News


క్యూ1 ఫలితాలు, ఆర్థికాంశాలే దిక్సూచి..!

Monday 15th July 2019
Markets_main1563168971.png-27057

  • యస్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బంధన్ బ్యాంక్, ఏసీసీ, విప్రో ఫలితాలు ఈవారంలోనే..
  • బుధ, గురువారాల్లో జి-7 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశం
  • సోమవారం డబ్ల్యూఐపీ డేటా వెల్లడి

న్యూఢిల్లీ: గడిచిన రెండు వారాలుగా నష్టాలను నమోదుచేస్తున్న దేశీ స్టాక్‌ సూచీలకు ఈవారం కీలకంగా మారనుందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. శుక్రవారంనాటి ముగింపుతో రెండు నెలల కనిష్టస్థాయిని నమోదుచేసిన ప్రధాన సూచీలకు క్యూ1 ఫలితాలు, ఆర్థికాంశాలే దిశా నిర్థేశం చేయనున్నాయని అంచనావేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసిక ఫలితాలు ఏమాత్రం ఆశాజనకంగా ఉన్నా.. నిఫ్టీ 11,600 ఎగువన నిలదొక్కుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిరాశాజనకంగా ఉంటే మాత్రం మరింత పతనానికి ఆస్కారం ఉందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధనా విభాగం చీఫ్‌ వినోద్‌ నాయర్‌ విశ్లేషించారు. ‘కొనసాగుతున్న వాణిజ్య వివాదాలకు తోడు తొలి త్రైమాసిక ఫలితాలు నిరాశపరిస్తే సమీపకాలంలో సూచీలు మరింత నష్టపోయేందుకు ఆస్కారం ఉంది. ఇప్పటికే వాల్యూయేషన్స్‌ అధిక స్థాయిలో ఉన్నందున ఈ ఫలితాల కీలక అంశం అండర్‌ పెర్ఫామెన్స్‌కు దారితీసే అవకాశం ఉంది’ అని అన్నారు. 

ఈవారంలోనే ఆర్‌ఐఎల్‌, యస్‌ బ్యాంక్ ఫలితాలు...
శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తరువాత దేశీ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. క్యూ1లో కంపెనీ రూ.3,802 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫలితాల ప్రభావం సోమవారం ఉదయం ఈషేరు కదలికలపై స్పష్టంగా ఉండనుందని, ఈ వారం స్టాక్‌ స్పెసిఫిక్‌ కదలికలకు ఆస్కారం ఉందని ఎస్‌ఎమ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ అడ్వైజర్స్‌ చైర్మన్‌ డీ కే అగర్వాల్‌ అన్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వంటి దిగ్గజ కంపెనీల ఫలితాలు ఈవారంలోనే వెల్లడికానుండగా.. ఫలితాల కారణంగా భారీ ఒడిదుడుకులకు అవకాశం ఉందని అంచనావేశారు. ఇక క్యూ1 ఫలితాలను వెల్లడించనున్న కంపెనీల జాబితాలో.. బజాజ్‌ కన్స్యూమర్‌, టాటా మెటాలిక్స్‌ సోమవారం ఫలితాలను ప్రకటించానున్నాయి. మంగళవారం.. హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మెనేజ్‌మెంట్‌(ఏఎంసీ), ఫెడరల్‌ బ్యాంక్‌, డీసీబీ బ్యాంక్‌, 5పైసా క్యాపిటల్‌ ఫలితాలు వెల్లడికానున్నాయి. బుధవారం.. విప్రో, మణప్పురం, యస్‌ బ్యాంక్‌, ధన్ లక్ష్మి బ్యాంక్‌, ఆదిత్య బిర్లా మనీ, టాటా ఎలాక్సీ క్యూ1 ఫలితాలు ఉన్నాయి. గురువారం.. ఎల్‌ అండ్‌ టీ, సైయంట్‌, హాట్సన్‌ ఆగ్రో, ఏసీసీ, బామర్‌ అండ్‌ లారీ, కాల్గేట్‌ పామోలీవ్‌ ఫలితాలను ప్రకటించనున్నాయి. శుక్రవారం.. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, మహీం‍ద్ర సీఐఈ ఆటోమోటీవ్‌, జేఎం ఫైనాన్సియల్స్‌, హిందుస్తాన్‌ జింక్‌, ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్సియల్‌ హోల్డింగ్స్‌, ఇండిగో, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌), ఐసీఐసీఐ లాంబార్డ్‌, ఫిలిప్స్‌ కార్బన్‌ ఫలితాలు ఉండగా.. శనివారం యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అమర రాజా బ్యాటరీస్‌ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆర్‌ఐఎల్‌ వంటి దిగ్గజ కంపెనీల ఫలితాల ఉన్న కారణంగా స్టాక్‌ స్పెసిఫిక్స్‌ యాక్టన్‌కే ఆస్కారం అధికంగా ఉందని సామ్కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమీత్‌ మోదీ అన్నారు.

స్థూల ఆర్థిక అంశాల ప్రభావం...
పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) డేటా శుక్రవారం వెల్లడికాగా, ఈ అంశం సోమవారం మార్కెట్‌ కదలికలను ప్రభావితం చేయనుందని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈవో ముస్తఫా నదీమ్‌ విశ్లేషించారు. ఈఏడాది జూన్‌ నెల టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) గణాంకాలు 15న వెల్లడికానున్నాయి. ఇక బుధ, గురువారాల్లో ఫ్రాన్స్‌లో జరగనున్న జి-7 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంపై కూడా మార్కెట్‌ వర్గాలు దృష్టిసారించాయి. వాణిజ్య యుద్ధాల సమయంలో ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ఎదుర్కునే అవకాశం ఉన్నందున ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ జరగనుందని భావిస్తున్నాయి.

ముడిచమురు ధరల కలదలికలు కీలకం...
గతవారంలో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ 67 డాలర్లకు సమీపించింది. శుక్రవారం ట్రేడింగ్‌ ముగింపు సమయానికి 66.88 వద్ద ముగిసింది. ముడిచమురు ధర మరింత పెరితే మార్కెట్‌కు ప్రతికూలం కానుందని కమోడిటీ వర్గాలు చెబుతున్నాయి. 

జూలైలో రూ.3,551 కోట్లు ఎఫ్‌పీఐల పెట్టుబడి...
భారత్‌ క్యాపిటల్‌ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. గడిచినవారంలో వీరు మార్కెట్‌ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పటికీ.. ఈనెల్లో ఇప్పటివరకు చూస్తే నికర కొనుగోలుదారులుగానే నిలిచారు. జూలై 1-12 మధ్యకాలంలో రూ.8,505 కోట్లను పెట్టుబడి పెట్టిన ఎఫ్‌పీఐలు.. రూ.4,953 కోట్లను ఉపసంహరించుకోవడం వల్ల వీరి నికర పెట్టుబడి ఇప్పటికి రూ.3,551 కోట్లుగా ఉన్నట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. You may be interested

సెన్సెక్స్‌ తక్షణ నిరోధం 39,020-మద్దతు 38,475

Monday 15th July 2019

ఒకవైపు అమెరికా స్టాక్‌ సూచీలు కొత్త రికార్డులు సృష్టిస్తుండగా, మరోవైపు యూరప్‌, ఆసియా సూచీలు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల తగ్గిస్తే అధిక ప్రయోజనం అందుకునే భారత్‌, చైనా, బ్రెజిల్‌, రష్యా వంటి వర్థమాన మార్కెట్లు...అమెరికా ట్రెండ్‌తో విడివడి నిస్తేజంగా ట్రేడవుతుండటం గత కొద్ది సంవత్సరాలుగా ఎన్నడూ జరగలేదు. ఇది ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌ మార్పునకు సూచనా? ఈ అంశంపై స్పష్టత

స్థిరంగా పసిడి ధర

Monday 15th July 2019

ప్రపంచ మార్కెట్లో పసిడి ధర సోమవారం స్థిరంగా కదలాడుతోంది. ఆసియాలో ఉదయం సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప పెరుగుదలతో 1,413 డాలర్ల  వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా నేడు రెండో త్రైమాసికపు జీడీపీ గణాంకాలను విడుదల చేసింది. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమనంతో పాటు అమెరికాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా ఈ క్యూ2లో చైనా దేశపు వృద్ధిరేటు

Most from this category