News


క్షీణించిన ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు

Tuesday 30th July 2019
Markets_main1564471619.png-27410

మార్కెట్లో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్ల పతనం కొనసాగుతుంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లకు ప్రాతనిథ్యం వహించే పీఎస్‌యూ బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మంగళవారం మిడ్‌సెషన్‌ సమయానికి దాదాపు 2.50 శాతం నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 2,853.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ ఒకదశలో దాదాపు 2శాతం మేర నష్టపోయి 2778.55ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. మధ్యాహ్నం గం.12:30ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(2,848.50) 1.60శాతం నష్టంతో 2,803.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 5శాతం నష్టపోయింది. యూనియన్‌ బ్యాంక్‌, ఇండియా బ్యాంక్‌ షేర్లు 3.50శాతం క్షీణించాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పీఎన్‌బీ షేర్లు 3శాతం పతనమయ్యాయి. కెనరా బ్యాంక్‌,  ఓరియంటల్‌ బ్యాంక్‌, సిండేకేట్‌ బ్యాంక్‌ షేర్లు 2 శాత నష్టపోగా, జమ్మూ&కాశ్మీర్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంకు షేర్లు 1శాతం పతనమయ్యాయి. అలాగే సెంట్రల్‌ బ్యాంక్‌, అలహదాబాద్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం వరుకు నష్టపోయాయి. 

ఇదే సమయానికి ఆరంభలాభాల్ని కోల్పోయిన సూచీలు ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. సెన్సెక్స్‌ 45 పాయింట్లు లాభంతో 37735.55 వద్ద, నిఫ్టీ 3 పాయింట్లు స్వల్ప లాభంతో 11191.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

మార్కెట్లో పాజిటివ్‌ మార్పు రానుందా?

Tuesday 30th July 2019

బుల్లిష్‌గా మారొచ్చని సంకేతాలిస్తున్న బాండ్‌ఈల్డ్స్‌ దేశీయ మార్కెట్లో కొనసాగుతున్న అమ్మకాల వెల్లువకు శుభం కార్డు పడనుందా? త్వరలో ట్రెండ్‌ రివర్సల్‌ కనిపించనుందా? సూచీలు తిరిగి బుల్‌రన్‌ ఆరంభించబోతున్నాయా?.. అంటే.. అవునంటున్నారు కొంతమంది టెక్నికల్‌ నిపుణులు.  నిఫ్టీ ఎర్నింగ్స్‌ ఈల్డ్స్‌కు, పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌కు మధ్య అంతరం కుంచించుకుపోవడం ఇందుకు నిదర్శనమంటున్నారు టెక్నికల్‌ నిపుణులు. ఈ విధంగా ఈ రెండింటి మధ్య తేడా తగ్గిపోవడమనేది సూచీల్లో పతనం ఇకపై కొనసాగకపోవచ్చనేందుకు సంకేతంగా భావిస్తున్నారు. ప్రస్తుతం

25 స్టాకుల్లో బుల్లిష్‌ సంకేతాలు!

Tuesday 30th July 2019

ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.   బుల్లిష్‌ సిగ్నల్స్‌ సోమవారం

Most from this category