News


వచ్చే ఏడాది పీఎస్‌యూలే లీడర్లు: రమేష్‌ దమాని

Wednesday 23rd October 2019
Markets_main1571828001.png-29086

‘నేను పీఎస్‌యూ స్టాకులను కొనుగోలు చేయను, పీఎస్‌యూల వైపు చూడను వంటి మాటలు మార్కెట్‌లో సాధరణమయ్యాయి. ఒకవేళ నువ్వు వాల్యూ ఇన్వెస్టర్‌ అయితే ముఖ్యంగా ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ చేస్తుందని నమ్మితే పీఎస్‌యూ స్టాకులను పరిశీలిస్తావు’ అని బీఎస్‌ఈ మెంబర్‌ రమేష్‌ దమాని ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే..

కొత్త సంవత్‌లో కొత్త లీడర్‌ కావాలి..
ప్రభుత్వం కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించిన తర్వాత మార్కెట్‌ చాలా పాజిటివ్‌గా ప్రతిస్పందించింది. ఆ తర్వాత కూడా మార్కెట్‌లో తిరిగి అమ్మకాలు పెరగడం చూశాం. తాజాగా కొన్ని సెషన్‌ల నుంచి మార్కెట్‌లు పాజిటివ్‌గా కదులుతున్నాయి. మార్కెట్లో ప్రతికూల వార్తలు వినిపిస్తున్నప్పటికి, స్టాకులు గరిష్టాలను తాకతున్నాయి. ఇది గత రెండేళ్ల నుంచి మార్కెట్లు ఎదుర్కొంటున్న అధ్వాన్నపరిస్థితులు తొలగిపోయాయనే సంకేతాలనిస్తుంది. వచ్చే సంవత్‌ ఇన్వెస్టర్లుకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నా.
   2001 నుంచి 2004 మధ్య కాలంలో టెక్నాలజీ బబుల్‌ ఔట్‌ అయ్యింది. ఆ తర్వాత పీఎస్‌యూ  సెక్టార్‌ స్టాకులు గణనీయంగా పెరిగాయి.  మూడేళ్లలోనే ఈ స్టాకులు 600 శాతానికిపైగా లాభపడ్డాయి. కానీ ఆ సమయంలో మార్కెట్లు టెక్నాలజీపై దృష్ఠి సారించాయి. ఇన్ఫోసిస్‌ ఫలితాలు దారుణంగా పడిపోవడంతో నాలాంటి సీనియర్‌ ఇన్వెస్టర్లందరూ మార్కెట్‌ పనైపోయిందని అనుకున్నాం. కానీ అప్పుడే బుల్‌ మార్కెట్‌ ప్రారంభమైంది. బుల్స్‌ను ఇతర రంగాలలోని వాల్యుషన్లు ఆకర్షించాయి. అదే 2003 బుల్‌ రన్‌. ప్రస్తుతం కూడా మనం అలాంటి దశనే ఎదుర్కొంటున్నాం. మార్కెట్‌లు కొత్త నాయకత్వం కోసం వెతుకుతున్నాయి. మంచి కార్పోరేట్‌ పాలన ఉన్న బ్లూచిప్‌ స్టాకులు మార్కెట్‌లను కదుపుతున్నాయి. ఇది రక్షణాత్మక ధోరణిని అనుసరించడమే. కానీ మార్కెట్‌లు కొత్త సంవత్సరంలో కొత్త కథల కోసం ఎదురు చూస్తోంది.

డిజిన్వెస్ట్‌మెంట్‌తో ఆకర్షణగా..
ప్రభుత్వం పీఎస్‌యూ సెక్టార్‌ కంపెనీల వాల్యుషన్‌లను ఆకర్షిణియంగా మారుస్తోంది. బీపీసీఎల్‌, కంటైనర్‌ కార్పోరేషన్‌లో పెట్టుబడుల ఉపసంహరణ వచ్చే ఆరు నెలలో జరిగినట్టయితే వీటి విలువ భారీగా పెరుగుతుంది. 2000 వ సంవత్సరంలో ఐబీపీకి సంబంధించి అరుణ్‌ శౌరి ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ తర్వాత మార్కెట్‌లో విపరీతమైన ఉత్సాహం నెలకొంది. అప్పటి టేప్‌లను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. నాకు తెలిసి మొదటి సరిగా పన్ను చెల్లింపుదారుల సంపద ఉత్పాదకతకు వినియోగిస్తున్నారు. ఫలితంగా ప్రస్తుతం పీఎస్‌యూ డిజెన్వెస్ట్‌మెంట్‌ కాలంలో ఉన్నామని అనిపిస్తోంది.

వాల్యు ఇన్వెస్టరయితే..
పీఎస్‌యూ సెక్టార్‌ ఓ పెద్ద రంగం. ఇందులో బాగా రాణీస్తున్నా, దారుణంగా విఫలమవుతున్న స్టాకులను చూస్తున్నాం. ఒక వేళ  దివాన్‌ హౌసింగ్‌ను, మన్‌పసంద్‌ వంటి కంపెనీలను ఒకే సెక్టార్లో పెడితే ప్రైవేట్‌ సెక్టార్‌ ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తుంది. ఇన్వెస్టర్లు నిర్థిష్టమైన స్టాకులకు ఎన్నుకోవడం ముఖ్యం. వివిధ రంగాల నుంచి వివిధ రకాల కంపెనీలను ఎంచుకోవాల్సి ఉంటుంది. కొన్ని రిసోర్సెస్‌ సెక్టార్‌ చెందిన కంపెనీలు, రక్షణ, రైల్వేకి సంబంధించి ఏక చత్రాధిపత్యాన్ని అనుభవిస్తున్న కంపెనీలు, ఐఆర్‌సీటీసీ వంటి మరికొన్ని  ఈ-కామర్స్‌ కంపెనీలను జాగ్రత్తగా ఎంచుకోవాల్సి వుంటుంది. 
    కొన్ని ప్రభుత్వ రంగ కంపెనీలు గత 20 ఏళ్లలో మంచి ప్రదర్శనను చేశాయి. భారత ఎలక్ట్రానిక్స్‌ 200 రెట్లు బ్యాగర్‌ ప్రదర్శనను చేస్తే, కంటైనర్‌ కార్పోరేషన్‌ మంచి ప్రదర్శన చేసి ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చిపెట్టింది. ఇలాంటి స్టాకులను ఎంచుకోవడం ముఖ్యం. పదేళ్ల బుక్‌ ఆర్డర్‌ ఆశాజనకంగా ఉన్న  పీఎస్‌యూ స్టాకులు ఆకర్షిణీయమైన వాల్యుషన్ల వద్ద లభించడం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గించడం వలన పీఎస్‌యూ స్టాకుల లాభాలు భారీగా పెరుగుతాయి. నేను పీఎస్‌యూ స్టాకులను కొనుగోలు చేయను, పీఎస్‌యూల వైపు చూడను వంటి మాటలు మార్కెట్‌లో సాధారణమయ్యాయి. ఒకవేళ నువ్వు వాల్యు ఇన్వెస్టర్‌ అయితే ముఖ్యంగా ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ చేస్తుందని నమ్మితే పీఎస్‌యూ స్టాకులను పరిశీలిస్తావు.

డీమార్ట్‌ వ్యాపార సూత్రం..
  వినియోగదారులకు విలువాధారిత ఉత్పత్తులను అందించడమే మా వ్యాపార విధానం . ఇండియా మార్కెట్‌ చాలా పెద్దది. మంచి విలువతో వ్యాపారం చేస్తే వినియోగదారులు ఎగబడతారు. దీనిని నా అనుభవ పూర్వకంగా గమనించాను. ముఖ్యంగా ఇలాం‍టి క్లిష్టపరిస్థితులలో వినియోగదారులకు మంచి విలువను అందించాలి. మార్కెట్‌లు చాలా వరకు కార్పోరేట్‌ పాలన బాగున్న, ఎంఎన్‌సీలు, వినియోగ కంపెనీల వైపు ఆకర్షితులవుతారు. చాలా వరకు మంచి కార్పోరేట్‌ పాలన బాగున్న కంపెనీలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అందువలన సాధరణంగా ఇన్వెస్టర్లు స్మాల్‌ క్యాప్‌, మిడ్‌క్యాప్‌లను పట్టించుకోరు. వీటిని రంగాల వారిగా ఎన్నుకోమని అనడం లేదు. కానీ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌లలో బాటమ్‌ ఔట్‌యిన స్టాకులను ఎన్నుకోవడం ముఖ్యం.  పీఎస్‌యూలకు సంబంధించి కూడా కొన్ని మంచి స్టాకులు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్‌ వర్గాలు నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీపై బుల్లిష్‌గా ఉన్నప్పుడు, ఆయన నడిపించే ప్రభుత్వ రంగ కంపెనీలపై ఎందుకు బుల్లిష్‌గా ఉండరని నా కుటుంబ సభ్యులు నాతో  అడిగిన ప్రశ్న గుర్తుకొస్తుంది. You may be interested

సంవత్‌ 2076కు నవరత్నాల్లాంటి సిఫార్సులు

Wednesday 23rd October 2019

వచ్చే ఆదివారంతో సంవత్‌ 2075 ముగిసి 2076 ఆరంభం కానుంది. సంవత్‌ 2075లో నిఫ్టీ దాదాపు 11 శాతం రాబడినిచ్చింది. అయితే లాభాలు కొన్ని రంగాలు, కొన్ని స్టాకులకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం ఎకానమీల్లో మందగమన భయాలు నెలకొన్నాయి. మరోవైపు ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్‌ ఎలాఉంటుందోనన్న ఆసక్తి పెరిగింది. ఇక ఎప్పటిలాగే కొత్త సంవత్‌కు టాప్‌ బ్రోకరేజ్‌లు కొన్ని టాప్‌ స్టాక్స్‌ను రికమండ్‌ చేస్తున్నాయి. కొత్త

స్వల్ప లాభంతో ముగింపు

Wednesday 23rd October 2019

ట్రేడింగ్‌ ఆద్యంతం ఒడిదుడుకుల మధ్య ట్రేడైన సూచీలు చివరికి స్వల్ప లాభంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 95 పాయింట్ల లాభంతో 39,059 వద్ద, నిఫ్టీ 16 పాయింట్లు పెరిగి 11,604 వద్ద స్థిరపడ్డాయి. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానుండటం, యూరోజోన్‌లో బ్రెగ్జిట్‌ అనిశ్చితి తదితర అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌, అటో, ఆర్థిక ఎఫ్‌ఎంజీసీ, ఐటీ, ఫార్మా షేర్లుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు

Most from this category