News


డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రణాళికతో పీఎస్‌యూ షేర్లకు డిమాండ్‌

Friday 18th October 2019
Markets_main1571392330.png-28984

కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రణాళిక ఆచరణకు రంగం సిద్ధం చేసిందనే వార్తలు వెలుగులోకి రావడంతో శుక్రవారం పలు ప్రభుత్వరంగ షేర్లకు డిమాండ్‌ నెలకొంది. బీఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే  బీఎస్‌ఈ పీఎస్‌యూ ఇండెక్స్‌ మధ్యాహ్నం 3:00ల సమయానికి 2.50శాతం లాభంతో 6,857.84 వద్ద ట్రేడ్‌ అవుతోంది. పలు పీఎస్‌యూ షేర్లు అధిక పరిమాణంతో ట్రేడవుతూ దాదాపు ర్యాలీ చేశాయి. భెల్‌, హిందుస్థాన్‌ కాపర్‌, ఎంఎంటీసీ, న్యూ ఎస్యూరెన్స్‌ షేర్లు 11శాతానికి పైగా లాభపడ్డాయి. మెయిల్‌, ఎన్‌బీసీసీఐ, ఎన్‌సీఎల్‌ ఇండియా, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా, నాల్కో, సెయిల్‌ ఐఎఫ్‌సీఐ, షిప్పింగ్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు 5నుంచి 10శాతం లాభపడ్డాయి. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, ఇండియా టూరిజమ్‌ డిపార్ట్‌మెంట్‌ షేర్లు 7నుంచి 4శాతం లాభపడి ఏడాది గరిష్టస్థాయిలను అందుకున్నాయి.

 



You may be interested

ఆటో రంగంలో బజాజ్‌,టీవీఎస్‌, మారుతి షేర్లే బెటర్‌!

Friday 18th October 2019

‘ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యనైనా తీసుకుంటుందనే ఆలోచన మార్కెట్‌ వర్గాలలో పెరుగుతోంది. దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికి మార్కెట్‌ సెంటిమెంట్‌ మాత్రం బలపడుతుందనే విషయాన్ని గమనించాలి’ అని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ సీఈఓ, నిశ్చల్ మహేశ్వరి ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే... పీఎస్‌యూ బ్యాంక్‌లకు దూరం.. ఎస్‌బీఐ, బ్యాంక్‌ బరోడా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్‌యూ బ్యాంక్‌లు)ను మినహాయిస్తే, చాలా

ఆరామ్‌కో ఆసక్తి.. బీపీసీఎల్‌ ర్యాలీ

Friday 18th October 2019

దేశీయ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ బీపీసీఎల్‌(భారత పెట్రోలియం)లో 53.29 శాతం ప్రభుత్వ వాటాను విక్రయించేందుకు, కేంద్ర ప్రభుత్వం సిద్ధపడడంతో ఈ కంపెనీ షేరు గత కొన్ని సెషన్‌ల  నుంచి ర్యాలీ చేస్తోంది. దీనితో పాటు బీపీసీఎల్‌ వాటాను విక్రయించేందుకు, వ్యూహాత్మక ఇన్వెస్టర్‌ కోసం ప్రభుత్వం వివిధ అంతర్జాతీయ ఆయిల్‌, గ్యాస్‌ కంపెనీలకు బిడ్‌లు దాఖలు చేయమని ఆహ్వానం పంపింది. సౌదీ అరేబియాకు చెందిన ప్రఖ్యాత చమురు కంపెనీ సౌదీ ఆరాంకో,

Most from this category