STOCKS

News


Q3 ఎఫెక్ట్‌- తొలుత జోరు- తదుపరి డీలా(అప్‌డేటెడ్‌)

Monday 20th January 2020
Markets_main1579492690.png-31038

గత వారాంతాన పలు దిగ్గజ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించాయి. డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌), ఐటీ దిగ్గజాలు టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ శుక్రవారం మార్కెట్లు ముగిశాక ఫలితాలు ప్రకటించాయి. ఈ బాటలో శనివారం ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) పనితీరును వెల్లడించింది. దీంతో ఈ కౌంటర్లు ఫలితాల ఆధారంగా నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలో భిన్న రకాలుగా స్పందిస్తున్నాయి.  కాగా.. తొలుత లాభాలతో హుషారుగా ప్రారంభమైన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కౌంటర్లు తదుపరి టీసీఎస్‌ బాటలో వెనకడుగు వేస్తున్నాయి. ఉదయం 10 ప్రాంతంలో ఈ కౌంటర్ల కదలికలు ఇలా..

ఆర్‌ఐఎల్‌
ఈ ఏడాది క్యూ3లో ఆర్‌ఐఎల్‌.. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 11,640 కోట్ల నికర లాభం ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఇది 13 శాతం వృద్ధికాగా..  ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఆర్‌ఐఎల్‌ షేరు 1.3 శాతం నష్టంతో రూ. 1561 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1609-1559 మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది.

టీసీఎస్‌
ఈ ఏడాది క్యూ3లో ఈ ఏడాది క్యూ3లో టీసీఎస్‌ రూ. 8,118 కోట్ల నికర లాభం ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన ఇది ఇది నామమాత్ర వృద్ధికాగా.. ప్రస్తుతం  ఎన్‌ఎస్‌ఈలో టీసీఎస్‌ షేరు 1.3 శాతం నీరసించి రూ. 2191 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 2242-2185 మధ్య ఊగిసలాడింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
ఈ ఏడాది క్యూ3లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ. 7,416 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది 33 శాతం వృద్ధికాగా.. నికర వడ్డీ ఆదాయం 13 శాతం పెరిగి రూ. 14,173 కోట్లకు చేరింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు 0.8 శాతం బలహీనపడి రూ. 1268 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1305-1266 మధ్య ఊగిసలాడింది.

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌
ఈ ఏడాది క్యూ3లో వార్షిక ప్రాతిపదికన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ నికర లాభం 15 శాతం పుంజుకుని రూ. 3,037 కోట్లను తాకింది. పూర్తిఏడాదికి ఆదాయంలో 16.5-17 శాతం వృద్ధిని అంచనా వేసింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేరు 2 శాతం క్షీణించి రూ. 588 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 618 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. రూ. 584 వద్ద కనిష్టాన్ని చవిచూసింది.You may be interested

12400పైన నిఫ్టీ ప్రారంభం

Monday 20th January 2020

300 పాయింట్లు లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌  అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలకు తోడు దేశీయ కార్పోరేట్‌ దిగ్గజాలైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల మూడో త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను అంచనాలను అందుకోవడంతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ లాభంతో మొదలైంది. ప్రధాన ఇండెక్స్‌లైన సెన్సెక్స్‌ 318 పాయింట్ల లాభంతో 42,263 వద్ద  నిఫ్టీ 78 పాయింట్ల లాభంతో 12400పై 12,430 వద్ద మొదలయ్యాయి. డాలర్‌ మారకంలో రూపాయి ఫ్లాట్‌గా ప్రారంభం

ఈ వారం స్టాక్‌ రికమెండేషన్లు

Monday 20th January 2020

బంధన్‌ బ్యాంక్‌:-  కొనొచ్చు  బ్రోకరేజ్‌ సంస్థ:- ఐసీఐసీఐ డైరెక్ట్‌ ప్రస్తుత ధర:- రూ.481 టార్గెట్‌ ధర:- రూ.650 ఎందుకంటే:- ‍ఈ ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. కీలకమైన సూక్ష్మ రుణాల విభాగంలో తాజా మొండి బకాయిలు పెద్దగా లేవు. అయినప్పటికీ, అదనంగా రూ.200 కోట్ల కేటాయింపులు జరిపింది. గృహ్‌ ఫైనాన్స్‌ విలీనం తర్వాత రుణ నాణ్యత ఒకింత తగ్గినా, మెరుగైన స్థితిలోనే ఉంది.  నిర్వహణ ఆస్తులు

Most from this category