News


పెరిగిన అమరరాజా నికర లాభం..షేరు 7% అప్‌

Monday 11th November 2019
Markets_main1573449682.png-29501

అమరరాజా బ్యాటరీస్‌ నికర లాభం సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.218.85 కోట్లకు పెరిగింది. గత త్రైమాసికాల కంటే ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం అత్యధికంగా పెరగడం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్యార్టర్‌లో కంపెనీ నికర లాభం రూ. 120.23 కోట్లుగా నమోదైంది. కానీ కంపెనీ ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 3 శాతం తగ్గి రూ. 1753.05 కోట్ల నుంచి రూ. 1695.31 కోట్లకు పడిపోయింది. కంపెనీ షేరుపై లాభం(ఈపీఎస్‌) ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ. 12.81గా ఉంది. ఆర్థిక సంవత్సరం 2019-20 కి గాను రూపాయి ముఖవిలువ కలిగిన ఈక్విటీ షేరుపై రూ. 6(600 శాతం) తాత్కాలిక డివిడెండ్‌ను కంపెనీ బోర్డు డైరక్టర్లు ప్రకటించారు. కంపెనీ ఫలితాలు బాగుండడంతో పాటు, కంపెనీ బోర్డు తాత్కాలిక డివిడెండ్‌ను ప్రకటించడంతో సోమవారం ట్రేడింగ్‌లో అమర రాజా బ్యాటరీస్‌ షేరు ర్యాలీ చేస్తోంది. ఉదయం 10.41 సమయానికి 7 శాతం లాభపడి రూ. 699.90  వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 654.20 వద్ద ముగిసిన కంపెనీ షేరు, సోమవారం సెషన్‌లో రూ. 678.00 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమై, రూ. 706.40 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది.



You may be interested

పీఎస్‌యూ బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోలు మద్దతు

Monday 11th November 2019

మార్కెట్‌ పరిమితి శ్రేణిలో ట్రేడ్‌ అవుతున్న తరుణంలో.... ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ దాదాపు 1.50శాతం లాభపడింది. ఈ ఇండెక్స్‌లో అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేరు 5.50శాతం లాభపడింది. శుక్రవారం మెరుగైన ఫలితాలు ప్రకటించడటం షేరు ర్యాలీకి కారణమైంది. అలాగే బ్యాంక్‌ ఇండియా 2శాతం, యూనియన్‌ బ్యాంక్‌ 1శాతం, పంజాబ్‌ నేషనల్‌

నిఫ్టీలో ఐరన్‌ బటర్‌ఫ్లై వ్యూహం బెటర్‌!

Monday 11th November 2019

నిపుణుల సూచన నిఫ్టీ పరిమిత శ్రేణిలో కదలాడే అవకాశాలున్న ఈ సమయంలో ఐరన్‌బటర్‌ఫ్లై వ్యూహం అవలంబించడం మంచిదని ఆప్షన్‌ నిపుణులు సలహా ఇస్తున్నారు. నిఫ్టీ ప్రస్తుత స్థాయిల నుంచి 400 పాయింట్ల రేంజ్‌లో కదలాడితే ఈ వ్యూహం సత్ఫలితాలనిస్తుంది. మార్కెట్లు ర్యాలీ జరిపి అలసినందున గరిష్ఠాల వద్ద ప్రాఫిట్‌బుకింగ్‌ ఉండొచ్చని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. ఇలాంటప్పుడు ఈ బటర్‌ఫ్లై వ్యూహం మంచిదని సూచించింది. ఈ వ్యూహంలో 11900 పాయింట్ల కాల్‌ మరియు

Most from this category