News


స్పైస్ జెట్, టైటాన్‌లో వాటాలు పెంచుకున్న ఝున్‌ఝున్‌వాలా

Tuesday 23rd July 2019
Markets_main1563865171.png-27254

  • వాటాలు తగ్గించుకున్న వాటిలో నాలుగు స్టాకులు
  • 14 కంపెనీలలో ఎటువంటి మార్పులేదు   

రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా 2019 మార్చి  త్రైమాసికంతో పోల్చితే జూన్ త్రైమాసికంలో రెండు కంపెనీలలో తన వాటాను పెంచుకోగా,  నాలుగు కంపెనీలలో ఉన్న తన హోల్డింగ్‌ను తగ్గించుకున్నారు. ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్, ఫెడరల్ బ్యాంక్, లుపిన్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్‌లలో తన వాటాను తగ్గించుకోగా స్పైస్ జెట్, టైటాన్ కంపెనీలో వాటాను పెంచుకున్నారు. 
   జూలై 2019 నాటికి ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో ఉన్న 20 కంపెనీలు, ఆర్థిక సంవత్సరం 2020 మొదటి త్రైమాసికానికి గాను తమ షేరు హోల్డింగ్‌ డేటాను విడుదల చేశాయి. ఈ కంపెనీలలో సగానికి పైగా కంపెనీలు (సంవత్సరాది నుంచి ప్రస్తుత తేది వరకు(వైటూడీ)) ప్రతికూల రాబడులనే ఇచ్చాయి. స్పైస్ జెట్‌ 58 శాతం (వైటూడీ) పెరగగా , టైటాన్ 17 శాతం లాభపడింది. ఝున్‌ఝున్‌వాలా వాటాలను తగ్గించుకున్న కంపెనీలలో రెండు కంపెనీల స్టాక్‌ విలువ ఇదే కాలవ్యవధిలో భారిగా పడిపోయాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ 70 శాతం నష్టపోగా, లుపిన్‌ 11 శాతం పతనమయ్యింది. కాగా ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ 10 శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 6 శాతం లాభపడడం గమనర్హం.
   ఝున్‌ఝున్‌వాలాకు ఇష్టమైన టైటాన్ కంపెనీ రేటింగ్‌ను గ్లోబల్‌ రేటింగ్‌ కంపెనీలు ఈ నెలలో మూడు సార్లు తగ్గించిన విషయం తెలిసిందే. అయినప్పటికి ఈ కంపెనీలో వాటాను పెంచుకున్నారు. మోర్గాన్ స్టాన్లీ  ఈ కంపెనీ షేరు టార్గెట్‌ ధరను రూ.1300 గా నిర్ణయించి, రేటింగ్‌ను ‘ఓవర్‌ వెయిట్‌’ నుంచి ‘అండర్‌ వెయిట్‌’ తగ్గించింది. క్రెడిట్ సూయిస్ ఈ షేరు టార్గెట్‌ ధరను రూ.1,250గానే ఉంచి, రేటింగ్‌ను ‘ఔట్‌ పెర్ఫార్మ్‌’ నుంచి ‘న్యూట్రల్‌’ కు తగ్గిం‍చింది. హెచ్‌ఎస్‌బీసీ ఈ షేరు టార్గెట్ ధరను రూ .1,300 వద్ద కొనసాగిస్తూ రేటింగ్‌ను ‘బై’ నుంచి ‘హోల్డ్‌’ కు తగ్గించింది.
    జెట్‌ ఎయిర్‌వేస్‌ 30 విమానసర్వీసులను స్పైస్ జెట్ తన విమాన సర్వీసులలో కలుపుకోవడంతో ఐదేళ్ళలో అత్యధిక దేశీయ మార్కెట్ వాటా 15.6 శాతాన్ని ఈ జూన్లో నమోదుచేసింది.
   ఝున్‌ఝున్‌వాలా 14 కంపెనీలలో తన వాటాను స్థిరంగా ఉంచారు. వీటిలో మూడు కంపెనీలు సానుకూల రాబడులనిచ్చాయి.  ఇందులో (2019 లో ఇప్పటివరకు) అయాన్ ఎక్స్ఛేంజ్ 108 శాతం , ఓరియంట్ సిమెంట్ 28 శాతం, ఎంసిఎక్స్ 16 శాతం సానుకూల రాబడులనిచ్చాయి.
మిగిలిన 14 కంపెనీలలో 11 కంపెనీల స్టాక్స్ అంచనాలకు తగ్గట్టుగా ప్రదర్శన చేయలేకపోయాయి. అంతేకాకుండా ప్రతికూలంగా ట్రేడయాయ్యాయి. విటిలో మంధనా రిటైల్ (71 శాతం), ప్రకాష్ ఇండస్ట్రీస్ (41 శాతం ), డెల్టా కార్ప్ (38 శాతం) నష్టపోయాయి. 
   ఝున్‌ఝున్‌వాలా భారతీయ కంపెనీలలో  ఝున్‌ఝున్‌వాలా రాకేశ్ రాధేశ్యం, ఝున్‌ఝున్‌వాలా రేఖా రాకేశ్, రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా (వ్యక్తిగతంగా), రేఖా రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా, రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా (రేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ భాగస్వామ్యంతో) వంటి పేర్లతో పెట్టుబడులు పెట్టారు


గమనిక: పై టేబుల్‌లో ఉన్న సమాచారం కేవలం రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులు 1 శాతం కన్నా ఎక్కువ ఉన్న కంపెనీలకు చెందినది మాత్రమే. ఈ షేరు హోల్డింగ్‌ డేటా జులై 2019 న విడుదలయ్యింది. 
 You may be interested

కోటక్‌ బ్యాంక్‌కు బ్రోకరేజ్‌ సంస్థల బూస్ట్‌

Tuesday 23rd July 2019

4.50శాతం ర్యాలీ చేసిన షేరు  ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ..,  పలు బ్రోకరేజ్‌ సంస్థలు కోటక్‌ బ్యాంక్‌ షేర్లపై రేటింగ్‌ను పెంచాయి.  బ్రోకరేజ్‌ సంస్థల్లో ప్రధానమైన సీఎల్‌ఎస్‌ఏ, జెఫ్పారీస్‌ సంస్థలు ఏడాది కాలానికి ఈ షేర్లపై ‘‘బై’’ రేటింగ్‌ కేటాయింపుతో పాటు షేర్ల టార్గెట్‌ ధరను పెంచాయి. ఫలితంగా ఈ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో షేరు ఇంట్రాడే షేరు 4శాతం ర్యాలీ చేసి రూ.1510.55ల

ప్రింట్‌ను దాటనున్న డిజిటల్ మీడియా

Tuesday 23rd July 2019

2021 నాటికి 5.1 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగంతో ఊతం ఫిక్కీ-ఈవై నివేదికలో వెల్లడి ముంబై: ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా డిజిటల్ మీడియా ఇతరత్రా ప్రింట్, సినిమా మాధ్యమాలను అధిగమించనుంది. 2019లో సినిమా పరిశ్రమను, 2021 నాటికి ప్రింట్ మీడియాను దాటేయనుంది. 2021 నాటికి 5.1 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ-కన్సల్టెన్సీ సంస్థ ఈవై రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

Most from this category