STOCKS

News


క్వాలిటీ మిడ్‌క్యాప్స్‌ ర్యాలీ త్వరలో: కోటక్‌

Wednesday 4th December 2019
Markets_main1575398360.png-30032

రానున్న త్రైమాసికాల్లో కంపెనీల ఫలితాలు అంచనాలకు అనుగుణంగా ఉండడంతోపాటు ఆదాయాలు కూడా మెరుగుడాల్సిన అవసరం ఉందన్నారు కోటక్‌ సెక్యూరిటీస్‌కు చెందిన పీసీజీ బిజినెస్‌ హెడ్‌ ఆశిష్‌నందా. స్థిరమైన రికవరీ అంచనాలతో 2020లో మార్కెట్‌ గమనం ఆశాజనకంగా ఉందన్నారు. వాస్తవానికి దేశ ఆర్థిక వ్యవస్థ 2011 నుంచి మందగమనం ఎదుర్కుంటోందని, ప్రభుత్వం, ఆర్‌బీఐ ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. బ్యాంకుల ప్రక్షాళన, బ్యాంకింగ్‌ రంగంలో తగినంత లిక్విడిటీ ఉండడం, మరిన్ని రేట్ల కోతలు, రుణ గ్రహీతలకు ఈ ప్రయోజనం బదలాయింపు సానుకూలతలుగా పేర్కొన్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వచ్చే నిధులతో ద్రవ్యలోటు తగ్గుతుందని చెప్పారు. ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌, హౌసింగ్‌ రంగంపై దృష్టి సారించడం మొత్తం ఆర్థిక వ్యవస్థకు సానుకూలమని అభిప్రాయపడ్డారు. కార్పొరేటు పన్ను తగ్గింపు పోటీని పెంచడంతోపాటు, మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుందన్నారు. రానున్న బడ్జెట్‌లో ఆదాయపన్ను తగ్గింపు చేపడితే వినియోగాన్ని పునరుద్ధరిస్తుందన్నారు. ఎన్నో సానుకూల నిర్ణయాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, కానీ ఇన్వెస్టర్లలో నిరాశావాదం ప్రస్తుతం చాలా గరిష్ట స్థాయిలో ఉందన్నారు.

 

సానుకూలతలు
‘‘దేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చే వాటిని ప్రధానంగా చెప్పదలుచుకున్నాను. మొదటిది రానున్న ఐదేళ్ల కాలానికి రాజకీయ స్థిరత్వం. రెండోది కార్పొరేట్‌ పన్ను తగ్గింపు. మూడోది నిలకడగా వడ్డీ రేట్ల తగ్గింపు, వాటిని బదలాయించాలని ఆదేశించడం. నాలుగోది ప్రభుత్వరంగ బ్యాంకులకు నిధుల సాయం అందించడం. ఐదవది ఆటోమొబైల్‌ అమ్మకాల గణాంకాలు కనిష్ట స్థాయి నుంచి రికవరీ అవుతున్న సంకేతాలు ఇవ్వడం’’ అని ఆశిష్‌ నందా వివరించారు. 

 

పెట్టుబడి అవకాశాలు..
మూలధన వ్యయాల వైపు భారీ ప్రకటనలు అవసరమని, మౌలిక రంగ ప్రోత్సాహకాలు ఇవ్వడం ప్రభుత్వం ముందున్న ఉత్తమమైన మార్గమన్నారు ఆశిష్‌ నందా. ఈ విధంగా చూసుకుంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీల్లో అవకాశాలను పరిశీలించొచ్చని సూచించారు. ‘‘స్మాల్‌, మిడ్‌క్యాప్‌ విభాగంలో పలు నూతన ఫండ్‌ ఆఫర్లను చూశాం. ఆకర్షణీయమైన విలువలకు ఇది సంకేతం. నాణ్యమైన మిడ్‌క్యాప్‌ కంపెనీలు, తక్కువ రుణ భారం కలిగినవి రానున్న రోజుల్లో మంచి పనితీరు చూపించనున్నాయి. నిఫ్టీ దిగువ వైపున 11,500, ఎగువ వైపున 12,600 మధ్యలో చలిస్తుందని అంచనా వేస్తున్నాం’’అని ఆశిష్‌ నందా తెలిపారు. You may be interested

నిర్మల్‌బంగ్‌ టాప్‌ రికమండేషన్లు

Wednesday 4th December 2019

ఐసీఐసీఐ బ్యాంకు, ముత్తూట్‌, మణప్పురం ఫైనాన్స్‌, ఐనాక్స్‌ లీజర్‌ రానున్న 12 నెలల కాలంలో మంచి పనితీరు చూపిస్తాయన్న అంచనాలతో ఉన్నట్టు నిర్మల్‌బంగ్‌ రీసెర్చ్‌ హెడ్‌ గిరీష్‌పాయ్‌ తెలిపారు. మార్కెట్లపై ఓ ప్రముఖ వార్తా సంస్థతో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.    టెలికం స్టాక్స్‌.. రానున్న కాలంలో ముగ్గురు ప్లేయర్ల మార్కెట్‌ లేదా ఇద్దరు ప్లేయర్ల మార్కెట్‌ అవుతుందా అన్నది చూడాలి. ఒకవేళ ముగ్గురితో (ఎయిర్‌టెల్‌, జియో, వొడాఐడియా) కూడిన మార్కెట్‌ ఉండేట్టు

12000 దిగువన ముగిసిన నిఫ్టీ

Tuesday 3rd December 2019

127పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌ ఆర్‌బీఐ పాలసీ సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత మరోసారి తెరపైకి అంతర్జాతీయ వాణిజ్య భయాలు జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాలతో మార్కెట్‌ మంగళవారం నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్‌ 127 పాయింట్లను కోల్పోయి 40,675.45 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 54 పాయింట్లు నష్టపోయి 12వేల దిగువున 11,994 వద్ద స్థిరపడింది. నిఫ్టీకి మూడో రోజూ నష్టాల ముగింపు. బ్రెజిల్‌, అర్జెంటీనా దేశాల నుంచి అమెరికాలోకి దిగుమతయ్యే స్టీల్‌, అల్యూమినియంలపై టారీఫ్‌లను

Most from this category