News


Q3 జోష్‌- ఈ 3 మిడ్‌ క్యాప్స్‌ జోరు

Friday 24th January 2020
Markets_main1579859022.png-31173

వరుసగా రెండో రోజు సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 272 పాయింట్లు జంప్‌చేసి 41,658ను తాకగా.. నిఫ్టీ 84 పాయింట్ల ఎగసి 12,264 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో మూడు మిడ్‌ క్యాప్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా ఈఐహెచ్‌ అసోసియేటెడ్‌ హోటల్స్‌, అతుల్‌ లిమిటెడ్‌, వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌ కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

ఈఐహెచ్‌ అసోసియేటెడ్‌ హోటల్స్‌
ఆతిథ్య రంగ కంపెనీ ఈఐహెచ్‌ అసోసియేటెడ్‌ హోటల్స్‌ ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో 17 శాతం అధికంగా రూ. 20 కోట్ల నికర లాభం ఆర్జించింది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం నామమాత్రంగా పెరిగి రూ. 86 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 7 శాతం పెరిగి రూ. 29 కోట్లయ్యింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈఐహెచ్‌ అసోసియేటెడ్‌ షేరు 5 శాతంపైగా జంప్‌చేసి రూ. 310 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 315 వరకూ ఎగసింది.

అతుల్‌ లిమిటెడ్‌
‍స్పెషాలిటీ కెమికల్స్‌ రంగ కంపెనీ అతుల్‌ లిమిటెడ్‌ ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో రూ. 169 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఇది 44 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం దాదాపు యథాతథంగా రూ. 1041 కోట్లకు చేరింది. ఇక నిర్వహణ లాభం 26 శాతంపైగా పుంజుకుని రూ. 227 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో అతుల్‌ లిమిటెడ్‌ షేరు దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 4,593 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 4598 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం!

వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌
మెక్‌డొనాల్డ్స్‌ రెస్టారెంట్ల నిర్వాహక(ఫ్రాంచైజీ) కంపెనీ వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ ఈ ఏడాది క్యూ3లో రూ. 23 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఇది మూడు రెట్లు అధికంకాగా.. మొత్తం ఆదాయం 17 శాతం పుం‍జుకుని రూ. 433 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌ షేరు 3.5 శాతం జంప్‌చేసి రూ. 435 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 6 శాతం ఎగసి రూ. 453కు చేరింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం!



You may be interested

రెండో రోజూ మార్కెట్లు అప్‌

Friday 24th January 2020

సెన్సెక్స్‌ 227 పాయింట్లు ప్లస్‌ 68 పాయింట్లు లాభపడిన నిఫ్టీ బ్రెగ్జిట్‌ డీల్‌తో యూరప్‌ మార్కెట్లకు జోష్‌ కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా ఉన్నప్పటికీ వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు బలపడ్డాయి. తొలుత బలహీనంగా ప్రారంభమైనప్పటికీ వెనువెంటనే జోరందుకున్నాయి. ఆపై ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపడంతో రోజంతా హుషారుగా కదిలాయి. చివరికి సెన్సెక్స్‌ 227 పాయింట్లు ఎగిసి 41,613 వద్ద నిలవగా.. నిఫ్టీ 68 పాయింట్లు లాభపడి

భారత్‌లో వాల్యూషన్లు అధికం: జేపీ మోర్గాన్‌

Friday 24th January 2020

ఇతర వర్ధమాన మార్కెట్లపై  ఓవర్‌వెయిట్‌! గతేడాది వర్దమాన మార్కెట్ల(ఈఎం)ను నడిపించి ఎర్నింగ్స్‌ బలం ఈ ఏడాది కూడా కొనసాగుతుందని జేపీ మోర్గాన్‌ ఛేజ్‌ అంచనా వేసింది. ఎస్‌అండ్‌పీ కంపెనీల్లో దాదాపు 80 శాతం కంపెనీలు అంచనాలను మించిన ఫలితాలు ఇస్తున్నాయని, గత 30ఏళ్లలో ఈ స్థాయి ప్రదర్శన చూడలేదని జేపీ మోర్గాన్‌ అనలిస్టు జేమ్స్‌ సల్లివాన్‌ చెప్పారు. ఈ బలంతో ఈక్విటీ మార్కెట్ల పరుగు కొనసాగుతుందన్నారు. వాల్యూ స్టాకుల్లోకి పెట్టుబడులు పెరగడం

Most from this category