News


క్యూ2 ఫలితాలు: రెండురెట్లు పెరిగిన డా. రెడ్డీస్‌ లాభం

Friday 1st November 2019
Markets_main1572605310.png-29291

డా. రెడ్డీస్‌ లేబోరేటరీష్‌, శుక్రవారం ప్రకటించిన సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలలో రూ. 1,092.5 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. కాగా గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ. 503.80 కోట్లుగా ఉంది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 4,800.9 కోట్లుగా నమోదైంది. ఇది గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ. 3,797.8 కోట్ల కంటే 26.41 శాతం అధికం కావడం గమనార్హం. ఈ త్రైమాసికంలో కంపెనీ వ్యాపారాల పనితీరు, నగదు లభ్యతపై సంతృప్తిగా ఉన్నామని కంపెనీ కో చైర్మన్‌ ఎండీ జీవీ ప్రసాద్‌ అన్నారు. ‘మా వ్యూహాలను అమలు చేయడంతోపాటు, సామర్ధ్యం, నాణ్యత పరంగా వృద్ధి చెందుతున్నాం’ అని ఆయన అన్నారు. యురోప్‌, అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లు, ఇండియా మార్కెట్‌లలో మంచి ప్రదర్శన చేయడంతో కంపెనీ అంతర్జాతీయ జనరిక్‌ విభాగ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 7 శాతం పెరిగి రూ. 3,280 కోట్లుకు చేరుకుందని కంపెనీ ప్రతినిధలు తెలిపారు. ఉత్తర అమెరికా నుంచి వచ్చే ఆదాయం ప్లాట్‌గా రూ. 1,430 కోట్లుగా ఉండగా, యురోప్‌ నుంచి వచ్చే ఆదాయం రూ. 280 కోట్లుగా ఉంది. ఇండియా నుంచి రూ. 750 కోట్ల ఆదాయం, అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి రూ. 830 కోట్లు ఆదాయం వచ్చిందని యాజమాన్యం తెలిపింది. ఫార్మా సుటికల్స్‌ సర్వీసెస్‌, క్రియాశీల పదార్ధాల ఆదాయం రూ. 710 కోట్లుగా ఉందని, ఇది గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంతో పోలిస్తే 18 శాతం అధికమని పేర్కొంది. 



You may be interested

ఈ స్టాక్స్‌లో ప్రమోటర్లు, ఇనిస్టిట్యూషన్ల వాటా పైపైకి 

Friday 1st November 2019

ఓ కంపెనీలో ప్రమోటర్లు వాటాలు పెంచుకున్నారంటే దాని వెనుక ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది. ఎందుకంటే వీరు కంపెనీకి సంబంధించిన వ్యక్తులు. కానీ, ఏక కాలంలో ప్రమోటర్లతోపాటు, ఇనిస్టిట్యూషన్లు, విదేశీ ఇన్వెస్టర్లు ఒక కంపెనీలో వాటాలను పెంచుకున్నారంటే, సమీప కాలంలో ఆ కంపెనీకి సానుకూల పరిస్థితులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఇలా ప్రమోటర్లు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ అన్నీ కూడా 12 కంపెనీల్లో

ఆరో రోజూ లాభాలే!

Friday 1st November 2019

బ్యాంకింగ్‌, మెటల్‌, ఫార్మా ఆర్థిక రంగ షేర్ల ర్యాలీ అండతో సూచీల ర్యాలీ ఆరోరోజూ కొనసాగింది. సెన్సెక్స్‌ 36 పాయింట్ల లాభంతో 40,165 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 11,890 వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో 300(1శాతం)పాయింట్లు మేర లాభపడి 30,364.30 వద్ద స్థిరపడింది. నేడు పలు కంపెనీలు ప్రకటించిన అక్టోబర్‌ అమ్మక గణాంకాలు అంతంత మాత్రంగా

Most from this category