News


క్యూ2 ఫలితాలు, ఐఐపీ గణాంకాలే దిక్సూచీ

Monday 7th October 2019
Markets_main1570419991.png-28742

  • టీసీఎస్‌, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఫలితాలు ఈవారంలోనే..
  • ఆగస్టు పారిశ్రామికోత్పత్తి డేటా శుక్రవారం వెల్లడి
  • అమెరికా-చైనా వాణిజ్య చర్చలపై ఇన్వెస్టర్ల దృష్టి
  • బుధవారం ఎఫ్‌ఓఎంసీ మినిట్స్‌ వెల్లడి
  • దసరా సందర్భంగా మంగళవారం మార్కెట్‌కు సెలవు

న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్‌ కంపెనీల క్యూ2 ఫలితాల ప్రకటన, స్థూల ఆర్థిక అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసిక (జూలై-సెప్టెంబర్‌) ఫలితాలను గురువారం వెల్లడించనుంది. క్యూ2 సీజన్‌కు బోణీ కొట్టనున్న ఈ కంపెనీ ఫలితాలు ఈసారి కూడా ఆశాజనకంగా ఉండేందుకు ఆస్కారం ఉందని బ్రోకరేజీ సంస్థలు భావిస్తున్నాయి. మొత్తం కరెన్సీ ఆదాయ వృద్ధి 3 శాతంతో స్థిరంగా ఉంటుందని అంచనావేస్తున్నాయి. కరెన్సీ ఆదాయంలో వృద్ధి 3.5 శాతం వరకు ఉండవచ్చని ఎడిల్‌వీస్‌ అంచనాకట్టింది. లివరేజీలో వృద్ధి.. వేతన పెంపు, వీసా వ్యయం లేకపోవడం, రూపాయి విలువ బలహీనపడిన నేపథ్యంలో ఈబీఐటీ (ఎబిట్‌) మార్జిన్లు 90 బేసిస్‌ పాయింట్ల మేర పెరిగి క్రమానుగతంగా 25.1 శాతంగా నమోదుకావచ్చని వెల్లడించింది. ఇక లార్జ్‌క్యాప్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్ ఫలితాలు కూడా గురువారం విడుదలకానుండగా.. మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఫలితాలు శుక్రవారం వెల్లడికానున్నాయి. ఈ సంస్థ స్థిర కరెన్సీ ఆదాయ వృద్ధి 3.6 శాతంగా ఉండవచ్చని బ్రోకింగ్‌ సంస్థ ప్రభుదాస్ లిల్లాధర్ అంచనావేసింది. ‘స్టార్టర్ ఎన్ వి’ డీల్‌తో ఇన్ఫీ ఆదాయంలో వృద్ధి 50 బేసిస్‌ పాయింట్ల మేర ఉండవచ్చని వెల్లడించింది. డాలరుతో రూపాయి మారకం విలువ బలహీనపడిన అంశం ఆధారంగా చూస్తే.. ఎబిట్‌ 90-100 బేసిస్‌ పాయింట్ల పెరిగేందుకు అవకాశం ఉందని అంచనాకట్టింది. ఇక బజాజ్ కన్సూమర్ కేర్, గోవా కార్బన్, జీఎం బ్రూవరీస్, అవెన్యూ సూపర్‌మార్ట్స్, ఐటీఐ ఫలితాలు ఈవారంలోనే వెల్లడికానున్నాయి.

ఒడిదుడుకులకు ఆస్కారం: ఎపిక్‌ రీసెర్చ్‌
పలు రంగాల్లో క్యూ2 ఫలితాలు ఒడిదుడుకులకు ఆస్కారం ఇవ్వనున్నాయని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌ అన్నారు. టీసీఎస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌ ఫలితాలతో మార్కెట్‌కు దిశానిర్దేశం కానుందని వ్యాఖ్యానించారు. ఫలితాల నేపథ్యంలో ప్రధాన సూచీలు రేంజ్‌ బౌండ్‌లోనే కదలాడేందుకు అవకాశం ఉందని భావిస్తున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ మోతీలాల్ ఓస్వాల్ వెల్లడించారు. ఇన్వెస్టర్లు ఈవారంలో ఆచితూచి వ్యవహరిస్తారని అంచనావేస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం వెల్లడికానున్న ఆగస్టు నెల పారిశ్రామికోత్పత్తి డేటా కీలకంకానుందన్నారు. టెక్నికల్‌గా చూస్తే.. నిఫ్టీకి 200-రోజుల కదలికల సగటు (ఎస్‌ఎంఏ) 11,260 పాయింట్ల వద్ద నిరోధం ఉందని కోటక్ సెక్యూరిటీస్ (ఈక్విటీ టెక్నికల్ రీసెర్చ్) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. మద్దతు స్థాయిలు వరుసగా 11180, 11050, 10900 పాయింట్లుగా విశ్లేషించారు.

అంతర్జాతీయ అంశాల ప్రభావం..
చైనా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం.. గురు, శుక్రవారాల్లో అమెరికా ప్రభుత్వ పరిపాలన అధికారులతో సమావేశం కానుంది. యూఎస్‌-చైనా వాణిజ్య అంశంపై చర్చ జరగనుంది. మరోవైపు బుధవారం అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) మినిట్స్‌ వెల్లడికానున్నాయి. గురువారం యూఎస్‌ సెప్టెంబర్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదలకానున్నాయి.

ఈ వారంలో ట్రేడింగ్‌ నాలుగు రోజులే..
దసరా సందర్భంగా మంగళవారం (అక్టోబర్‌ 8న) దేశీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలు సెలవు ప్రకటించాయి. దీంతో ఈ వారంలో ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితమైంది. బుధవారం (9న) ఉదయం మార్కెట్‌ యథావిధిగా ప్రారంభంకానుంది.

రూ.3,924 కోట్లు ఉపసంహరణ...
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) అక్టోబర్‌ 1–4 కాలానికి ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.2,947 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. డెట్‌ మార్కెట్‌లో వీరు మరో రూ. 977 కోట్లను వెనక్కు తీసుకోవడంతో ఈ నెల్లోని తొలి మూడు ట్రేడింగ్‌ సెషన్లలో మొత్తం ఉపసంహరణ రూ.3,924 కోట్లుగా నిలిచింది. You may be interested

ఈ వారం స్టాక్స్‌ రికమెండేషన్స్‌

Monday 7th October 2019

మహీంద్రా అండ్‌ మహీంద్రా     కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌  ప్రస్తుత ధర: రూ.564 టార్గెట్‌ ధర: రూ.660 ఎందుకంటే:- ఫోర్డ్‌ ఇండియాతో ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్‌(జేవీ) మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీకి ప్రయోజనం కలిగించేదే. భారత్‌తో పాటు ఇతర వర్థమాన మార్కెట్లలో లాభదాయక వృద్ధిని కొనసాగించడానికి ఫోర్డ్‌ ఇండియాతో ఏర్పాటు చేసిన జేవీ తోడ్పడుతుంది. ఈ జేవీలో మహీంద్రా వాటా 51 శాతంగా, ఫోర్డ్‌ వాటా 49 శాతంగా ఉన్నాయి. రూ.1,925

సెన్సెక్స్‌ 37,950పైన స్థిరపడితేనే...

Monday 7th October 2019

కార్పొరేట్‌ పన్ను తగ్గింపు కారణంగా గత నెల మూడోవారంలో జరిగిన ర్యాలీలో వచ్చిన లాభాల్ని పట్టుమని పదిరోజులు కూడా మార్కెట్‌ నిలుపుకోలేకపోయింది. పన్ను తగ్గింపు ప్రయోజనం లేకుండా పెరిగిన షేర్లు తగ్గడం సహజమేగానీ, ఆ ప్రయోజనం పొందే షేర్లు సైతం గతవారం చివర్లో అమ్మకాల ఒత్తిడికి లోనుకావడం ఆశ్చర్యం కల్గించేదే. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ షేర్లను మొండి బకాయిలు, జీడీపీ బలహీన వృద్ధి అంచనాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు సైతం

Most from this category