News


ఫలితాల ఎఫెక్ట్‌: ఐఓసీ 3 శాతం డౌన్‌!

Friday 1st November 2019
Markets_main1572584081.png-29280

ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) సెప్టెంబర్‌ త్రైమాసిక పలితాలు మార్కెట్‌ వర్గాలను నిరాశపరిచాయి. కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 83 శాతం తగ్గి రూ. 564 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ. 3,247 కోట్లుగా ఉండడం గమనార్హం. ఫలితాలు బాగలేకపోవడంతో కంపెనీ షేరు విలువ శుక్రవారం సెషన్లో ఉదయం 10.14 సమయానికి 3.75 శాతం నష్టపోయి రూ. 141.30 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 146.80 వద్ద ముగిసిన ఈ షేరు, శుక్రవారం సెషన్‌లో రూ. 141.00 వద్ద నెగిటివ్‌లో ప్రారంభమైంది. 



You may be interested

పీఎస్‌యూ బ్యాంకింగ్‌ షేర్ల జోరు

Friday 1st November 2019

ప్రభుత్వ బ్యాంక్‌ షేర్లు గురువారం సెషన్‌లో సానుకూలంగా కదులుతున్నాయి. ఫలితంగా నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఉదయం 10.40 సమయానికి 1.80 శాతం లాభపడి 2,551.50 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో సెంట్రల్‌ బ్యాంక్‌ 6.36 శాతం, బ్యాంక్‌ ఇండియా 3.37 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2.78 శాతం, పీఎన్‌బీ(పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌) 2.75 శాతం,  ఓరియంటల్‌ బ్యాంక్‌ 2.47 శాతం, యూనియన్‌ బ్యాంక్‌ 2.44 శాతం,

ప్లాట్‌గా ప్రారంభమైన రూపీ

Friday 1st November 2019

దేశీయ కరెన్సీ రూపీ డాలర్‌ మారకంలో శుక్రవారం సెషన్‌లో స్వల్పంగా నష్టపోయి 70.98 వద్ద ప్రారంభమైంది. కాగా నెల చివరిలో డాలర్‌ డిమాండ్‌ బలపడడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో ప్రారంభ లాభాలను కోల్పోయి 70.92 వద్ద ముగిసింది. చమురు ధరలు పెరగడంతో పాటు డాలర్‌ డిమాండ్‌ బలపడడంతో రూపీ సెంటిమెంట్‌ బలహీనపడిందని విశ్లేషకులు తెలిపారు. యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందనే అంచనాలుండడంతోపాటు, ఫెడ్‌ వడ్డీ రేట్లను

Most from this category