News


21.69% పెరిగిన బజాజ్‌ ఆటో నికర లాభం!

Wednesday 23rd October 2019
Markets_main1571821613.png-29083

  బజాజ్‌ ఆటో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలలో స్టాండ్‌ఎలోన్‌ నికర లాభాన్ని  రూ. 1,402.42 కోట్లుగా ప్రకటించింది. ఇది గతేడాది రూ. 1,152.48 కోట్లు కంటే 21.69 శాతం అధికం కావడం గమనార్హం. ఈ లాభం రూ. 1,150 కోట్లుగా ఉంటుందని విశ్లేషకులు అంచనావేశారు.
    కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో బజాజ్‌ ఆటో పన్ను వ్యయం సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ. 206.49 కోట్లకు తగ్గింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ వ్యయం రూ. 500.17 కోట్లుగా ఉంది. కంపెనీ ఆపరేటింగ్‌ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 4.09 శాతం తగ్గి రూ. 7,707.32 కోట్లుగా నమోదైంది. ఇది గతేడాది రూ. 8,036.34 కోట్లుగా ఉంది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో బజాజ్‌ ఆటో 11,73,591 వాహనాలను విక్రయించగా, గత ఏడాది ఇదే త్రైమాసికంలో 13,39,444 వాహనాల విక్రయించింది. కంపెనీ ఫలితాలు వెలువడడంతో మధ్యాహ్నం 1.20 సమయానికి బజాజ్‌ ఆటో షేరు విలువ 2 శాతం లాభపడి, రూ. 3,184కి పైన ట్రేడవుతోంది. 2019 సెప్టెంబర్‌ చివరినాటికి, కంపెనీ చెల్లించిన డివిడెండ్‌లు, రూ. 2072 కోట్ల పన్నులను మినహాయిస్తే, కంపెనీ మిగులు నిధులు( నిధులు+ఇతరత్ర)రూ. 15,986 కోట్లుగా ఉంది. ఇది జూన్‌ 2019 చివరినాటికి రూ. 17,126 కోట్లుగా ఉండడం గమనార్హం.



You may be interested

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌కు రేటింగ్‌ షాక్‌..!

Wednesday 23rd October 2019

గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థలు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడంతో గురువారం ఆర్‌బీఎల్‌ షేర్లు రికార్డు కనిష్టస్థాయికి పతనమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.258.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈ ఏడాది క్యూ2లో బ్యాంక్‌ నికర లాభం 73శాతం క్షీణించి రూ. 54.3 కోట్లకు పరిమితమైంది. స్థూల ఎన్‌పీఏలు 1.38 శాతం నుంచి 2.6 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.65 శాతం నుంచి 1.56 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు రూ. 140

ఈక్విటీలంటే భయామా..? అయితే సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను కొనండి.!

Wednesday 23rd October 2019

భవిష్యత్తులో ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగవచ్చనే ఆందోళన వ్యక్తం చేసే ఇన్వెస్టర్లు సావరిన్‌ పసిడి బాండ్లను కొనుగోలు చేయవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు సలహానిస్తున్నారు. స్థిరమైన ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు పసిడి స్పాట్‌, ఫ్యూచర్ల ర్యాలీ నుంచి వచ్చే లాభాల కంటే ఎక్కువ రాబడులను సావరిన్‌ బాండ్లు ఇస్తాయని విశ్లేషకులంటున్నారు. ‘‘ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు అతిగా అంచనా వేయబడ్డాయి. ఈ తరుణంలో ఇన్వెస్టర్లు తమ పోర్టుఫోలియోలో పసిడిని జోడించుకోవడం మంచిది.’’ అని ఆశికా

Most from this category