News


కోటక్‌ బ్యాంక్‌ ఆదాయం రూ.12,543 కోట్లు

Wednesday 23rd October 2019
Markets_main1571803480.png-29066

-51 శాతం పెరిగిన స్టాండ్‌అలోన్‌ నికర లాభం 
-25 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం 

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.2,407 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం(రూ.1,747 కోట్లు)తో పోల్చితే 38 శాతం వృద్ధి సాధించామని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.10,829 కోట్ల నుంచి రూ.12,543 కోట్లకు పెరిగిందని పేర్కొంది. స్టాండ్‌అలోన్‌ పరంగా చూస్తే, గత క్యూ2లో రూ.1,142 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 51 శాతం వృద్ధితో రూ.1,724 కోట్లకు పెరిగిందని వివరించింది.

రూ.3,350 కోట్లకు నికర వడ్డీ ఆదాయం....
 పన్ను వ్యయాలు తక్కువగా ఉండటం,  నికర వడ్డీ ఆదాయం అధికంగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ తెలిపింది. తమ కన్సాలిడేటెట్‌ లాభంతో అనుబంధ సంస్థల వాటా 28 శాతంగా ఉందని వివరించింది. నికర వడ్డీ ఆదాయం రూ.2,676 కోట్ల నుంచి 25 శాతం వృద్ధితో రూ.3,350 కోట్లకు పెరిగిందని తెలిపింది. గత క్యూ2లో 4.19 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్‌ ఈ క్యూ2లో 4.61 శాతానికి పెరిగిందని పేర్కొంది. రుణ వృద్ధి 21 శాతం నుంచి 15 శాతానికి తగ్గిందని తెలిపింది. సీక్వెన్షియల్‌గా చూస్తే, ఈ క్యూ1లో రుణ వృద్ధి 18 శాతమని పేర్కొంది. 

తగ్గిన రుణ నాణ్యత...
ఈ బ్యాంక్‌ రుణ నాణ్యత ఒకింత తగ్గింది. గత క్యూ2లో రూ.4,302 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.5,475 కోట్లకు పెరిగాయని బ్యాంక్‌ పేర్కొంది. అలాగే నికర మొండి బకాయిలు రూ.1,618 కోట్ల నుంచి రూ.2,032 కోట్లకు పెరిగాయని వివరించింది. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 1.91 శాతం నుంచి 2.17 శాతానికి, నికర మొండి బకాయిలు 0.73 శాతం నుంచి 0.82 శాతానికి పెరిగాయని పేర్కొంది. కేటాయింపులు రూ.360 కోట్ల నుంచి రూ.473 కోట్లకు పెరిగాయని వివరించింది. 

ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్‌ 0.8 శాతం లాభంతో రూ.1,629 వద్ద ముగిసింది. 
 



You may be interested

చాక్లెట్‌ ఖరీదు రూ. 4.3 లక్షలు

Wednesday 23rd October 2019

- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన   చాక్లెట్‌ తయారు చేసిన ఐటీసీ న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ కంపెనీ ‘ఐటీసీ’..  ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్‌ను తయారు చేసింది. ఈ కంపెనీకి చెందిన ఫాబెల్లె బ్రాండ్ ‘ట్రినిటీ - ట్రఫుల్స్ ఎక్స్‌ట్రార్డినేర్’ పేరిట చాక్లెట్‌ను రూపొందించగా.. దీని ఖరీదు కేజీ రూ. 4.3 లక్షలుగా ప్రకటించింది. ఇంతటి ఖరీదైన చాక్లెట్‌ మరొకటి లేనందున గిన్నిస్‌ బుక్‌లో ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ స్థానం సంపాదించినట్లు కంపెనీ ఒక

యాక్సిస్‌ బ్యాంక్‌ నష్టాలు రూ.112 కోట్లు

Wednesday 23rd October 2019

-రూ.2,138 కోట్ల వన్‌టైమ్‌ పన్ను వ్యయాల ఎఫెక్ట్‌  -రూ.19,334 కోట్లకు మొత్తం ఆదాయం  -స్వల్పంగా మెరుగుపడిన రుణ నాణ్యత  న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ యాక్సిస్‌ బ్యాంక్‌కు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.112 కోట్ల నికర నష్టాలు (స్టాండ్‌అలోన్‌) వచ్చాయి. కార్పొరేట్‌ పన్ను రేటులో మార్పుల వల్ల రూ.2,138 కోట్ల వన్‌ టైమ్‌ పన్ను వ్యయాల కారణంగా ఈ నష్టాలు వచ్చాయని యాక్సిస్‌ బ్యాంక్‌ తెలిపింది. ఈ వ్యయాలను పరిగణనలోకి తీసుకోకుంటే

Most from this category