News


క్యూ3 ఓకే కానీ అప్‌ట్రెండ్‌కు చాన్స్‌ తక్కువే!!

Wednesday 12th February 2020
Markets_main1581498661.png-31729

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 18 పీఈలో ట్రేడవుతోంది
కార్పొరేట్‌ ట్యాక్స్‌ కోతతో ఫలితాలు గుడ్‌

ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే వెలువడ్డాయి. అయితే ఇప్పటికే ర్యాలీ చేసిన దేశీ స్టాక్‌ మార్కెట్లకు మరింత పుష్‌నిచ్చే అంశాలు కొరవడ్డాయంటున్నారు సిద్ధార్థ ఖేమ్కా. మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు కార్పొరేట్ల లాభదాకయతను పెంచినట్లు పేర్కొన్నారు. మార్కెట్లతోపాటు.. మెటల్స్‌, ఎన్‌బీఎఫ్‌సీ తదితర రంగాలపై ఒక ఇంటర్వ్యూలో సిద్ధార్థ వ్యక్తం చేసిన అభిప్రాయాలను చూద్దామా...

బడ్జెట్‌ నాట్‌ ఓకే
దేశ ఆర్థిక వ్యవస్థ వేగవంత వృద్ధిని అందుకునేందుకు తగిన చర్యలుంటాయని భావించిన కేంద్ర బడ్జెట్‌ అంచనాలను అందుకోలేకపోయింది. ఈక్విటీ మార్కెట్ల దృష్టితో చూస్తే.. బడ్జెట్‌ను నాన్‌ఈవెంట్‌గా చెప్పవచ్చు. అధిక శాతం అంచనాలను చేరడంలో విఫలమైంది. బడ్జెట్‌ అంకం ముగియడంతో ప్రస్తుతం మార్కెట్లు కార్పొరేట్‌ ఫలితాలవైపు దృష్టిపెట్టాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రపంచ మార్కెట్ల నుంచి సంకేతాల కోసం చూస్తోంది. స్థూల ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, జీడీపీ నెమ్మదిగా రికవరీ సాధించే వీలుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్‌ నిఫ్టీ 12 నెలల ఫార్మార్డ్‌ పీఈ 18గా ఉంది. ఇది దీర్ఘకాలిక సగటుతో చూస్తే.. 1 శాతం ప్రీమియంగా చెప్పవచ్చు. కార్పొరేట్‌ ఫలితాలలో అనూహ్య వృద్ధి వంటివి సంభవిస్తే తప్ప ఈ స్థాయి నుంచి మార్కెట్లు రీరేటింగ్‌ను సాధించే అవకాశాలు తక్కువే. అయితే అత్యుత్తమ పనితీరు ప్రదర్శించగల కంపెనీలు మార్కెట్లను మించి దూకుడు చూపవచ్చు.

మెటల్స్‌ మిస్‌..
ఇప్పటికే ఈ ఏడాది క్యూ3 ఫలితాల సీజన్‌ ముగింపునకు వస్తోంది. కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు ప్రభావంతో అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు వెలువడ్డాయి. కన్జూమర్‌ రంగం జోరు చూపగా.. ఆటోమొబైల్‌, కేపిటల్‌ గూడ్స్‌, మెటల్స్‌ అంచనాలను మిస్సయ్యాయి. అయితే ప్రయివేట్‌ బ్యాంక్స్‌, ఎన్‌బీఎఫ్‌సీ, హెల్త్‌కేర్‌ అంచనాలను అందుకున్నాయి. ఆటో, వినియోగ రంగ కంపెనీల యాజమాన్యాలు గ్రామీణ వినియోగంపై ఆశావహంగా స్పందించాయి. రిటైల్‌ బ్యాంకులు రుణ వృద్ధి, రుణ నాణ్యతపై అప్రమత్తతను ప్రకటిం‍చాయి. జీడీపీ తిరిగి గరిష్ట స్థాయిలో పుంజుకునేవరకూ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లుగా కదలవచ్చు. కాగా.. గ్రామీణ వినియోగం పెరుగుతుండటం, ఆహార ధరలు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, ఆటో అమ్మకాలు వంటి అంశాలు ఇటీవల మార్కెట్లలో ర్యాలీని ప్రతిబింబిస్తున్నాయి. 

కరోనా ఎఫెక్ట్‌
ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ ప్రధానంగా చైనాలో పలు ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోయేందుకు కారణమవుతోంది. టెక్స్‌టైల్స్‌. సిరామిక్స్‌, హోమ్‌వేర్‌, కెమికల్స్‌, ఇంజినీరింగ్‌ గూడ్స్‌ రంగాలకు దేశీయంగా కరోనా అవకాశాలు పెంచుతోంది. ఈ రంగాల ప్రొడక్టులు, సర్వీసులను ఎగుమతి చేస్తున్న కంపెనీలకు లబ్ది చేకూరే వీలుంది. ప్రధానంగా అమెరికా, యూరోపియన్‌ దేశాల నుంచి ఆర్డర్లు పెరగవచ్చు.

వడ్డీ రేట్లు?
తాజా పాలసీ సమీక్షలో రిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేటును యథాతథంగా కొనసాగించేందుకు నిర్ణయించినప్పటికీ లిక్విడిటీ పెంపునకు పలు చర్యలు తీసుకుంది. 1-3 మూడేళ్ల కాలానికి రూ. లక్ష కోట్ల నిధులను బ్యాంకింగ్‌ వ్యవస్థ వినియోగించేందుకు వీలు కల్పించింది. నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్‌)ను సైతం తగ్గించింది. ఎంఎస్‌ఎంఈలు, రియల్టీ రంగాలకు రుణాలందించే అంశంపైనా ఉపశమన చర్యలు ప్రకటిం‍చింది. నిజానికి బ్యాంకుల వద్ద భారీగా నిధులున్నప్పటికీ రుణ వృద్ధి మందగించింది. దీంతో ఆర్‌బీఐ చర్యలు రియల్‌ ఎకానమీ పురోగతికి సహకరించేదీ.. లేనిదీ వేచిచూడవలసి ఉంది. కాగా.. కొన్ని సంస్థలు సబ్‌ప్రైమ్‌ ప్రాజెక్టులు లేదా ఎవ్వర్‌గ్రీన్‌ రుణాలకు ఆసక్తిని చూపుతున్నాయి. ఇది మధ్యకాలంలో ఆందోళనలకు కారణంకావచ్చు. You may be interested

డాక్టర్‌ రెడ్డీస్‌ చేతికి వొకార్డ్‌ దేశీ బిజినెస్‌

Wednesday 12th February 2020

డీల్‌ విలువ రూ. 1850 కోట్లు విభిన్ని విభాగాల 62 బ్రాండ్లు కొనుగోలు 6.5 శాతం పతనమైన వొకార్డ్‌ షేరు దేశీ ఫార్మా రంగం‍లో తాజాగా కన్సాలిడేషన్‌కు తెరలేచింది. ఫార్మా రంగ హైదరాబాద్‌ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌.. హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ వొకార్డ్‌ లిమిటెడ్‌ దీనిలో భాగంకానున్నాయి. వొకార్డ్‌కు చెందిన దేశీ బిజినెస్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ కొనుగోలు చేయనుంది. ఎంపిక చేసిన కొన్ని విభాగాలను కొనుగోలు చేసేందుకు వొకార్డ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు డాక్టర్‌

మార్కెట్లోకి సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌20 సీరిస్‌ ఫోన్లు!

Wednesday 12th February 2020

దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజ కంపెనీ సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌20 సిరీస్‌ ఫోన్లను బుధవారం అంతర్జాతీయంగా విడుదల చేసింది. గెలాక్సీ ఎస్‌ సిరీస్‌లో గెలాక్సీ ఎస్‌20, ఎస్‌20 ప్లస్‌, ఎస్‌20 అల్ట్రాతో పాటు మరో నూతన ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ను తాజాగా విడుదల చేసింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి 12:30 గంటలకు శాన్‌ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌-2020 ఈవెంట్‌లో ఈ ఫోన్లను

Most from this category