News


క్వెస్‌ కార్ప్‌ 18శాతం ర్యాలీ

Friday 12th July 2019
Markets_main1562920603.png-27019

అమెజాన్‌ కంపెనీకి 7.5లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలపడంతో క్వెస్‌ కార్ప్‌ షేర్లు శుక్రవారం 18శాతం లాభపడ్డాయి. నేడు బీఎస్‌లో క్వెస్‌ కార్ప్‌ షేర్లు రూ.445.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రిఫరెన్షియల్‌ బేసిస్‌ పద్ధతిలో అమెజాన్‌ కంపెనీకి ప్రతి ఈక్విటీ షేరు రూ.676 చొప్పున మొత్తం 754,437 షేర్లును రూ.51 కోట్లకు విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపినట్లు క్వెస్‌ కార్ప్‌ నేడు ఎక్చ్సేంజీలకు సమాచారం తెలిపింది. ఇష్యూలో షేర్లకు కేటాయించిన షేర్ల ధర(రూ.676) ప్రస్తుత ట్రేడ్‌ అవుతున్న షేర్ల ధరకు 50శాతం అధికంగా ఉండటం విశేషం. ఫలితంగా నేడు ఈ కంపెనీ షేర్లకు డిమాండ్‌ పెరిగడంతో షేరు ఏకంగా 18.50శాతం ర్యాలీ చేసి రూ.521.00ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు షేరు గతముగింపు(రూ.440.15)తో పోలిస్తే 10శాతం లాభంతో రూ.482.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.442.80, రూ.521.00లుగా నమోదయ్యాయి. 



You may be interested

వాల్యూ ఇన్వెస్టర్లు ఏం కొన్నారు? ఏం అమ్మారు?

Friday 12th July 2019

జూన్‌ త్రైమాసికంలో వాల్యూ ఇన్వెస్టర్లు తమ పోర్టుఫోలియోల్లో కొన్ని మార్పులు చేశారు. మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌ కారణంగా జూన్‌ త్రైమాసికంలో చాలామంది వాల్యూ ఇన్వెస్టర్ల పోర్టుఫోలియోలు నష్టాల్లోకి మారాయి. మార్కెట్లు ఆశించినట్లు ప్రీ బడ్జెట్‌ లేదా పోస్ట్‌ బడ్జెట్‌ ర్యాలీ రాలేదు. దీంతో ఇందుకనుగుణంగా వాల్యూ ఇన్వెస్టర్లు తమ పోర్టుఫోలియోలను సర్దుబాటు చేశారు. - డాలీఖన్నా: రెయిన్‌ఇండస్ట్రీస్‌లో వాటాను 2.22 శాతం నుంచి 3.82 శాతానికి పెంచుకుంది. రాడికో ఖైతాన్‌లో వాటాను 1.41

టీసీఎస్‌ కన్నా మంచి ఫలితాలను ఇన్ఫీ సాధిస్తుందా?

Friday 12th July 2019

మార్కెట్‌ అంచనాలను మిస్‌ చేస్తూ టీసీఎస్‌ ప్రథమ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. రెవెన్యూ, మార్జిన్ల పరంగా టీసీఎస్‌ అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు అందరి దృష్టి శుక్రవారం ఫలితాలు ప్రకటించనున్న ఇన్ఫోసిస్‌పై నెలకొంది. టీసీఎస్‌ ఫలితాలను ఇన్ఫీ దాటగలదా? లేదా? అని అంతా ఆసక్తిగా ఉన్నారు. అయితే టీసీఎస్‌ తరహాలో ఇన్ఫీ సైతం ఎబిటా విషయంలో దెబ్బతినవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వేతన వ్యయాలు పెరగడం, రూపీ బలపడడం, కొత్త పెట్టుబడులు.. ఎబిటాపై

Most from this category