News


ప్రైవేటీకరణతో పీఎస్‌యూలకు పుష్‌

Monday 17th February 2020
Markets_main1581931824.png-31859

60 శాతం రిటర్నులకు చాన్స్‌
కార్పొరేట్‌ బ్యాంక్స్‌, బీమా బేష్‌
టెలికంలో ఎయిర్‌టెల్‌, ఆర్‌ఐఎల్‌ 
మిరాయ్‌ అసెట్‌ గ్లోబల్‌ అంచనాల

ప్రైవేటీకరణ జరిగితే ప్రభుత్వ రంగ కంపెనీల షేర్లు దూకుడు చూపుతాయని మిరాయ్‌ అసెట్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెం‍ట్స్‌ సీఐవో రాహుల్‌ చద్దా పేర్కొంటున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించిన కొత్త పన్నుల ప్రతిపాదన నేపథ్యంలోనూ బీమా రంగంపట్ల ఆశావహంగా ఉన్నట్లు ఒక ఇంటర్వ్యూలో చద్దా తెలియజేశారు. హాంకాంగ్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే మిరాయ్‌ నిపుణులు చద్దా.. మార్కెట్లు, ఇన్వెస్ట్‌మెంట్‌కు అనువైన రంగాలు తదితర పలు అంశాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలను చూద్దాం..

15-20 శాతం అప్‌?
కార్పొరేట్‌ ఆర్జనలకు అనుగుణంగా ఈ ఏడాది(2020) దేశీ స్టాక్‌ మార్కెట్లు 15-20 శాతం వరకూ ర్యాలీ చేసే వీలుంది. ప్రస్తుతం గ్లోబల్‌ స్థాయిలో తలెత్తిన కరోనా పరిస్థితులునొక త్రైమాసికంపై ప్రభావం చూపవచ్చు. తదుపరి పరిస్థితులు సర్దుకుంటాయి. డిసెంబర్‌, జనవరిలలో సాధారణంగానే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు, స్టాక్స్‌లో యాక్టివిటీ పెరుగుతూ ఉంటుంది. దేశీయంగానూ ఈ తరహా కదలికలు నమోదయ్యాయి. ఇది వీ షేప్‌ రికవరీకి సంకేతం కాదు. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే.. రికవరీ కొనసాగుతుంది. ప్రధానంగా నాణ్యమైన బిజినెస్‌ నిర్వహిస్తూ అసలు విలువ కంటే దిగువన ట్రేడయ్యే కంపెనీల కౌంటర్లు జోరందుకునే వీలుంది. అంతేగానీ ప్రతీ మిడ్‌ క్యాప్‌ లాభపడుతుందని చెప్పలేం. రానున్న కాలంలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ విభాగంలో మరింత డైవర్జెన్స్‌(ప్రభావం) కనిపించనుంది.

చైనా తరువాతే
మిరాయ్‌ పోర్ట్‌ఫోలియోలో చైనాకు 45 శాతం వాటా ఉంటుంది. ఇండియాకు 20 శాతం వాటా ఉంది. ఇండియాతో పోలిస్తే చైనా ఆరు రెట్లు పెద్దమార్కెట్‌ కావడమే దీనికి కారణం. కాగా.. దేశీ మార్కెట్లలో బీమా రంగం జోరు చూపుతోంది. ఇటీవల ఈ రంగం సాధిస్తున్న వృద్ధి ప్రభావం చూపుతోంది. రక్షణ ఆధారంగా బీమా బిజినెస్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ రంగంలో పన్ను ఆదా కోసం నమోదయ్యే వాటా తక్కువే. దీంతో తాజా పన్ను ప్రతిపాదనల నేపథ్యంలో స్వల్ప కాలంలో కొంత ప్రతికూలతలు కనిపించినప్పటికీ.. దీర్ఘకాలంలో మంచి ప్రతిఫలాలు సాధించగలదు.

కన్జూమర్‌ గుడ్‌
కన్జూమర్‌ రంగంలో అధిక వృద్ధి రేటుకు అవకాశముంది. దీంతో కన్జూమర్‌ కంపెనీలలోనూ కొంతమేర ఇన్వెస్ట్‌ చేశాం. మొత్తం పోర్ట్‌ఫోలియోలో ఈ వాటా తక్కువే. ఇప్పటికే ఎక్స్‌పోజర్‌ కలిగిన కార్పొరేట్‌ బ్యాంక్స్‌,  బీమా, రియల్టీ, హాస్పిటల్స్‌లో పెట్టుబడులపై దృష్టి సారించాం. కాగా.. పీఎస్‌యూలలో మంచి అవకాశాలున్నాయి. ప్రభుత్వం వీటిని ప్రయివేటైజ్‌ చేస్తే.. ప్రస్తుత స్థాయిల నుం‍చి 50-60 శాతం వరకూ కొన్ని కౌంటర్లు ర్యాలీ చేసే అవకాశముంది. టెలికంలో భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో మాతృ సంస్థ ఆర్‌ఐఎల్‌లో మాత్రమే ఇన్వెస్ట్‌ చేశాం. 

బడ్జెట్‌ ఓకే
ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే అంశాలపై బడ్జెట్‌ బాగానే స్పందించింది. బాండ్లలో విదేశీ పెట్టుబడుల పరిమితి పెంపు, సావరిన్‌ ఫండ్లను అనుమతించడం వంటి సానుకూల అంశాలకు బడ్జెట్‌ చోటిచ్చింది. బడ్జెట్‌ అంచనాలు రీజనబుల్‌గానే ఉన్నాయి. మూడు నుంచి ఐదేళ్ల కాలానికి ఫలితాలు కనిపించవచ్చు. 10 శాతం జీడీపీ వృద్ధి అంచనాలు అందుకోదగ్గవే. అయితే సమీప కాల పరిస్థితులపైనే మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి. ఇటీవల విదేశీ మారక నిల్వలు 410 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దేశీ ఆర్థిక వ్యవస్థలో 70 బిలియన్‌ డాలర్ల లిక్విడిటీ కొనసాగుతోంది. నిల్వలు తగ్గుతుండటంతోపాటు.. కొత్త ఆర్డర్లు పుంజుకుంటున్నాయి. 
 You may be interested

బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ హైజంప్‌- గ్రాఫైట్‌ బోర్లా

Monday 17th February 2020

క్యూ3 ఫలితాల ప్రభావం బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ 10 శాతం అప్‌ గ్రాఫైట్‌ ఇండియా 5.5 శాతం పతనం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతోపాటు.. వచ్చే ఏడాది(2020-21)కి ఆశావహ అంచనాలు(గైడెన్స్‌) ప్రకటించడంతో ఆఫ్‌రోడ్‌ టైర్ల తయారీ దిగ్గజం బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. అయితే మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో రివర్స్‌ టర్న్‌ అరౌండ్‌ ఫలితాలు ప్రకటించడంతో గ్రాఫైట్‌ ఇండియా కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి బాలకృష్ణ

భారతీ ఎయిర్‌టెల్‌ టార్గెట్ రూ.650: మోతీలాల్‌ ఓస్వాల్‌

Monday 17th February 2020

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీ సోమవారం టెలికాం శాఖకు తక్షణ చెల్లింపుగా రూ.10 కోట్లను చెల్లించింది. మిగిలిన ఏజీఆర్‌ బకాయిలను మదింపు చేసుకొని మార్చి 17లోగా చెల్లిస్తామని టెలికాం శాఖకు తెలిపింది.  ఫలితంగా నేటి మధ్యాహ్నం ట్రేడింగ్‌ సెషన్‌లో ఎయిర్‌టెల్‌ షేరు అరశాతం పెరిగి రూ.568 వద్ద ట్రేడ్‌ అవుతోంది. గణాంకాల ప్రకారం టెలికాం శాఖకు భారతీ ఎయిర్‌టెల్‌ మొత్తం రూ.35,586 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎయిర్‌టెల్‌

Most from this category