ఫుడ్‌ ‍ప్రాసెసింగ్‌ కంపెనీ ఫుడ్స్‌ అండ్‌ ఇన్స్‌లో దమానీ వాటా స్థిరంగా 4.72 శాతంగా ఉంది. డెల్టా కార్ప్‌లో ఆయనకు సెప్టెంబర్‌ నాటికి 1.53 శాతం వాటా ఉండగా, డిసెంబర్‌ త్రైమాసికంలో 1.32 శాతానికి తగ్గించుకున్నారు. అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ (డీమార్ట్‌ బ్రాండ్‌ పేరుతో మార్ట్‌లను నిర్వహించే కంపెనీ పేరు) మార్కెట్‌ విలువ తాజాగా 1,57,085కోట్లకు చేరుకుంది. కంపెనీలో దమానీకి, ఆయన కుటుంబ సభ్యులకు 75 శాతం వాటా ఉంది. 2017లో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌.. ఒక్కో షేరు జారీ ధర రూ.299. లిస్టింగ్‌లోనే రెట్టింపు లాభాలు ఇవ్వగా, ఐపీవో ధరతో పోలిస్తే ఇప్పటికి ఎనిమిదిరెట్లు పెరిగింది. దీంతో అనతి కాలంలోనే రాధాకిషన్‌ దమానీ కుబేరుడయ్యారు.



You may be interested

మీ కంపెనీ సెప్టెంబర్‌లో ఏజీఎం నిర్వహిస్తోందా..?

Thursday 20th February 2020

చివరి ఘడియల వరకు వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)ను కంపెనీలు వాయిదా వేయడం మంచి సంకేతం కాదంటున్నారు విశ్లేషకులు. నిబంధనల ప్రకారం గడువు ముగియడానికి చివరి సమయంలో ఏజీఎంను కంపెనీలు నిర్వహిస్తున్నాయంటే అనుమానించాల్సిన అవసరం ఉందంటోంది ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ (ఐఐఏఎస్‌). ఈ సంస్థ తన బ్లాగ్‌లో ఈ విషయమై పోస్ట్‌ను పెట్టింది. ‘‘బలహీనమైన పనితీరు కలిగిన కంపెనీలు చివరి నిమిషం వరకు ఏజీఎం నిర్వహణకు కాలయాపన చేస్తున్నాయి.

కరోనా ఎఫెక్ట్‌: ఏ కంపెనీలకు ప్లస్‌...వేటికి మైనస్‌

Wednesday 19th February 2020

కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి కారణంగా అతలాకుతలమైన చైనా ఫ్యాక్టరీ యాక్టివిటీ క్రమంగా కోలుకుంటుంది. ఇండియా కంపెనీలు ఈ అంటువ్యాధి గురించి ఆందోళన చెందనప్పటికీ.., ఆలస్యంగా త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన కొన్ని కంపెనీలు ఈ కరోనా పేరును ప్రస్తావించాయి.  చైనా నుండి దిగుమతి అవుతున్న విడిభాగాల కొరత కారణంగా టెలివిజన్లు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఈ నెలలో ధరలను పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు నివేదికలు వెలువడ్డాయి.

Most from this category