News


అమ్మకానికి అనిల్‌ అంబాని హెడ్‌ క్వార్టర్స్‌: భారీ నష్టాల్లో షేర్లు

Monday 1st July 2019
Markets_main1561965349.png-26713

పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన అనిల్‌ అంబాని హెడ్‌క్వార్టర్స్‌ను అమ్మకానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం అనిల్‌ అంబాని ముంబైలో వెస్ట్రన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలోని శాంటాక్రూజ్‌ గ్రూప్‌ హెడ్‌క్వార్టర్స్‌ ద్వారా తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. పెరిగిన రుణభారాల్ని తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా కంపెనీ 7లక్షల చదరపు అడుగులు విస్తీర్ణం కలిగిన ఈ భవన సముదాయాన్ని విక్రయం లేదా ధీర్ఘకాలికానికి లీజుకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు గ్లోబల్‌ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ బ్లాక్‌ స్టోన్‌తో పాటు అమెరికాకు చెందిన మరో సంస్థతో చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు సఫలమై హెడ్‌ క్వార్టర్స్‌ విక్రయం జరిగినట్లైతే కంపెనీకి రూ.3,000 కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉంది. ఈ విక్రయ ప్రక్రియను జేఎల్‌ఎల్‌ అడ్వెజరీ కన్సల్టెంసీ కంపెనీ మధ్యవర్తిత్వతం వహిస్తుంది. 
భారీ నష్టాల్లో షేర్లు
హెచ్‌క్వార్టర్స్‌ అమ్మకపు వార్తల నేపథ్యంలో అడాగ్‌ కంపెనీ షేర్లు తీవ్ర నష్టాల బాట పట్టాయి. రిలలయన్‌ ఇన్ఫ్రాస్ట్రక‌్షర్‌ 7.50శాతం క్షీణించింది. రియలన్స్‌ హోమ్స్ ఫైనాన్స్‌ 5శాతం, రిలయన్స్‌ క్యాపిటల్‌ 5.50శాతం, రిలయన్స్‌ నావెల్‌ అండ్‌ ఇంజనీరింగ్స్‌ రిలయన్స్‌ పవర్‌ షేర్లు 5శాతం వరకు నష్టపోయాయి. అలాగే రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ షేర్లు 1శాతం పతనమయ్యాయి.



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ...ఆల్‌టైమ్‌ హై

Monday 1st July 2019

ప్రైవేట్‌ రంగ దిగ్గజ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు సోమవారం ఎన్‌ఎస్‌ఈలో కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ కంపెనీ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఇంట్రాడేలో దాదాపు 2.20శాతం ర్యాలీ చేసి రూ.2240.00ల స్థాయిని అందుకున్నాయి. ఈ ధర(రూ.2240.00) షేరుకు జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. మధ్యాహ్నం గం.1:20నిల.కు షేరు గతముగింపు(రూ.2,192.10)తో పోలిస్తే 2.18శాతం లాభపడి రూ. 2,239.95ల వద్ద ట్రేడ్‌  అవుతోంది. ఇండెక్స్‌లో అధిక

బడ్జెట్‌ వరకు 11600-11900 పాయింట్ల రేంజ్‌లో నిఫ్టీ!

Monday 1st July 2019

బడ్జెట్‌ వరకు నిఫ్టీ 11600- 11900 పాయింట్ల రేంజ్‌లోనే కదలాడుతుందని ఇండియానివేశ్‌ సెక్యూరిటీస్‌ అనలిస్టు మెహుల్‌ కొఠారి అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నిఫ్టీ 11600 పాయింట్ల పైన ఉన్నంత వరకు ట్రెండ్‌బలంగానే ఉంటుందని చెప్పారు. గతవారం బుల్స్‌ చిన్నపాటి బ్రేకవుట్‌ సాధించారని చెప్పారు. ఈ స్థితిలో నిఫ్టీ 11911 పాయింట్ల వద్ద మధ్యంతర హైని సాధించిందన్నారు. డైలీ చార్టుల్లో నిఫ్టీ షూటింగ్‌ స్టార్‌క్యాండిల్‌ను ఏర్పరిచింది. అది కూడా 78.6 శాతం

Most from this category