News


రానున్న 6 నెలల్లో నాణ్యమైన షేర్లదే హవా

Wednesday 1st January 2020
Markets_main1577859526.png-30583

ఆటో రంగ కౌంటర్లు వెలుగులో నిలిచే చాన్స్‌
క్యాపిటల్‌ గూడ్స్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాలపై దృష్టి
మోతీలాల్‌ ఓస్వాల్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్ధ్‌ ఖేమ్కా

రానున్న ఆరు నెలల కాలంలో అత్యంత నాణ్యమైన, అధిక విలువ కలిగిన కౌంటర్లకే డిమాండ్‌ కొనసాగనున్నట్లు మోతీలాల్‌ ఓస్వాల్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్ధ్‌ ఖేమ్కా తాజాగా అంచనా వేశారు. ఆటో విభాగంలో మారుతీ వంటి పెద్ద కంపెనీలు స్వల్ప వృద్ధిని సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖేమ్కా ఇంకా పలు అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..

ఆటో వెలుగులో..
కొత్త ఏడాదిలో దేశీయంగా పెద్ద ఆటో కంపెనీలు ఓమాదిరి వృద్ధిని చూపవచ్చు. ఉదాహరణకు వార్షిక ప్రాతిపదికన మారుతీ అమ్మకాలు 6 శాతం పుంజుకునే వీలుంది. చాలామంది వినియోగదారులు కొత్త ఏడాది కోసమని డిసెంబర్‌ నెలలో వాహన కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. దీంతో జనవరిలో కార్లు, ద్విచక్ర వాహన అమ్మకాలు పుంజుకోవచ్చు. దీంతో ఇకపై ఆటో రంగంలో ఆశావహ పరిస్థితులు కనిపించవచ్చు. మరోపక్క ఆటో స్ర్కాపేజీ పాలసీపై అంచనాలతో ఇటీవల కొద్ది రోజులుగా ఆటో, ఆటో విడిభాగాల కౌంటర్లకు డిమాండ్‌ కనిపించింది. ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్న సార్వత్రిక బడ్జెట్‌పైనా అంచనాలు పెరిగాయి.

ఇన్‌ఫ్రాకు మంచి రోజులు?
గతేడాది(2019)లో క్యాపిటల్‌ గూడ్స్‌, మౌలిక సదుపాయాల(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) రంగాలు నిరాశను మిగిల్చాయి. ఈ రంగాలలో చాలా నాణ్యమైన కంపెనీలున్నప్పటికీ తక్కువ పెట్టుబడి వ్యయాలు, ఆర్డర్లు మందగించడం వంటి అంశాలు ప్రభావం చూపాయి. బడ్జెట్‌లో ఐదేళ్ల కాలానికిగాను  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగానికి ప్రభుత్వం రూ. 100 లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించింది. అయితే ప్రభుత్వానికి ఆర్థికంగా సవాళ్లు ఎదురుకావడంతో ఈ ప్రణాళికలు ఆశించిన స్థాయిలో అమలుకాలేదు. ఇటీవల ప్రభుత్వం మరోసారి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగంలో పెట్టుబడులకు బూస్ట్‌నిచ్చే ప్రణాళికలు వెల్లడించింది. కాగా.. దీర్ఘకాలిక సగటులతో పోలిస్తే ఈ విభాగంలో పలు నాణ్యమైన కంపెనీలు డిస్కౌంట్‌లో ట్రేడవుతున్నాయి. దీంతో రికవరీ వచ్చి ప్రయివేట్‌ పెట్టుబడులు పుంజుకుంటే ఈ రంగంలో పలు కౌంటర్లు జోరందుకునే వీలుంటుంది.

టెలికం సంగతేంటి?
ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుల కోసం గతేడాది దిగ్గజ టెలికం కంపెనీలు నిధుల సమీకరణ చేపట్టాయి. అయితే రివ్యూ పిటిషన్‌ నేపథ్యంలో ఈ అంశాలు ఎలాంటి టర్న్‌తీసుకునేదీ స్పష్టతలేదు. ఇప్పటికే కొంతమేర కంపెనీలు కేటాయింపులు చేపట్టాయి. దీంతో రెండో త్రైమాసిక ఫలితాలలో భారీ నష్టాలను చవిచూశాయి కూడా. ఇటీవల రిలయన్స్‌ జియోసహా టెలికం కంపెనీలు ధరలు పెంచాయి. వెరసి పటిష్టంగా ఉన్న కంపెనీలు ఇకపై మెరుగైన పనితీరును చూపవచ్చు. ఈ విభాగంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(జియో), భారతీ ఎయిర్‌టెల్‌ను పరిగణించవచ్చు.

ఇటీవల ర్యాలీ చేసిన స్టాక్స్‌
గత కొన్ని నెలలుగా కొన్ని కంపెనీలు భారీ ర్యాలీ చేశాయి. నాణ్యమైన ఈ కంపెనీలు ఇకపై కూడా లాభాల బాటలో సాగే అవకాశముంది. ఇప్పటికే వీటిలో ఇన్వెస్ట్‌చేసినవారు కొనసాగవచ్చు. షేర్ల విలువలు అధికంగా ఉన్నప్పటికీ ఈ కౌంటర్లు రానున్న ఆరు నెలల కాలం‍లోనూ మంచి రిటర్నులు సాధించే వీలుంది. ఈ బస్‌ మిస్‌ అయిన ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయ కౌంటర్లవైపు దృష్టిపెట్టడం మేలు. అయితే ఆర్థిక పురోగతి, కంపెనీల ఆర్జన తదితరాలలో రివకరీ రావలసి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ క్వాలిటీ స్టాక్స్‌లో ర్యాలీ కొనసాగే అవకాశముంది.

బ్యాంకింగ్‌ దీర్ఘకాలానికి
ఈ ఏడాది సైతం బ్యాంకులు, ఫైనాన్షియల్‌ కంపెనీల మధ్య వ్యత్యాసం కొనసాగనుం‍ది. ఆస్తుల(రుణాలు) నాణ్యతా సమస్యల నుంచి బయటపడుతున్న కార్పొరేట్‌ బ్యాంకులు నెమ్మదిగా మెరుగైన ఫలితాలు సాధించనున్నాయి. రానున్న రెండు, మూడేళ్లలో కార్యకలాపాలు పుంజుకోవడం ద్వారా వెలుగులో నిలిచే వీలుంది. ఇందుకు నిధుల సమీకరణ వ్యయాలు తగ్గడం వంటి అంశాలు దోహదపడవచ్చు. 2019లో కొన్ని కౌంటర్లు ర్యాలీ చేసినప్పటికీ ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంకులతోపాటు.. స్టేట్‌బ్యాంక్‌ను పరిశీలించవచ్చు. రిటైల్‌ బ్యాంకులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా సైతం నిలకడైన వృద్ధిని కనబరుస్తున్నాయి.You may be interested

మార్చి నాటికి నిఫ్టీ@ 12,800!

Wednesday 1st January 2020

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా కొత్త ఏడాది తొలి త్రైమాసికం చివరకు నిఫ్టీ 12800 పాయింట్లను చేరుతుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. బీఎఫ్‌ఎస్‌ఐ, మెటల్స్‌, ఆయిల్‌, ఆటో, నెట్‌ ఆధారిత రంగాలకు చెందిన షేర్లు కొత్త ఏడాది మంచి ప్రదర్శన చూపవచ్చని అభిప్రాయపడింది. లార్జ్‌క్యాప్స్‌, మిడ్‌ మరియు స్మాల్‌క్యాప్స్‌ మధ్య ప్రదర్శనలో అంతరం కొనసాగుతుందని తెలిపింది. అయితే గతంతో పోలిస్తే ఈ అంతరం కొంత తగ్గవచ్చని పేర్కొంది. దేశీయ మార్కెట్లు రిటైల్‌,

2020లో మార్కెట్‌ను ప్రభావితం చేసే రాజకీయ అంశాలివే!

Wednesday 1st January 2020

గతేడాది ఎన్‌డీఏ ప్రభుత్వం భారీ మెజార్టీతో మరోమారు ఎన్నికవడం అతిపెద్ద రాజకీయ విశేషం. 2020లో ఈ విధంగా మార్కెట్‌పై ప్రభావం చూపే వివిధ రాజకీయ అంశాలు ఇలా ఉన్నాయి... - ఢిల్లీ ఎన్నికలు: ఇప్పటికింకా ఎన్నికల కమీషన్‌ ఢిల్లీ ఎన్నికల తేదీలను ప్రకటించలేదు కానీ రాజకీయ పార్టీలు మాత్రం బిజీబిజీగా ప్రచారంలో మునిగిపోయాయి. ఈ దఫా పోటీ ప్రధానంగా ఆప్‌, బీజేపీ మధ్యనే ఉండొచ్చు. కాంగ్రెస్‌ కొన్ని చోట్ల ప్రభావం చూపవచ్చు.

Most from this category