News


పన్ను తగ్గింపుతో ప్రైవేటు బ్యాంకులకు అధిక లాభం

Thursday 17th October 2019
Markets_main1571297429.png-28951

-పంకజ్‌ పాండే, ఐసీఐసీఐ డైరక్ట్‌
ప్రస్తుతం మెటల్‌ స్టాకులకు దూరంగా ఉండాలని ఐసీఐసీఐ డెరక్ట్‌, రీసెర్చ్‌ హెడ్‌, పంకజ్‌ పాండే ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. బ్యాంకింగ్‌ సెక్టార్‌కు సంబంధించి ఎన్‌ఐఐ వృద్ధి దృక్పథం ఆధారంగా ప్రైవేట్‌ బ్యాంకులు లేదా మిడ్‌ క్యాప్‌ బ్యాంకు ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు. ఆటో స్టాక్స్‌ను కొనుగోలు చేయడానికి ఇంకొంత కాలం వేచి ఉండడ మంచిదని తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే....
నాణ్యమైన స్టాకులను విడిచిపెట్టకండి..
వివిధ రంగాలకు చెందిన కొన్ని నిర్థిష్టమైన స్టాకులు, వాటి ధర, లాభాల పరంగా మంచి ప్రధర్శన చేస్తుండడం చూస్తున్నాం. లార్జ్ క్యాప్‌, మిడ్‌క్యాప్‌ లేదా స్మాల్‌ క్యాప్‌ ఏవైనా ఇలాంటి నిర్థిష్ఠమైన స్టాకులను ఇన్వెస్టర్లు ఎంచుకోవడం ఉత్తమం. ఏ కంపెనీ వృద్ధి ఆశాజనకంగా ఉంటుందో అలాంటి స్టాకులను ఎన్నుకోమని మా వినియోగదారులకు మేము సలహాయిస్తున్నాం. సాధరణ, నాణ్యమైన వ్యాపారాలను  పరిశీలిస్తే, నాణ్యమైన కంపెనీల స్టాకులు ప్రీమియంగా మారుతుండడం గమనించవచ్చు. ముందుకెళ్లే కొద్ది కూడా ఈ ట్రెండ్‌లో ఎటువంటి మార్పు ఉండదని నా నమ్మకం.
ప్రస్తుతం మెటల్స్‌కు దూరం..
మెటల్స్‌, ఆటో కంపెనీలు ఈ సెప్టెంబర్‌ త్రైమాసికంలో అధ్వాన్న ప్రధర్శనను చేశాయనే చెప్పాలి. మొత్తం మెటల్‌ స్టాకులను తీసుకుంటే, ఈ త్రైమాసికంలో వీటి ఆదాయం 17 శాతం తగ్గుతుందని, అదేవిధంగా ఈ కంపెనీల లాభాలు 50 శాతం మేర పడిపోతాయని అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా ఐరన్‌ లేదా స్టీల్‌ స్టాకుల ఫలితాలు అధ్వాన్నంగా ఉండే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా వాణిజ్య అనిశ్చితి కొనసాగుతుండడంతో మెటల్‌ సెక్టార్‌ పుంజుకుంటుందని అనుకోవడం లేదు. కానీ స్టీ‍ల్‌ ఉత్పత్తులపై ప్రభుత్వం తీసుకురానున్న యాంటి డంపింగ్‌ డ్యూటీ(మెటల్‌ దిగమతులపై సుంకం) వలన మెటల్‌ ఇండస్ట్రీ కొంత లాభపడే అవకాశం ఉంది. దీనితో పాటు ప్రభుత్వం కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో ఈ పరిశ్రమలో నిధుల లభ్యత పెరగనుంది. ఫలితంగా ఈ కంపెనీల డెట్‌-ఈక్విటీ నిష్పత్తి పెరుగుపడుతుంది. మెటల్‌ షేర్లలో భారీగా పడిపోయిన షేర్లు బౌన్స్‌ అయ్యే అవకాశం ఉన్నప్పటికి అంతర్జాతీయంగా మెటల్‌ ధరలలో స్థిరత్వం వచ్చేంతవరకు వీటిని ఇన్వెస్టర్లు ఎంచుకోకపోవడం మంచిది.
టెక్‌లో విప్రో, ఇన్ఫోసిస్‌..
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీని పరిశీలిస్తే, ఈ కంపెనీ యాక్విజేషన్‌(ఇతర కంపెనీలు లేదా ఆస్తులను కలుపుకోవడం)ను మినహాయిస్తే, కంపెనీ ఆర్గానిక్‌ వృద్ధి మందకోడిగా ఉంది. ఐటీ సెక్టార్‌లో టీసీఎస్‌ 21-22 రెట్లు మల్టిపుల్‌ వద్ద, ఇన్ఫోసిస్‌ 16 రెట్లు మల్టిపుల్‌ వద్ద ట్రేడవుతున్నాయి. మేము విప్రోపై ‘కొనచ్చు’ దృక్పథంతో ఉన్నాం. అంతేకాకుండా ఈ స్టాకుపై టార్గెట్‌ ధరను రూ. 300 గా నిర్ణయించాం. ప్రస్తుతం ఈ స్టాక్‌ 12 రెట్లు వద్ద ట్రేడవుతోంది. ఇంచుమించు ఇదే మల్టిపుల్‌ వద్ద హెచ్‌సీఎల్‌ టెక్‌ ట్రేడవుతున్నప్పటికి, ఈ కంపెనీ ఆర్గానిక్‌ వృద్ధి పుంజుకుంటే తప్ప ఈ స్టాకును కోనుగోలు చేయాలని అనుకోవడం లేదు. టాప్‌ ఐటీ కంపెనీలలో విప్రో ఆకర్షిస్తోంది. దీని తర్వాత ఇన్పోసిస్‌ ప్రస్తుతం మంచి స్థానంలో ఉంది.  మొత్తంగా ఐటీ ప్రధాన కంపెనీలన్ని మంచి ధర వద్దే ట్రేడవుతుండడంతో, ఈ స్టాకులలో భారీ ర్యాలీ ఉంటుందని అనుకోవడం లేదు.
ప్రైవేట్‌ బ్యాంకులు బెటర్‌!
బ్యాంకింగ్‌ సెక్టార్‌లో ప్రైవేట్‌ బ్యాంక్‌ల ఎన్‌ఐఐ వృద్ధి(నికర వడ్డీ ఆదాయం) 18 శాతంగా, లాభాల వృద్ధి 44 శాతంగా ఉంటుందని అంచనావేస్తున్నాం. ట్యాక్స్‌ తగ్గింపు చర్య వలన వీటి లాభాలు భారీగా పేరిగే అవకాశం ఉంది. ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే ప్రైవేట్‌ బ్యాంక్‌ల ముందస్తు వృద్ధి(అడ్వాన్స్‌డ్‌ గ్రోత్‌) బాగుంటుందని అంచనా వేస్తున్నాం. ఎస్‌బీఐ 9-10 శాతం ముందస్తు వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది. మిగిలిన పీఎస్‌యూ బ్యాంకులలో బీఓబీ(బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా) 2 శాతం ముందస్తు వృద్ధిని ప్రకటిస్తుందని అంచనా వేస్తున్నాం. బ్యాంకింగ్‌ సెక్టార్‌కు సంబంధించి ఆస్తి నాణ్యత, ఎన్‌ఐఐ వృద్ధి, లాభాల దృక్పథాన్ని అనుసరించి నాణ్యమైన మిడ్‌ క్యాప్‌ బ్యాంకులు లేదా ప్రైవేట్‌ సెక్టార్‌ బ్యాంక్‌లను ఎన్నుకోవడం మంచిది. 
మీడీయా రంగంలో ఈ రెండు స్టాకులు..
మీడియా రంగానికి సంబంధించి..క్లైయింట్ల వినియోగం తగ్గడంతో పీవీఆర్‌ ప్రకటన ఆదాయ వృద్ధి 18 శాతం తగ్గుతుందని, సాధరణ రన్‌ రేట్‌ 12 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం. అదే విధంగా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ రెవెన్యు వృద్ధి కూడా తగ్గతుంది. ఈ కంపెనీ ఆదాయ వృద్ధి 3 శాతం తగ్గుతుందని, ఇతర విభాగాలు మంచి ప్రదర్శన చేస్తాయని అంచనా వేస్తున్నాం. కానీ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై ప్రమోటర్ల రుణ భారం వేలాడుతున్నంత వరకు ఈ కంపెనీ స్టాకు పెరుగుతుందని అనుకోవడం లేదు. బా‍క్స్‌ ఆఫిస్‌ కలక్షన్ల పరంగా పీవీఆర్‌, ఐనాక్స్‌ కంపెనీలు మంచి నెంబర్లను ప్రకటిస్తాయని అంచనా వేస్తున్నాం. 
  ఈ రెండు స్టాకులపై పాజిటివ్‌గా ఉన్నాం. ఈ రెండింటిలో ఐనాక్స్‌, పీవీఆర్‌ కంటే 30 శాతం రాయితీతో ట్రేడవతుండడంతో ఈ స్టాక్‌పై అధిక ప్రాధాన్యాన్ని కలిగివున్నాం. అంతేకాకుండా ఈ కంపెనీ ప్రకటన ఆదాయం పీవీఆర్‌ కంటే మెరుగ్గా ఉండే అవకాశ ఉంది. మొత్తం మీడియా సెక్టార్‌లో ఈ రెండు స్టాకులపై  మాత్రమే సానుకూలతను కలిగివున్నాం. 
ఆటో స్టాకులకు దూరం..
 సెప్టెంబర్‌ త్రైమాసికంలో ద్వీ చక్ర వాహనాల పరిమాణం తగ్గింది. ఈ విభాగంలో హీరో మోటర్‌ కార్ప్‌పై కొంత ఆశాజనకంగా ఉన్నాం. ఈ కంపెనీ ఎక్సోపోజర్‌ గ్రామీణ ప్రాంతాలలో అధికంగా ఉండడంతో, రూరల్‌లో ఈ కంపెనీ పుంజుకుంటుందని అంచనా వేస్తున్నాం. అంతేకాకుండా ఇతర ఆటో కంపెనీల కంటే ఈ కంపెనీ 13-14 రెట్లు మల్టిపుల్స్‌ వద్ద ఆకర్షిణియంగా ట్రేడవుతోంది. ఐషర్‌ మోటర్స్‌ ఫలితాలింకా వెలువడకపోవడంతో ఈ కంపెనీ వృద్ధి అవకాశాలపై అంచనాల్లేవు. ఎగుమతులు, ఓవర్‌సీస్‌ ఎక్సోపోజర్‌ బాగుండడంతో బజాజ్‌ ఆటో ఆకర్షిణియంగా ఉంది. ఆటో స్టాక్స్‌పై నెగిటివ్‌ దృక్పథం నుంచి న్యూట్రల్‌ దృక్పథంకు రేటింగ్‌ను పెంచాం. ఒక వేళ ప్రభుత్వం స్క్రాపేజి పాలసీని తీసుకొస్తే, సీవీ(వాణిజ్య వాహనాలు)లను తయారు చేసే కంపెనీలు ఆకర్షిణియంగా మారే అవకాశం ఉంది. అప్పటి వరకు ఆటో స్టాక్సును ఎంచుకోకపోవడం మంచిది.You may be interested

29,000 పైకి బ్యాంక్‌ నిఫ్టీ!

Thursday 17th October 2019

  బ్యాంకింగ్‌ షేర్లలో విపరీతంగా కొనుగోళ్ళు జరుగుతుండడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం ట్రేడింగ్‌లో లాభాల్లో ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నం 2.30 సమయానికి నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 450.25 పాయింట్లు లేదా 1.58 శాతం లాభపడి 28,989.05 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 28,596.35 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించిన ఈ ఇండెక్స్‌, 29,049.05 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఈ ఇండెక్స్‌లో యెస్‌ బ్యాంక్‌ 16.69 శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 9.42

ఆటో, బ్యాంక్‌, మెటల్స్‌పై పాజిటివ్‌!

Thursday 17th October 2019

రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ రెండో త్రైమాసిక సీజన్‌ ఆరంభం కావడంతో మార్కెట్లు క్రమంగా రికవరీ చూపుతున్నాయి. ప్రస్తుత రేంజ్‌లో మార్కెట్‌ రాబోయే వారాల్లో కన్సాలిడేట్‌ అవుతుందని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. ఈ స్థితిలో నిర్ధిష్టస్టాకుల్లోనే కదలికలుంటాయని, ఇన్వెస్టర్లు ఎంపిక చేసిన స్టాకుల్లో పెట్టుబడులు పెడతారని, ముఖ్యంగా ఫలితాలు వస్తున్న కంపెనీల స్టాకుల్లో కదలికలుంటాయని తెలిపింది. బ్యాంకు నిఫ్టీ తన 200 రోజుల డీఎంఏను బలంగా దాటి క్లోజయితే ర్యాలీ జరుపుతుందని అంచనా

Most from this category