News


అధ్వాన్న పరిస్థితులలో మార్కెట్‌ను విడిచిపెట్టకూడదు: ధీరేంద్ర కుమార్‌

Tuesday 23rd July 2019
Markets_main1563875920.png-27256

‘మిడ్‌ క్యాప్‌లన్నీ చిన్న కంపెనీలు కావు. నిలదొక్కుకునే సామర్ధ్యం ఉన్న కంపెనీలు చాలా ఉన్నాయి. అలాంటి మిడ్‌ క్యాప్‌ కంపెనీలను ఎంచుకోవడం మంచిది’ అని వాల్యు రీసెర్చ్‌ సీఈఓ ధీరేంద్ర కుమార్‌ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే....

దీర్ఘకాల దృక్పథం మంచిది...
మ్యూచువల్‌ ఫండ్‌ సహీ హై ప్రచారం 2017లో ప్రారంభమైనప్పుడు చాలా మంది మ్యూచువల్‌ ఫండ్‌లలో పెట్టుబడులు పెట్టడం, ఎస్‌ఐపీ(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌)లను ప్రారంభించారు. కానీ వాళ్లందరూ ఇప్పుడు నిరాశకు గురయ్యారు. వాల్యూ రీసెర్చ్‌కు వచ్చే మెయిల్‌ సంఖ్యను చూస్తే ఇది అర్థమవుతుంది. ఈక్విటీ మార్కెట్లు చాలా కాలం పాటు నిరాశపరిచాయి. అయినప్పటికీ, సబబైన ఫండ్‌ను ఇన్వెస్ట్‌ మెంట్‌కోసం ఎంచుకుంటే ముందుకు వెళ్లడమే మంచిది. స్వల్పకాలిక పెట్టుబడులు చేసే వాళ్లు బహుశ నిరాశ చెందుతారు. వారు తమ లక్ష్యలను చేరుకోవడం కష్టమే. కానీ  మూడేళ్లు, ఐదేళ్లు, పదేళ్ల కోసం ఇన్వెస్టమెంట్లు చేసే వారు భయపడవలసిన అవసరం లేదు. గత రెండేళ్లుగా మేము చెప్పిన ప్రతి ఫండ్  ప్రస్తుతం మార్కెట్‌లో మంచి విలువను కలిగి ఉన్నాయి. 
మిడ్‌ క్యాప్‌లన్నీ చిన్నవి కావు...
   అధ్వాన్న పరిస్థితుల్లో మార్కెట్లలో ఇన్వెస్ట్‌మెంట్‌లు ఆపేయడం, మార్కెట్ల నుంచి బయటకు వచ్చేయడమే ఇన్వెస్టర్లు చేసే అతి పెద్ద తప్పు.  టాప్‌ 100 లో లేని కంపెనీలు అంటే 100 తర్వాత కంపెనీలు(101 నుంచి 200 వరకు) మిడ్‌క్యాప్‌ కంపెనీలుగా రెగ్యులేటర్‌ పరిగణిస్తోంది.  అన్ని మిడ్‌ క్యాప్‌ కంపెనీలు చిన్న కంపెనీలు కావు. అవి నిలదొక్కుకోలేని కంపెనీలు కావు. చాలా మిడ్‌ క్యాప్‌ కంపెనీలు వాటి ఉప రంగాలలో ముందుండి నడిపిస్తున్నాయి. సరైన కంపెనీని ఎంచుకోని ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. 
అప్పుడు చేసిన తప్పులు చేయకపోవచ్చు...    
   కొన్ని మిడ్‌క్యాప్‌లు బలమైన వ్యాపారాలుగా మారి లార్జ్‌ క్యాప్‌లుగా రూపుదిద్దుకోవచ్చు. ఇలాంటి వాటికి ఉదాహరణగా ఓ  ఐదారు కంపెనీలున్నాయి. 10 సంవత్సరాల కాలపరిమితిలో బజాజ్ ఫిన్సర్వ్‌,  అరబిందో ఫార్మాను పరిశీలించవచ్చు. వీటితో పాటు స్మాల్‌ క్యాప్‌ నుంచి మిడ్‌ క్యాప్‌కు మారిన స్టాకులను పరిశీలించవచ్చు.  2017లో మిడ్‌క్యాప్‌ స్టాకుల పీఈ 70, 80గా ఉన్నప్పుడు అందరూ అద్భుతం జరుగుతుందని ఆశించి నిరాశకు గురయ్యారు. ఇప్పుడు మిడ్‌క్యాప్‌లలో ఇన్వెస్ట్‌ చేసే వాళ్లు అప్పడు చేసిన తప్పులను మరల చేయకపోవచ్చు.  You may be interested

పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు క్రాష్‌

Tuesday 23rd July 2019

ఒడిదుడుకుల మార్కెట్‌ ట్రేడింగ్‌లో భాగంగా మిడ్‌సెషన్‌ సమయానికి ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 3,013.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో అధిక వెయిటేజీ కలిగిన ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్ల పతనంతో ఇండెక్స్‌ ఒకదశంలో 3.30శాతం క్షీణించి 2,902.65 స్థాయికి పతనమైంది. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(3,001.55)తో పోలిస్తే 3.15శాతం క్షీణించి 2,905.70

కోటక్‌ బ్యాంక్‌కు బ్రోకరేజ్‌ సంస్థల బూస్ట్‌

Tuesday 23rd July 2019

4.50శాతం ర్యాలీ చేసిన షేరు  ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ..,  పలు బ్రోకరేజ్‌ సంస్థలు కోటక్‌ బ్యాంక్‌ షేర్లపై రేటింగ్‌ను పెంచాయి.  బ్రోకరేజ్‌ సంస్థల్లో ప్రధానమైన సీఎల్‌ఎస్‌ఏ, జెఫ్పారీస్‌ సంస్థలు ఏడాది కాలానికి ఈ షేర్లపై ‘‘బై’’ రేటింగ్‌ కేటాయింపుతో పాటు షేర్ల టార్గెట్‌ ధరను పెంచాయి. ఫలితంగా ఈ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో షేరు ఇంట్రాడే షేరు 4శాతం ర్యాలీ చేసి రూ.1510.55ల

Most from this category