News


వెలుగులోకి ప్రభుత్వరంగ షేర్లు : గెయిల్‌ ఇండియా 2శాతం ర్యాలీ

Tuesday 31st December 2019
Markets_main1577785541.png-30562

నష్టాల మార్కెట్లో ప్రభుత్వ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా మంగళవారం మిడ్‌సెషన్‌ కల్లా బీఎస్‌ఈ పీఎస్‌యూ ఇండెక్స్‌ 1శాతం లాభపడింది. నేడు ఈ ఇండెక్స్‌ 6,931.20 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  ప్రభుత్వరంగ షేర్లైన కోల్‌ ఇండియా, గెయిల్‌, జనరల్‌ ఇన్సూరెన్స్‌, ఎన్‌టీపీసీ, ఆర్‌ఈసీ, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్లు షేర్లు 2శాతం నుంచి 1శాతం లాభపడ్డాయి. బీహెచ్‌ఈఎల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌, న్యూ ఇండియా అస్యూరెన్స్‌,  ఆయిల్‌ ఇండియా, ఎన్‌ఎండీసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఓఎన్‌జీసీ, నాల్కో, కంటైనర్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు అరశాతం వరకు లాభపడ్డాయి. ఫలితంగా బీఎస్‌ఈ పీఎస్‌యూ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 1.10శాతం పెరిగి 6989 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2:50ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు 6922తో పోలిస్తే అరశాతం లాభంతో 6955 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

2020లో పెట్టుబడులకు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ బెట్స్‌

Tuesday 31st December 2019

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌: 2020 స్టాక్‌ పిక్స్‌ విభిన్న రంగాల నుంచి 23 స్టాక్స్‌ ఎంపిక జాబితాలో ఫైనాన్స్‌, ఆటో, ఫార్మా, టెక్‌ సెక్టార్స్‌ దేశీ రీసెర్చ్‌ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కొత్త ఏడాది(2020)లో పెట్టుబడులకు అనువైన 23 స్టాక్స్‌ను ఎంపిక చేసింది. వీటిని విభిన్న రంగాల నుంచి ఎంచుకుంది. జాబితాలో ఫైనాన్షియల్స్‌, కన్జూమర్‌, ఫార్మా, ఇండస్ట్రియల్స్‌, ఆయిల్‌, ఆటోమొబైల్‌, సిమెంట్‌, టెక్నాలజీ రంగాలకు చోటు లభించడం గమనార్హం. గత మూడు నెలల్లో దేశీయంగా స్టాక్‌

10 శాతం రాబడికి మూడు రికమండేషన్లు

Tuesday 31st December 2019

వచ్చే నెల రోజుల్లో దాదాపు 10 శాతం వరకు రాబడినిచ్చే మూడు స్టాకులను బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేశాయి. 1. వరుణ్‌ బెవరేజెస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 790. స్టాప్‌లాస్‌ రూ. 680. డైలీ చార్టుల్లో స్వల్పకాలిక నిరోధం రూ. 713ను దాటి బ్రేకవుట్‌ సాధించింది. స్టాకు ప్రస్తుతం తన కీలక డీఎంఏలకు పైన కదలాడుతోంది. ఆర్‌ఎస్‌ఐ, ఎంఏసీడీ బుల్లిష్‌గా మారాయి.  2. సుదర్శన్‌ కెమికల్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 450. స్టాప్‌లాస్‌ రూ.

Most from this category