News


పెరిగిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నికర లాభం

Friday 1st November 2019
Markets_main1572602070.png-29289

   ఆర్థిక సంవత్సరం 2020 సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ. 266.4 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఈ త్రైమాసికంలో ప్రొవిజన్లు తగ్గడంతో పాటు, నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) పెరగడంతో  బ్యాంక్‌ నికర లాభం పెరిగింది. అంతేకాకుండా బ్యాంక్‌ ఇతర ఆదాయం, ప్రొవిజన్లకు ముందు ఆపరేటింగ్‌ లాభం పెరగడంతో కూడా బ్యాంక్‌ నికర లాభం పెరిగింది. కాగా గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ బ్యాంక్‌ రూ. 1,156 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో బ్యాంక్‌ పన్ను ముందు లాభం రూ. 407.6 కోట్లుగా ఉంది. ఎన్ఐఐ(నికర వడ్డీ ఆదాయం), ఈ సెప్టెంబర్‌ త్రైమాసికంలో 31.9 శాతం పెరిగి రూ. 3,860 కోట్లుగా నమోదైంది. కానీ బ్యాంక్‌ రుణవృద్ధి(1.6 శాతం తగ్గింది) బలహీనంగా ఉంది.
    సెప్టెంబర్‌ త్రైమాసికంలో బ్యాంక్‌ డిపాజిట్లు 1.2 శాతం వృద్ధి చెందాయి. క్యూ 2 లో నికర వడ్డీ మార్జిన్(ఎన్‌ఐఎం) 2.99 శాతంగా ఉంది. ఇది గత 18 త్రైమాసికాల కంటే అధికం కావడం గమనార్హం. కాగా ఈ ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో ఎన్ఐఎం 2.67 శాతంగా నమోదైంది.  క్యూ 2 లో ఇతర ఆదాయం (వడ్డీయేతర ఆదాయం) 28.8 శాతం పెరిగి రూ .1,327.36 కోట్లకు చేరుకోగా, ప్రొవిజన్లకు ముందు ఆపరేటింగ్ లాభం, గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంతో పోలిస్తే 49.35 శాతం పెరిగి రూ .2,459.8 కోట్లకు చేరుకుంది.
   ఆస్తి నాణ్యతకు సంబంధించి..అధిక రైటాఫ్‌లు ఉండడంతో సెప్టెంబర్‌ త్రైమాసికంలో బ్యాంక్‌ స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) త్రైమాసిక ప్రాతిపదికన 19 బేసిస్‌ పాయింట్లు తగ్గి 16.31 శాతానికి చేరుకుంది. కానీ నికర ఎన్‌పీఏలు మాత్రం త్రైమాసిక ప్రాతిపదికన 8 బీపీఎస్‌(బేసిస్‌ పాయింట్లు) పెరిగి 5.87 శాతంగా నమోదైంది. బ్యాంక్‌ స్లిప్పేజ్‌లు రూ. 3,166 కోట్లుగా నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో నమోదైన రూ. 3,683 కోట్లతో పోల్చుకుంటే తక్కువ కావడం గమనార్హం.
  బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేరు శుక్రవారం మధ్యాహ్నం 3.11 సమయానికి 0.07 శాతం లాభపడి రూ. 71.30  వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

ఆరో రోజూ లాభాలే!

Friday 1st November 2019

బ్యాంకింగ్‌, మెటల్‌, ఫార్మా ఆర్థిక రంగ షేర్ల ర్యాలీ అండతో సూచీల ర్యాలీ ఆరోరోజూ కొనసాగింది. సెన్సెక్స్‌ 36 పాయింట్ల లాభంతో 40,165 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 11,890 వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో 300(1శాతం)పాయింట్లు మేర లాభపడి 30,364.30 వద్ద స్థిరపడింది. నేడు పలు కంపెనీలు ప్రకటించిన అక్టోబర్‌ అమ్మక గణాంకాలు అంతంత మాత్రంగా

క్షీణించిన బజాజ్‌, అశోక్‌ లేలాండ్‌ అమ్మకాలు

Friday 1st November 2019

9శాతం క్షీణించిన బజాజ్‌ అమ్మకాలు:- వార్షిక ప్రాతిపదికన బజాజ్‌ అమ్మకాలు అక్టోబర్‌లో 9శాతం క్షీణించాయి. ఈ అక్టోబర్‌ నెలలో మొత్తం 4,63,208 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో మొత్తం 5,06,699 వాహనాలు అమ్ముడైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ అక్టోబర్‌లో దేశీయ అమ్మకాలు 2.78లక్షలు నమోదు కాగా గతేడాది ఇదే అక్టోబర్‌లో నమోదైన మొత్తం 3.20లక్షల అమ్మకాలతో పోలిస్తే ఇది 13శాతం తక్కువ. మోటర్‌ సైకిల్‌ విభాగపు అమ్మకాలు సైతం 14శాతం

Most from this category