News


మంచి షేర్లు ఖరీదే..కానీ పెట్టుబడులు వాటిలోకే!

Tuesday 18th February 2020
Markets_main1582018882.png-31900

ఆర్థిక వ్యవస్థతో మార్కెట్లు డిస్కనెక్ట్‌
లార్జ్‌క్యాప్స్‌లోనే అధిక పెట్టుబడులు
- మనీషి రాయ్‌చౌధురి, బీఎన్‌పీ పరిబాస్‌

దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ స్టాక్‌ మార్కెట్లు ఎందుకు పురోగమిస్తున్నాయన్న ప్రశ్నకు.. డిస్కనెక్ట్‌ కావడమే కారణమంటున్నారు మనీషి రాయ్‌చౌధురి. బీఎన్‌పీ పరిబాస్‌లో ఏషియా పసిఫిక్‌ ఈక్విటీ రీసెర్చ్‌ హెడ్‌ అయిన రాయ్‌ లార్జ్‌ క్యాప్స్‌లోకే ఇకపైన కూడా పెట్టుబడులు ప్రవహించనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఒక ఇంటర్వ్యూలో రాయ్‌ వెలిబుచ్చిన పలు అభిప్రాయాలను చూద్దాం..

దేశ ఆర్థిక వ్యవస్థ, స్టాక్‌ మార్కెట్లు రెండు ప్రత్యేక వ్యవస్థలుగా పేర్కొనవచ్చు. దేశీ మార్కెట్ల నిర్మాణాన్ని పరికిస్తే.. ప్రధాన ఇండెక్సులు సెన్సెక్స్‌, నిఫ్టీలకు లార్జ్‌ క్యాప్స్‌ బలాన్నిస్తున్నాయి. ఈ కంపెనీలు మార్కెట్‌ వాటాను కొల్లగొట్టేవేకాకుండా అమ్మకాల విస్తృతి ద్వారా లబ్ది పొందుతాయి. ఉదాహరణకు ప్రయివేట్‌ బ్యాంకింగ్‌ లేదా బీమా రంగ లార్జ్‌ క్యాప్స్‌నే తీసుకుంటే.. ప్రత్యర్థి చిన్న సంస్థలతో పోలిస్తే మార్కెట్‌ వాటాను పెంచుకుంటూ వస్తున్నాయి. ఇది కొంతమేర ఆర్థిక వ్యవస్థతో మార్కెట్లు విడివడిన విషయాన్ని(డిస్‌కనెక్ట్‌) చెబుతున్నాయి. గత కొద్ది నెలలు లేదా రెండేళ్లుగా విదేశీ ఇన్వెస్టర్లు లార్జ్‌ క్యాప్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఆర్గనైజ్‌డ్‌ రంగంలోని కంపెనీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. సమీప కాలంలో ఈ ట్రెండ్‌ కొనసాగుతుందని భావిస్తున్నాం. ఫ్రీ క్యాష్‌ఫ్లో సాధించే కంపెనీలు, విభిన్న తరహా బిజినెస్‌లతో అమ్మకాలు పెంచుకునే సంస్థలవైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో  రిటర్నులతోపాటు పెట్టుబడులకు అధిక రక్షణను సైతం కోరుకుంటున్నారు. 

ఆటోపై చెప్పలేం
ఆటో రంగంలో మారుతీ, ఎంఅండ్‌ఎం వంటి కంపెనీలు కనిష్టాల నుంచి వేగంగా కోలుకుంటున్నాయి. అయితే రికవరీ నెలకొన్నట్లు చెప్పడం తొందరపాటే అవుతుంది. నిల్వలు తగ్గించుకోవడం, ముందస్తు కొనుగోళ్లు(డిస్కౌంట్లు) వంటి అంశాలు అమ్మకాలకు కారణంకావచ్చు. దీంతో కొత్త పర్యావరణ నిబంధనలు అమలులోకి వచ్చాక వాహన విక్రయాలను పరిశీలించవలసి ఉంది. కాగా.. డీమార్ట్‌ విషయానికివస్తే.. నగదు జనరేట్‌ చేస్తూ.. దీర్ఘకాలంలో అధిక రిటర్న్‌ రేషియోలను సాధించే కంపెనీలకు గరిష్ట విలువ చేకూరుతుంటుంది. తెలివైన ఇన్వెస్టర్లు కేవలం​వేల్యుయేషన్స్‌కే ప్రాధాన్యత ఇవ్వరు. నాణ్యమైన బిజినెస్‌లు కలిగిన కంపెనీలు సాధారణంగా ఖరీదుగా ట్రేడవుతుంటాయి. కార్పొరేట్‌ గవర్నెన్స్‌, పటిష్ట క్యాష్‌ ఫ్లో తదితర ఫండమెంటల్స్‌ ఉన్న కంపెనీలు ఖరీదుగా ఉన్నప్పటికీ పెట్టుబడికి పరిశీలించవచ్చు. 

కరోనా ఎఫెక్ట్‌
ప్రస్తుతం మెటల్స్‌, మైనింగ్‌ రంగాలను ఎంపిక చేసుకోకపోవడమే మేలని భావిస్తున్నాం. కరోనా వైరస్‌ కారణంగా చైనా సమస్యలు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయంగా కమోడిటీల వినియోగంలో చైనా సగానికి పైగా వాటాను ఆక్రమిస్తుండటమే దీనికి కారణం. ఇక మిడ్‌ క్యాప్స్‌ విషయానికివస్తే.. లార్జ్‌ క్యాప్స్‌ విషయంలో చెప్పుకున్న ప్రామాణికాలనే పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. నిలకడైన వృద్ధి అవకాశాలు, మార్కెట్‌ వాటాను పెంచుకోవడం, సెక్యులర్‌గా రిటర్నులు సాధించడం వంటి అంశాలను షేర్ల ఎంపికలో పరిగణించడం మేలు. మిడ్‌ క్యాప్స్‌ ఎంపికలో పలు అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.You may be interested

దేశంలోనే సంపన్న సీఈఓ..నవిల్‌ నోర్నా!

Tuesday 18th February 2020

 భారతదేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి స్థానలో ముఖేష్‌ అంబానీ ఉండగా రెండోస్థానంలో ఎవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ అధినేత రాధాకిషన్‌ దమానీ ఉన్నారు. వీరంతా ఆయా కంపెనీల ప్రమోటర్లుగా వ్యవహరిస్తూ సంపన్నుల జాబితాలో నిలవగా.. వృత్తిపరమైన నైపుణ్యాలతో సీఈఓలుగా ఎదిగి ఆయా కపెనీలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వారిలో దేశంలోనే అత్యంత సంపన్న సీఈఓగా నిలిచారు నవిల్‌ నోర్నా. వీల్‌ ఎవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ

ఎర్నింగ్‌ డౌన్‌గ్రేడ్‌ అవకాశాలు ఎక్కువ!

Tuesday 18th February 2020

2020-21పై మోతీలాల్‌ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ నిఫ్టీ కంపెనీలకు సంబంధించి హైఫ్రీక్వెన్సీ డేటా ఇండికేటర్లు భారీ రికవరీ సూచించడం లేదని, అందువల్ల కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎర్నింగ్స్‌ డౌన్‌గ్రేడ్‌ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ రిసెర్చ్‌ హెడ్‌ గౌతమ్‌ దుగ్గడ్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత క్యు3లో ఫలితాలు ఫర్వాలేదనిపించాయన్నారు. ఎర్నింగ్స్‌ నాణ్యతలో భారీ మెరుగుదల లేదని, స్వల్ప మెరుగుదల మాత్రమే ఉందని చెప్పారు. ఎర్నింగ్స్‌గ్రోత్‌ పుంజుకోవడానికి ముఖ్యంగా బీఎఫ్‌ఎస్‌ఐ, కన్జూమర్‌ విభాగాలు ముఖ్యపాత్ర పోషించగా,

Most from this category