News


ప్రభుత్వరంగ షేర్ల ర్యాలీ

Monday 11th March 2019
Markets_main1552291061.png-24530

మార్కెట్‌ ర్యాలీలో భాగంగా సోమవారం ప్రభుత్వరంగ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. బీఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బీఎస్‌ఈ పీఎస్‌యూ ఇండెక్స్‌ దాదాపు 3శాతం ర్యాలీ చేసింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల ఒడిదుడుకుల కారణంగా అత్యధికంగా ప్రభుత్వ రంగ పెట్రో మార్కెటింగ్‌ షేర్లు ఎక్కువగా లాభపడుతున్నాయి. యస్‌బీఐ లాంటి ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు, ఇంధన రంగ షేర్లు సైతం ర్యాలీ చేస్తున్నాయి. హెచ్‌పీఎస్‌ఎల్‌, యస్‌బీఐ, బీపీసీఎల్‌, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌ షేర్లు లాభపడుతూ సూచీల స్థిరమైన ర్యాలీకి అండగా నిలుస్తున్నాయి. మధ్యాహ్నం గం.12:30ని.లకు బీఎస్‌ఈ పీఎస్‌యూ ఇండెక్స్‌ 2.80శాతం 2.79 శాతం పెరిగి 7281.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది.
ఇదే సమయానికి మార్కెట్‌ విషయానికొస్తే ఉదయం ఆరంభలాభాలు కొనసాగుతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 330 పాయింట్ల లాభంతో 37000ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 121 పాయింట్ల లాభంతో 11,157 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఐటీ షేర్లు తప్ప అన్ని రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. అత్యధికంగా ప్రభుత్వరంగబ్యాంక్‌, అటో షేర్లు లాభపడుడతున్నాయి.



You may be interested

పరుగా? పతనమా?..

Monday 11th March 2019

11200 పాయింట్లు డిసైడ్‌ చేస్తుంది విశాల్‌ బి మాల్కన్‌ అంచనా ప్రస్తుతం  నిఫ్టీ అత్యంత కీలక సంధి స్థాయి వద్ద ఉందని మాల్కన్స్‌ వ్యూ అధిపతి విశాల్‌ మాల్కన్‌ చెబుతున్నారు. 11,200 పాయింట్ల వద్ద నిఫ్టీ కదలికలు రాబోయే రోజుల్లో పతనమా, పరుగులా? తేల్చేస్తాయన్నారు. ఈ స్థాయిని ఈ వారంలో దాటడం అత్యంత కీలకమని చెప్పారు. ఈ వారంలో 11200 పాయింట్లను దాటడాన్ని బట్టి రాబోయే రెండు వారాల కదలికలుంటాయని చెప్పారు. ఈ

టాప్‌ బ్రోకరేజ్‌ల డాషింగ్‌ డజన్‌ రికమండేషన్లు

Monday 11th March 2019

వచ్చే రెండు, మూడు వారాల్లో మంచి రాబడిని అందించే సత్తా ఉన్న 12 స్టాకులను ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు రికమండ్‌ చేస్తున్నాయి. యస్‌ సెక్యూరిటీస్‌ సిఫార్సులు: 1. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2250. స్టాప్‌లాస్‌ రూ. 2060. వీక్లీ చార్టుల్లో 50 శాతం ఫిబోనాక్కి రిట్రేస్‌మెంట్‌ స్థాయి వద్ద మద్దతు తీసుకొని పాజిటివ్‌గా మారినట్లు కనిపిస్తోంది. రూ.2160 వద్ద త్రిభుజాకార నిరోధ పాటర్న్‌ నుంచి బ్రేకవుట్‌ సాధించేందుకు తయారుగా ఉంది.

Most from this category