News


క్యూ3 ఎఫెక్ట్‌- యూపీఎల్‌ జోరు- బ్రిటానియా వీక్‌

Monday 10th February 2020
Markets_main1581313750.png-31653

సెన్సెక్స్‌ 300 పాయింట్లు పతనం
90 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ 

కరోనా వైరస్‌ భయాలతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ఇన్వెస్టర్లలో ఆందోళనలు కనిపిస్తున్నాయి. దీంతో వారాంతాన అమెరికా మార్కెట్లు డీలాపడగా.. ప్రస్తుతం దేశీయంగానూ అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది. వెరసి ఉదయం 10.50 ప్రాంతంలో సెన్సెక్స్‌ 278 పాయింట్లు పతనమై 40,863కు చేరింది. నిఫ్టీ సైతం 90 పాయిం‍ట్లు క్షీణించి 12,008 వద్ద ట్రేడవుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో అగ్రికెమికల్స్‌ దిగ్గజం యూపీఎల్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. అయితే మరోపక్క ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో సాధించిన ఫలితాలు అంచనాలను చేరకపోవడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో అమ్మకాలకు దిగారు. ఫలితంగా నష్టాల మార్కెట్లోనూ యూపీఎల్‌ షేరు లాభాలతో సందడి చేస్తుంటే.. బ్రిటానియా నష్టాలతో డీలాపడింది. వివరాలు చూద్దాం..

యూపీఎల్‌ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం​క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో యూపీఎల్‌ లిమిటెడ్‌ నికర లాభం 77 శాతంపైగా ఎగసింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ. 838 కోట్లను తాకింది. పన్నుకు ముందు లాభం సైతం 107 శాతం పెరిగి రూ. 1037 కోట్లను అధిగమించింది. ఇక మొత్తం ఆదాయం 81 శాతం పుంజుకుని రూ. 8892 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో యూపీఎల్‌ షేరు ప్రస్తుతం 4 శాతం జంప్‌చేసి రూ. 565 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 574 సమీపంలో గరిష్టాన్ని తాకింది.

బ్రిటానియా ఇండస్ట్రీస్‌
బిస్కట్స్‌, బెవరేజెస్‌ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్‌ ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో రూ. 373 కోట్ల నికర లాభం​ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఇది 24 శాతం అధికంకాగా..  నికర అమ్మకాలు స్వల్పంగా 4 శాతం పెరిగి రూ. 2936 కోట్లకు చేరాయి. పన్నుకు ముందు లాభం సైతం 7 శాతం పుంజుకుని రూ. 497 కోట్లను తాకింది. అయితే పన్ను వ్యయాలు 23 శాతం తగ్గి రూ. 126 కోట్లకు పరిమితమయ్యాయి. ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో బ్రిటానియా ఇండస్ట్రీస్‌ షేరు ప్రస్తుతం 3 శాతం జంప్‌చేసి రూ. 3158 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 3136 వద్ద కనిష్టాన్ని తాకింది.



You may be interested

52 వారాల గరిష్టానికి 59 షేర్లు

Monday 10th February 2020

సోమవారం 52 వారాల గరిష్టానికి 59 షేర్లు పెరిగాయి. వీటిలో అబోట్‌ ఇండియా, ఏజీసీ నెట్‌వర్క్స్‌, ఏఐఏ ఇంజనీరింగ్‌, అలకెమ్‌ ల్యాబొరేటరీస్‌, అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, అపోలో పైప్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, భారత్‌ రసయాన్‌, బిర్లా టైర్స్‌, సెరబ్రా ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీస్‌, క్రియేటివ్‌ పెరిపెరల్స్‌ అండ్‌ డిస్టిబ్యూషన్‌, దివీస్‌ ల్యాబొరేటరీస్‌, ఎడెల్వీజ్‌ మ్యుచువల్‌ ఫండ్‌, ఎసాబ్‌ ఇండియా, ఎస్కార్ట్స్‌, ఎస్టర్‌ ఇండస్ట్రీస్‌, ఎఫ్‌డీసీ, ఫైన్‌ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌, నిప్పాన్‌ ఇండియా ఈటీఎఫ్‌

ఫలితాలతో టాటా స్టీల్‌ షేరు డీలా..!

Monday 10th February 2020

5శాతానికి పైగా పతనమైన షేరు  ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో క్వార్టర్‌ ఫలితాలు నిరుత్సాహపరడంతో టాటా స్టీల్‌ షేరు సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో దాదాపు 5శాతం నష్టాన్ని చవిచూసింది. కంపెనీ శుక్రవారం మార్కెట్‌ ముగింపు తరువాత ఫలితాలను వెల్లడించింది. ఫలితాలు మార్కెట్‌ను వర్గాలను మెప్పించకపోవడంతో ఈ షేరు నేడు బీఎస్‌ఈలో కంపెనీ షేరు మునుపటి ముగింపు(రూ.470.95)తో పోలిస్తే 2.25శాతం నష్టంతో రూ.460.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తితో

Most from this category