News


బాలీవుడ్‌ సినిమాలు హిట్‌..పీవీఆర్‌ ఫలితాలు సూపర్‌ హిట్‌!

Thursday 17th October 2019
Markets_main1571306508.png-28954

  సూపర్‌ 30, మిషన్‌ మంగళ్‌, చిచ్చోరే వంటి సినిమాలు బాక్స్‌ ఆఫిస్‌ వద్ద మంచి వసూల్‌ సాధించడంతో సెప్టెంబర్‌ త్రైమాసికంలో పీవీఆర్‌ మంచి ప్రదర్శనను చేసింది. ఆర్థిక సంవత్సరం 2020 సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి ఏడాది ప్రాతిపదికన కంపెనీ ఏకికృత నికర లాభం 34.98 శాతం పెరిగి రూ. 47.88 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ. 35.47 కోట్లుగా నమోదైంది. కాగా విశ్లేషకులు కంపెనీ నికర లాభాన్ని రూ. 31 కోట్లుగా అంచనా వేయగా, ఫలితాలు మార్కెట్‌ అంచనాలను మించడం గమనార్హం. 
   ఏకికృత ఆదాయం క్యూ2లో ఏడాది ప్రాతిపదికన 37.35 శాతం పెరిగి రూ. 973.18 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది రూ. 708.55 కోట్లుగా నమోదైంది. క్యూ2 ఫలితాలను ప్రకటించిన తర్వాత, పీవీఆర్‌ షేరు విలువ 1.46 శాతం లాభపడి రూ. 1,846.20 వద్ద ట్రేడవుతోంది. ఏకికృత వ్యయం ఏడాది ప్రాతిపదికన 37.41 శాతం పెరిగి రూ. 905.75 కోట్లకు చేరుకుంది. కాగా గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ వ్యయం రూ. 659.14 కోట్లుగా నమోదైంది. సినిమా ప్రదర్శన ఖర్చులు 20 శాతం పెరగగా, పుడ్‌, బెవరేజస్‌ ఖర్చులు 34 శాతం, ఉద్యోగుల ప్రయోజనాల ఖర్చులు 36 శాతం పెరగడంతో మొత్తంగా ఏకికృత వ్యయం పెరిగింది. అంతేకాకుండా వాణిజ్య ఖర్చులు ఏడాది ప్రాతిపదికన 3.5 శాతం పెరిగి రూ. 111.13 కోట్లుగా నమోదైంది.You may be interested

బ్రెగ్జిట్ డీల్ కుదిరింది..

Thursday 17th October 2019

దూసుకుపోయిన బ్రిటీష్ కరెన్సీ, యూరప్ మార్కెట్లు యూరప్, యూకే మధ్య అర్ధవంతమైన డీల్ కుదిరిందని యూరోపియన్ కమీషన్ అధ్యక్షుడు జీన్ క్లాడే జంకర్ ప్రకటించారు. ఇది ఒక నాణ్యమైన, సమతుల్యమైన ఒప్పందంగా అభివర్ణించారు. ఒక నూతన ఒప్పందం కుదిరిందని, శనివారం ఈ డీల్ ను పార్లమెంట్ ముందు ఉంచుతామని యూకే ప్రధాని చెప్పారు. డీల్ ను గురువారం ఈయూ నేతల ముందుంచుతారు. ఈయూనేతలు, బ్రిటన్ పార్లమెంట్ అనుమతి లభించిన అనంతరం డీల్

యస్‌ బ్యాంక్‌ 17.50శాతం అప్‌

Thursday 17th October 2019

ప్రముఖ పారిశ్రామికవేత్తలు సునీల్‌ మిట్టల్‌, సునీల్‌ ముంజల్‌ యస్‌బ్యాంక్‌లో వాటా కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారనే వార్తలు వెలుగులోకి రావడంతో యస్‌ బ్యాంక్‌ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో 17.50శాతం లాభపడింది. నేడు ఎస్‌ఈలో ఈ బ్యాంకు షేర్లు రూ.41.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బ్యాంకులో వాటా కొనుగోలుకు సంబంధించి చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని, చర్చలు విజయవంతమైనట్లైతే.., మిట్టల్‌, ముంజల్‌ 5శాతం వాటాను కొనుగోలు చేసే అవకాశం ఉందని వార్తలు నిన్న

Most from this category