News


సుప్రీం ఎఫెక్ట్‌: పీఎస్‌యూలకు దెబ్బ..!

Friday 14th February 2020
Markets_main1581676572.png-31802

ఏజీఆర్‌ అంశంలో టెలికాం కంపెనీల తీరుపై సుప్రీం కోర్టు మండిపడటంతో ఇతర పీఎస్‌యూ కంపెనీలు తన ఏజీఆర్‌ మోడిఫికేషన్‌ పిటీషన్లను ఉపసంహరించుకున్నాయి. గెయిల్‌ ఇండియా, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌, పవర్‌గ్రిడ్‌లతో పాటు ఇతర ప్రభుత్వ రంగ కంపెనీలు రూ.1.72లక్షల కోట్ల ఏజీఆర్‌ బకాయిలను చెల్లించాల్సి ఉంది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌, పవర్‌గ్రిడ్‌లు కంపెనీలు పిటిషన్లు ఉపసంహరించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇంట్రాడేలో ఈ కంపెనీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. 

గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌ షేరు 6శాతం నష్టంతో రూ.122.60 వద్ద ముగిసింది. 
ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ షేరు 2.72శాతం నష్టంతో రూ.130.45 వద్ద ముగిసింది
పవర్‌గ్రిడ్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా షేరు రూ.3.26శాతం నష్టంతో రూ.184.15 వద్ద ముగిసింది.

వీటితో పాటు న్యూ ఇండియన్‌ అసూరెన్స్‌ ఇండియా 2.30శాతం, ఎన్‌టీపీసీ, జనరల్‌ ఇండియా అస్యూరెన్స్‌, ఓఎన్‌జీసీ, గెయిల్‌, ఎన్‌ఎండీసీ, కంటైనర్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా, 1.50శాతాన్ని నష్టాన్ని చవిచూశాయి. భెల్‌, కోల్‌ ఇండియా, నాల్కో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎన్‌హెచ్‌పీసీ షేర్లు 1శాతం నుంచి అరశాతం నష్టంతో ముగిశాయి. 



You may be interested

తొలుత హుషార్‌- తుదకు బేజార్‌

Friday 14th February 2020

సెన్సెక్స్‌ 200 పాయింట్లు డౌన్‌ తొలుత లాభాల డబుల్‌ సెంచరీ నిఫ్టీ 61 పాయింట్ల వెనకడుగు తొలుత ఎస్‌అండ్‌పీ.. దేశ సావరిన్‌ రేటింగ్‌కు స్టేబుల్‌ ఔట్‌లుక్‌ను ప్రకటించడంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు టెలికం కంపెనీలు ఏజీఆర్‌ బకాయిలను చెల్లించకపోవడంపై సుప్రీం కోర్టు సీరియస్‌కావడంతో డీలాపడ్డాయి. వెరసి తొలుత లాభాల డబుల్‌సెంచరీ చేసిన సెన్సెక్స్‌ చివరికి అదే స్థాయిలో నష్టపోయింది. 202 పాయింట్లు క్షీణించి 41,258 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 61 పాయింట్లు

తగ్గిన జీవీకే నష్టాలు

Friday 14th February 2020

జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ శుక్రవారం క్యూ3 ఫలితాలను వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో  ఈ కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర నష్టం నామమాత్రంగా తగ్గి రూ.120.06 కోట్లకు చేరింది. కాగా క్రితం ఆర్థికసంవత్సరం ఇదే త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ నికర నష్టం రూ.122.61 కోట్లుగా ఉందని బీఎస్‌కీ ఇచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది. కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో నమోదైన రూ.1,109.28

Most from this category